దీని శాస్త్రీయ నామము Curcuma zedoaria of the Zingiberaceae family. దీనికి ఉన్న అనేక తెలుగు పేర్లలో కొన్ని: కచోరము, కచూరము; కచ్ఛూరకము, కర్చూరము; గంధకచోరము, గంట్లకౘోరము, తెల్ల పసుపు, ఎఱ్ఱకసింద. సంస్కృతంలో షడ్గ్రంథ. ఇంగ్లీషులో zedoary. ఇది ఒక బహువార్షిక మొక్క. దీని స్వస్థలం భారతదేశం, ఇండోనేసియా అయినప్పటికీ ఇటీవల దీని అనేక దేశాలలో పెంచుతున్నారు.[2] అల్లం వాడుకలోకి వచ్చిన తరువాత దీని వాడుక తగ్గిందనే చెప్పాలి. .

Zedoary
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. zedoaria
Binomial name
Curcuma zedoaria
(Christm.) Roscoe
Synonyms[1]
  • Amomum latifolium Lam.
  • Amomum latifolium Salisb.
  • Amomum zedoaria Christm.
  • Costus luteus Blanco
  • Curcuma malabarica Velay., Amalraj & Mural.
  • Curcuma pallida Lour.
  • Curcuma raktakanta Mangaly & M.Sabu
  • Curcuma speciosa Link
  • Erndlia zerumbet Giseke
  • Roscoea lutea (Blanco) Hassk.
  • Roscoea nigrociliata Hassk.

లక్షణాలు

మార్చు

కచోరము  ఉష్ణమండలాలలోను, సమశీతోష్ణ మండలాలలోనూ, తడిగా ఉన్న అటవీ ప్రాంతాలలో పెరుగుతుంది. సువాసనతో ఉండే ఈ మొక్క పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి. నేల అడుగున కాండం ఊరి దుంపలా అవుతుంది.

ఉపయోగాలు

మార్చు

తినడానికి పనికొచ్చే దుంప లోపల తెల్లగా ఉండి, మామిడిపండు వాసన వేస్తూ ఉంటుంది. రుచికి మాత్రం అల్లం రుచిని పోలి ఉంటుంది కాని అల్లం కంటె చేదుగా ఉంటుంది. ఇండోనేసియాలో దీనిని పొడి చేసి కూరలలో జల్లుకుంటారు. భారతదేశంలో దీనితో ఊరగాయ పెడతారు. థాయిలాండ్లో దీనిని సన్నగా తరిగి సాలడ్ లో వేసుకుంటారు.


ఈ మొక్క దుంపలనుండి తయారు చేసే సారభూత తైలాలు (essential oils) సుగంధ ద్రవ్యాలలోనూ, సబ్బుల రూపకల్పనలోనూ, చేదుగా ఉండే బలవర్ధక చోష్యాలు (syrups) లోనూ ఉపయోగిస్తారు. The curcuminoid 1,7-bis(4-hydroxyphenyl)-1,4,6-heptatrien-3-one, and the sesquiterpenes procurcumenol and epiprocurcumenol can be found in C. zedoaria.[3]

బాహ్య లింకులు

మార్చు

) (Japanese)

సూచనలు

మార్చు
  1. The Plant List
  2. Flora of North America
  3. A Curcuminoid and Sesquiterpenes as Inhibitors of Macrophage TNF-α Release from Curcuma zedoaria.
"https://te.wikipedia.org/w/index.php?title=కచోరము&oldid=4308381" నుండి వెలికితీశారు