కట్టావారిపాలెం (సత్తెనపల్లి)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
(కట్టావారిపాలెం(సత్తెనపల్లి) నుండి దారిమార్పు చెందింది)

కట్టావారిపాలెం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కట్టావారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కట్టావారిపాలెం is located in Andhra Pradesh
కట్టావారిపాలెం
కట్టావారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°23′01″N 80°13′29″E / 16.383567°N 80.224775°E / 16.383567; 80.224775
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం సత్తెనపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ దాసరి సాంబయ్య
పిన్ కోడ్ 522403
ఎస్.టి.డి కోడ్

గ్రామములోని మౌలిక సదుపాయాలు

మార్చు

రక్షిత మంచినీటి పథకం

మార్చు

1962 లో, రు. 8 లక్షలతో ఏర్పాటుచేయబడిన ఈ పథకం, ఏడాది పొడవునా ప్రజల దాహార్తి తీర్చుచున్నది. పాలకులు, అధికారుల కృషికి, గ్రామస్తుల సహకారం తోడవడంతో, మండలంలో 365 రోజులూ త్రాగునీటి సరఫరా జరుగుచున్న పథకంగా గుర్తింపు పొందింది.

శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయము:- కట్టావారిపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని 2014,ఏప్రిల్ 27వతేదీ బుధవారం నాడు అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే ఆలయంలో గణపతి ప్రార్థన, ప్రత్యేకపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, సాయంత్రం లక్ష్మీగణపతి అనుష్పానాలు, మంత్రపుష్పం, విశేస పూజలు నిర్వహించారు. కట్టావారిపాలెం గ్రామాల ప్రజలు, వారి బంధువులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్ధ ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగలా తిలకించారు.

సమీప గ్రామాలు

మార్చు

కొర్రపాడు 3 కి.మీ, నందిగామ 4 కి.మీ, కంటేపూడి 1.5 కి.మీ, గుడిపూడి 5 కి.మీ.

మూలాలు

మార్చు