కట్టా రంగారావు

కట్టా రంగారావు తెలుగు సిసిమా దర్శకుడు.

జీవిత విశేషాలుసవరించు

తెలంగాణకు చెందిన ఈ డైరెక్టర్ కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చాడు. అతను 1957 మే 5న జన్మించాడు. అతను ఇంద్రధనుస్సు చిత్రంతో దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. 1990ల్లో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించాడు. ఇంద్ర ధనుస్సు, ఆఖరి క్షణం, ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు, వారెవా మొగుడా, చెప్పుకోండి చూద్దాం లాంటి చిత్రాలను రూపొందించాడు. 40ఏళ్ల‌కు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయ‌న దర్శకుల సంఘంలోనూ ప‌నిచేశాడు. తన సినీ కెరీర్ ఆరంభంలో విప్లవ భావజాల సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు.అతను చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. [1] అతను 2019, జనవరి 14న అనారోగ్యంతో కన్నుమూశాడు[2].

మూలాలుసవరించు

  1. "తెలంగాణ సినీ దర్శకుడు రంగారావు ఇకలేరు!".
  2. "ప్రముఖ దర్శకుడు కట్టా రంగారావు కన్నుమూత."

బయటి లంకెలుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కట్టా రంగారావు పేజీ