కడలెకాయి పరిశే
కడలెకాయి పరిశే (కన్నడ: ಕಡಲೆಕಾಯಿ ಪರಿಶೆ), సంవత్సరానికి ఒక సారి బెంగుళూరులో జరుపుకునే వేరుశనగకాయల సంత. ఈ రెండు రోజుల సంత బసవన్గుడి లోని దొడ్డ గణపతి ఆలయం వద్ద జరుగుతుంది. వేరుశనగలే కాకుండా ఈ సంతలో గాజులు, సాంప్రదాయ బొమ్మలు, మట్టి వస్తువులు, ప్లాస్టిక్ గాజుతో చేసిన బొమ్మలు, గోరింటాకు పెట్టే అంగళ్ళు ఉంటాయి. బజ్జీ, బోండా, పంచదార చిలకలు, చక్కర తో చేసిన కొన్ని మిఠాయిలు, రంగు రంగు సోడా నీళ్ళు అమ్ముతారు. ఈ సంతని ప్లాస్టిక్ రహితంగా పర్యావరణానికి హాని కలగకుండా ఉండటం కోసం 2015లో బీఎంఎస్ కళాశాల విద్యార్థులు 50,000 వస్త్రపు సంచులని అమ్మకపుదారులకి పంచారు.
పేరు వెనుక కథ
మార్చుకడలెకాయి పరిశే, కన్నడ భాష పదం, దీనర్ధం వేరుశనగకాయల సంత అని వస్తుంది.[1]
చరిత్ర
మార్చుఒకప్పుడు బసవన్గుడి ప్రాంతం సుంకేనహళ్ళి, గుట్టహళ్ళి, మావళి, దాసరహళ్లి ఇంకా ఇతర గ్రామాల మధ్య ఉండేది. ఈ అన్ని ఊర్లలోనూ వేరుశనగ ప్రధాన పంట. ప్రతి పొర్ణమి నాడు ఒక ఎద్దు ఈ పంట పొలాల్లోకి చొరబడి పంటకు నష్టం కలిగించేది. రైతులంతా కలిసి బసవ(శివుడి వాహనమైన నంది) ని ప్రార్థించి, పూజలు చేసి వారి తోలి కోతను సమర్పిస్తామని మొక్కుకున్నారు. కొద్ది కాలానికే ఆ ప్రాంతంలో ఒక నంది విగ్రహం బయట పడింది. ఆ విగ్రహం పెరుగుతూ ఉంటే రైతులు దాని తలపై ఒక మేకు ను గుచ్చారు, అక్కడితో ఆ విగ్రహం పెరగటం ఆగిపోయింది. ఈనాటికీ ఆ మేకు త్రిశూలం ఆకారంలో నంది విగ్రహం పై కనిపిస్తుంది. తరువాత 1537లో కెంపెగౌడ దొడ్డ బసవ కి ఒక గుడి కట్టి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఈ గుడిని ఎద్దు గుడి అంటారు. అప్పటి నుండి ప్రతి ఏడాది రైతులు తమ తొలి పంటను ఇక్కడకు తెచ్చి సమర్పించుకుంటారు. ఆ పూజ జరిగే సమయంలోనే సంత కూడా జరుగుతుంది.
బయటి లంకెలు
మార్చువేరుశనగ పండగ : http://bangalore.citizenmatters.in/articles/view/52-arts-and-culture-heritage-fun-in-a-nutshell-kadlekai-parishe