కత్తిమండ ప్రతాప్
కత్తిమండ ప్రతాప్ కవి, సాహితీవేత్త. కవి సంగమం రచయితలలో ఒకరు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ రాష్ట్ర సభ్యుడిగా ఎంపికయ్యాడు.[1][2] 2016లో వర్థమాన రచయితల వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.[3]
కత్తిమండ ప్రతాప్ | |
---|---|
![]() కత్తిమండ ప్రతాప్ | |
జననం | ప్రతాప్ 1978 జనవరి 21 సఖినేటిపల్లి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ![]() |
వృత్తి | జర్నలిస్ట్ అండ్ ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్, రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | ఉషాజ్యోతి |
పిల్లలు | మహీత్, ప్రణయ్ |
తండ్రి | ప్రభాకరరావ్ |
తల్లి | కన్నమ్మ |
జననంసవరించు
కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు 1978, జనవరి 21న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి లో జన్మించాడు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగంసవరించు
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా, మలికిపురం లో నివసిస్తున్నాడు. జర్నలిస్ట్ అండ్ ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు.
వివాహంసవరించు
వీరికి ఉషాజ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (మహీత్, ప్రణయ్)
ప్రచురితమయిన మొదటి కవితసవరించు
మొదటి కవిత అంకురం, ఆంధ్రభూమి వీక్లీలో ప్రచురితం అయింది.
రచనల జాబితాసవరించు
- నాలుగు కవితా సంకలనాలు ప్రచురితం. ముద్రణ దశలో పిచ్చోడి చేతులో పె(గ)న్ను కవితాసంకలనం
- ఇంతవరకు 800పైనే కవితలు రాశాడు. 600పైగా కవితలు సేవ, మయూరి, ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ, ఎంప్లాయిస్ వాయిస్ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
- కథలు 9-వివిధ పత్రికల్లో ప్రచురితం.
- 14 నాటకాలు, 3 టెలిఫిల్మ్స్ రాశాడు.
- 200పైగా వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితం
- మయూరి వీక్లీలో కాలమిస్ట్ గా పనిచేసాడు
- ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పనిచేసాడు
ప్రచురితమయిన పుస్తకాల జాబితాసవరించు
- పగిలిన అద్దం (కవితా సంపుటి, 2012)
- మట్టిరాతలు కవితా సంపుటి, 2014 )
- దెయ్యం బాబోయ్ (నవల 1998)
- రాలిపోయే కాలం (కవితా సంపుటి 2015)[4]
- దృశ్యం (2016)
- గల్ఫ్ వల(స)లో జీవితాలు (2016)
బహుమానాలుసవరించు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గుర్రం జాషువా పురస్కారం 2017 అందుకున్నాడు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం -2016 అందుకున్నాడు
- అమెరికా న్యూ లైఫ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోడం
- మాప్స్ ద్వారా "సాహిత్య భూషణ్" అవార్డ్ అందుకోడం
- రోటరీ క్లబ్ నుండి "సాహితీ రత్న అవార్డ్"
- వర్ధమాన రచయితల వేదిక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం
- వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో అనేకసార్లు ప్రథమ బహుమతి
- గోదావరి పుష్కరాలు కవితా పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించడం
- ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం - కన్వీనర్ గా
- తెలుగు రక్షణ వేదిక జాతీయ కార్యదర్శిగా
చిత్రమాలికసవరించు
గద్దర్ లో కత్తిమండ ప్రతాప్
కవి యాకూబ్ తో కత్తిమండ ప్రతాప్
మూలాలుసవరించు
- ↑ ప్రజాశక్తి, తూర్పు గోదావరి (14 February 2019). "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ స్టేట్ మెంబర్‌గా ప్రతాప్". Dailyhunt. Retrieved 3 December 2020.
- ↑ ఈనాడు, తూర్పు గోదావరి (19 March 2019). "ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయిత సంఘం ఏర్పాటు". Sakshi. Archived from the original on 5 December 2016. Retrieved 3 December 2020.
- ↑ సాక్షి, జిల్లాలు (3 December 2016). "రచయితల వేదిక అధ్యక్షుడిగా కత్తిమండ". Sakshi. Archived from the original on 5 December 2016. Retrieved 3 December 2020.
- ↑ ప్రజాశక్తి (17 October 2015). "ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం ప్రారంభం". Retrieved 27 July 2016.