కత్తెర గంగాధర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989 నుండి 1994 వరకు బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

కత్తెర గంగాధర్

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1994
నియోజకవర్గం బాన్సువాడ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
బాన్సువాడ, కామారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
నివాసం బాన్సువాడ

రాజకీయ జీవితం

మార్చు

కత్తెర గంగాధర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1984 నుండి 1989 వరకు బాన్సువాడ ఎంపీపీగా పని చేశాడు. ఆయన 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆర్‌.వెంకట్రాం రెడ్డి పై 2443 ఓట్ల మెజారిటీతో తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికయ్యాడు.[1] ఆయన ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో నియోజకవర్గ కేంద్రంలో ఏరియా ఆసుపత్రి, బస్సు డిపో మంజూరీ చేయించాడు.

కత్తెర గంగాధర్ 1994లో జరిగిన ఎన్నికల్లో టికెట్‌ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌గా పని చేశాడు.[2] ఆయన 2017లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అక్టోబరు 30న కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[3]

మూలాలు

మార్చు
  1. Sakshi (13 November 2018). "సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  2. Sakshi (9 November 2018). "కాంగ్రెస్‌ దూకుడు". Retrieved 25 November 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Telugu One (30 October 2017). "కాంగ్రెస్ పార్టీలోకి జంప్: రేవంత్ రెడ్డి వెంట వెళ్లే టీమ్ ఇదే". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.