కన్నుల్లో నీ రూపమే

కన్నుల్లో నీ రూపమే 2018 జూన్ 29 న విడుదలైన తెలుగు సినిమా.[1]

కథ మార్చు

స‌న్నీ (నందు) స‌ర‌దాగా గ‌డిపే ఓ కుర్రాడు. బ‌స్టాప్‌లో సృష్టి (తేజస్విని ప్ర‌కాష్‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అత‌నిపై తేజ‌స్వినికి కూడా ప్రేమ ఉన్నా తొంద‌ర‌గా బ‌య‌ట పెట్ట‌దు. కొన్నాళ్ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు స‌న్నీని ప్రేమిస్తున్నాన‌ని చెబుతుంది. అయితే అప్ప‌టికీ త‌మ ప్రేమ‌ని తన సోద‌రుడు ఒప్పుకుంటాడో లేదో అనే భ‌యం ఆమెని వెంటాడుతుంటుంది. తమ స్నేహితుల వివాహాలైన నాలుగు రోజుల్లోనే తామూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు సన్నీ, సృష్టి. ఇంత‌లో సన్నీ త‌న జీవితంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ని సృష్టితో చెబుతాడు. ఇంత‌కీ సన్నీ జీవితంలో జ‌రిగిన ఆ సంఘ‌ట‌న ఏంటి? సృష్టితో అత‌ని పెళ్లి జ‌రిగిందా? లేదా? వీళ్ల పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? త‌దిత‌ర విషయాలు మిగిలిన కథలో భాగం

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • సంగీతం : సాకేత్ కోమండురి
  • ఛాయాగ్ర‌హ‌ణం: ఎన్‌.బి. విశ్వకాంత్ , సుభాష్ దొంతి
  • సమర్పణ: రాజమౌళి .ఇ
  • నిర్మాత: భాస్కర్ భాసాని
  • ర‌చ‌న‌, దర్శకత్వం: బిక్స్ ఇరుసడ్ల‌

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-03-31. Retrieved 2018-07-14.

బయటి లంకెలు మార్చు