కారుణ్య చౌదరి (జననం 1993 మార్చి 16) భారతీయ నటి. ఆమె ప్రధానంగా తెలుగు సినిమాలకు పనిచేస్తుంది. 2016లో వచ్చిన వసుధైక 1957 చిత్రంతో అరంగేట్రం చేసిన ఆమె 2023 సెప్టెంబరు 2న విడుదలకు సిద్ధమైన నా.. నీ ప్రేమకథ చిత్రంలో ఆమె కథానాయిక కాగా ఆముద శ్రీనివాస్‌ కథానాయకుడు, దర్శకుడు.[1]

కారుణ్య చౌదరి
జననం (1993-03-16) 1993 మార్చి 16 (వయసు 31)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థఢిల్లీ పబ్లిక్ స్కూల్, విజయవాడ
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆమె 1993 మార్చి 16న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించింది. 10+2 వరకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, విజయవాడలో చదివిన ఆమె తన ఇంజనీరింగ్ విద్యని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడలో పూర్తిచేసింది.

కెరీర్ మార్చు

ఆమె 2016లో వచ్చిన వసుధైక 1957 చిత్రంతో అరంగేట్రం చేసింది. 2017లో ఆమె పిచ్చిగా నచ్చావ్, ఇదో ప్రేమ లోకం, ATM నాట్ వర్కింగ్, నీరాజనం, సీత రాముని కోసం, జవాన్[2] సినిమాలలో నటించింది.[3] అలాగే 2018లో ఆమె సోడ గోలీసోడ, శంభో శంకర, కన్నుల్లో నీ రూపమే[4] చిత్రాలు చేసింది. కొత్తగా మా ప్రయాణం (2019)[5], 3 మంకీస్ (2020),[6] అసలు ఏం జరిగిందంటే (2021),[7] డ్రిల్ (2024) చిత్రాలతో పాటు క్రైమ్ థ్రిల్లర్‌ రేప్ డి (2023) వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటించింది.[8]

మూలాలు మార్చు

  1. "Upcoming movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే | upcoming movies in telugu september 2023". web.archive.org. 2023-08-28. Archived from the original on 2023-08-28. Retrieved 2023-08-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Sai Dharam Tej's "Jawaan" launched". Idlebrain.com. Retrieved 23 August 2019.
  3. Mana Telangana (6 December 2017). "నేనెంతో ఇష్టపడి మనసుపెట్టి చేశా". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-03-31. Retrieved 2018-07-14.
  5. సక్సెస్‌ఫుల్ ప్రయాణం,‘’ఆంధ్రభూమి’’. 4 February 2019. Retrieved july 10 2020.
  6. "3 Monkeys (2019) | 3 Monkeys Movie | 3 Monkeys (Three Monkeys) Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat.
  7. Sakshi (7 March 2020). "అసలేం జరిగింది?". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
  8. "'Shambo Shankara' actress Karunya Chowdary: Talent and contacts bring opportunities to us - Exclusive!". The Times of India. 2022-01-10. ISSN 0971-8257. Retrieved 2023-08-28.