కపషేరా
కపషేరా, భారతదేశ జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీలోని సౌత్ వెస్ట్ జిల్లా (ద్వారకా) పరిపాలనా ప్రధాన కార్యాలయ స్థానం, ఇది మూడు ఉప విభాగాలలో ఒకటి.డిప్యూటీ కమిషనర్ కార్యాలయం కపషెరాలోని ఓల్డ్ టాక్స్ టెర్మినల్ భవనంలో ఉంది.ఇది జనగణన పట్టణం.[1]
కపషేరా | |
---|---|
ఉప జిల్లా | |
కపషేరా | |
Coordinates: 28°31′34″N 77°04′48″E / 28.5261°N 77.0800°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
జిల్లా | నైరుతి ఢిల్లీ జిల్లా |
జనాభా (2019) | |
• Total | 5,00,000 |
భాషలు | |
• అధికార | హిందీ, ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | DL9C |
చరిత్ర
మార్చుమధ్యయుగ కాలం నుండి కపషేరా గ్రామానికి దాని స్వంత విస్తారమైన చరిత్ర ఉంది.కపాషెరాను గతంలో నాకీపూర్ ఖేడా అని పిలిచేవారు.ఈ గ్రామానికి రావు హర్నాథ్ సింగ్ యాదవ్ మొదటి పౌరుడు.అతను 1680 లలో కపాస్ అనే వ్యక్తి నుండి 840 ఎకరాల గ్రామ భూమిని కొన్నాడు.కపషేరా పట్టణంలో తోండక్ గోత్రంతో ఉన్న ప్రతి గ్రామస్తులు అతని వారసత్వానికి ప్రతీకులుగా ఉన్నారు.కపషేరా ప్రాంత భూమి ఒక సారవంతమైన భూమి. సాంఘికంగా కష్టపడి పనిచేసే పౌరులు ఉన్న ఒక వ్యవసాయ గ్రామం.
రవాణా
మార్చురోడ్డు ద్వారా
దీనికి జాతీయ రహదారి 8 (ఎన్‌హెచ్ 8) కేవలం ఒక కి.మీ. దూరంలో సమీప రహదారిగా ఉంది.
మెట్రో ద్వారా
ద్వారకా మెట్రో విభాగం 21 కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గాలి ద్వారా
ఇందిరా గాంధీ విమానాశ్రయం కేవలం 7 కి.మీ. దూరంలో ఉంది.
రైలు ద్వారా
దీనికి 20 కి.మీ.దూరంలో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంగా ఉంది.
కపషేరా నుండి ఇతర ప్రాంతాలకు ఈ సంఖ్యలు గల బస్సులు 543, 539, 578, 543 ఎ, 718, 712, 804 ఎ, 729 ద్వారా ప్రయాణించవచ్చు
మెట్రోకు డిమాండ్
రాజకీయాలు
మార్చుకపషేరా ఎమ్మెల్యే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన భూపేంద్ర సింగ్ జూన్, పురపాలక సంఘం కౌన్సిలర్ ఆర్తి యాదవ్, (బిజెపి) .
జనాభా
మార్చుకపషేరా పట్టణంలో 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం 74,073 మంది జనాభా ఉన్నారు.వారిలో పురుషులు 50,123 (68%) ఉండగా, స్త్రీలు 23,950 (32%) మంది ఉన్నారు. కపషేరా పట్టణ సరాసరి అక్షరాస్యత 90.34%, ఇది రాష్ట్ర సగటు అక్షరాస్యత 86.21%. కన్నా ఎక్కువ.పురుషులు అక్షరాస్యత 92.35 % ఉండగా, స్త్రీల అక్షరాస్యత 82.13%గా ఉంది. కపషేరా పట్టణంలో ఆరు సంవత్సరాల వయస్సు లోపల పిల్లలు 13.72% మంది ఉన్నారు.పట్టణ పరిధిలో 2011 భారతజనాభా లెక్కలు ప్రకారం 21,370 ఇండ్లు ఉన్నాయి.[1]
ఇతరాలు
మార్చు- కపషేరా గ్రామంలోని ఫన్ ఎన్ ఫుడ్ విలేజ్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి.
- కపషేరా హర్యానాలోని గుర్గావ్తో సరిహద్దును పంచుకుంటుంది.
ఇటీవలి దశాబ్దంలో వృద్ధి
మార్చుగుర్గావ్లోని ఉద్యోగ్ విహార్ పారిశ్రామిక ప్రాంతం, మారుతి ఫ్యాక్టరీ ప్రాంతాల చుట్టూ వేగంగా పెరిగిన పారిశ్రామికీకరణ కారణంగా కపషెరా అపూర్వమైన స్థాయిలో వృద్ధి చెందింది.ఈ ప్రాంతం డిడిఎ పునరాభివృద్ధి ప్రాంత పరిధిలో ఉంది.రాబోయే ఈ దశాబ్దకాలంలో ఇది మరింత వేగంగా పెరుగుతుందని భావిస్తున్నారు.పారిశ్రామికీకరణ కారణంగా, వలస వచ్చినవారు ఇప్పుడు గణనీయమైన జనాభాను కలిగి ఉన్నారు.స్థానికులు ఎక్కువ మంది ఇండ్లను అద్దెకు ఇచ్చే వ్యాపారంలో ఉన్నారు.2001లో 20,000 మంది జనాభా ఉన్నారు.2011 నాటికి 400% పెరుగులతో 75,000 మంది జనాభాకు చేరుకుంది. ఇప్పుడు 2020 నాటికి కపషేరా నగరంలో 5,00,000 జనాభా ఉండగలరని భావిస్తున్నారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Kapas Hera Census Town City Population Census 2011-2021 | Delhi". www.census2011.co.in. Retrieved 2021-01-03.