కరీనా కపూర్ సినిమాల జాబితా
కరీనా కపూర్, ప్రముఖ భారతీయ నటి. దాదాపు 50 బాలీవుడ్ చిత్రాల్లో నటించారు ఆమె. 2000లో అభిషేక్ బచ్చన్ సరసన రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేశారు కరీనా. ఆ సినిమాలోని నటనకు గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు. ఆ తరువాతి ఏడాది ఆమె 5 సినిమాల్లో నటించారు. ముఝే కుచ్ కెహనా హై, అజ్నబీ, కభీ ఖుషీ కభీ గం వంటి సినిమాల్లో నటించారు కరీనా. కభీ ఖుషీ కభీ గం సినిమా ఆ సంవత్సరానికిగానూ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.[1][2][3] ఈ సినిమా విజయం ఆమెను బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలబెట్టింది.[4] ఆ తరువాత ఆమె నటించిన ముఝ్సే దోస్తీ కరోగీ (2002), మై ప్రేంకీ దీవానీ హూ (2003) వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు.
2004లో చమేలీ సినిమాలో వేశ్య పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా మారింది.[5] ఈ చిత్రానికి ఫిలింఫేర్ ప్రత్యేక పెర్ఫార్మెన్స్ పురస్కారం అందుకున్నారు కరీనా.[6] అదే ఏడాది గోవింద్ నిహలానీ దర్శకత్వంలో దేవ్ సినిమాలో నటించారు ఆమె. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో ఒక ముస్లిం పాత్రలో కనిపించారు కరీనా.[7] రెండేళ్ళ తరువాత ఓంకారా (2006) సినిమాలో నటించారు ఆమె. ఈ సినిమా విలియం షేక్స్ పియర్ రాసిన ఒథెల్లో నవల ఆధారంగా తీశారు. ఇందులో డెస్డెమోనా పాత్రలో కనిపించారు కరీనా. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని నటనకు కరీనా రెండు ఫిలింఫేర్ విమర్శకుల ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు.[8] 2007లో షాహిద్ కపూర్ సరసన జబ్ వియ్ మెట్ సినిమాలో సిక్కు అమ్మాయిగా నటించారు ఆమె. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని నటనకు కూడా కరీనా ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.[9]
- 2001
మూలాలు
మార్చు- ↑ "Top Lifetime Grossers Overseas". Box Office India. Archived from the original on 26 January 2014. Retrieved 30 January 2015.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 6 అక్టోబరు 2013 suggested (help) - ↑ "Top Lifetime Grossers 2000-2009 (Figures in Ind Rs)". Box Office India. Archived from the original on 7 ఫిబ్రవరి 2008. Retrieved 11 నవంబరు 2016.
- ↑ Chopra, Anupama (8 September 2003). "Starry Heights" (PDF). India Today. Archived from the original (PDF) on 22 April 2014. Retrieved 11 July 2012.
- ↑ "Top Actress". Box Office India. Archived from the original on 4 జనవరి 2012. Retrieved 11 నవంబరు 2016.
- ↑ Tuteja, Joginder (4 September 2010). "Exploring 10 years journey of Kareena Kapoor — Part II". Bollywood Hungama. Retrieved 8 September 2010.
- ↑ "Awards 2003: Winners of the 49th Manikchand Filmfare Awards". Indiatimes. Archived from the original on 9 జూలై 2012. Retrieved 8 June 2014.
- ↑ Gupta, Parul (11 June 2004). "Dev: Gujarat in Bollywood, finally". The Times of India. Retrieved 19 November 2007.
- ↑ "Kareena Kapoor: Awards & Nominations". Bollywood Hungama. Archived from the original on 6 August 2010. Retrieved 8 June 2014.
- ↑ "Box Office 2007". Box Office India. Archived from the original on 15 January 2013. Retrieved 31 January 2015.