జానే జాన్
జానే జాన్ 2003లో హిందీలో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా. జపనీస్ రచయిత కెఇగో హైగాశినో రాసిన ''ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్'' నవల ఆధారంగా క్రాస్ పిక్చర్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్, 12త్ స్ట్రీట్ ఎంటర్‌టైన్‌మెంట్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై జై శేవక్రమణి, అక్షయ్ పూరి, హ్యూన్వూ థామస్ కిమ్, శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సినిమాకు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించాడు.[1] కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ట్రైలర్‌ను సెప్టెంబర్ 5న విడుదల చేసి[2], 2023 సెప్టెంబరు 21న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[3]
జానే జాన్ | |
---|---|
దర్శకత్వం | సుజోయ్ ఘోష్ |
రచన | మాటలు: సుజోయ్ ఘోష్ రాజ్ వసంత్ |
స్క్రీన్ ప్లే | సుజోయ్ ఘోష్ |
దీనిపై ఆధారితం | ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ by కీగో హిగాషినో |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అవిక్ ముఖోపాధ్యాయ |
కూర్పు | ఊర్వశి సక్సేనా |
సంగీతం | పాటలు: పాటలు:సచిన్-జిగర్ స్కోర్: క్లింటన్ సెరెజో |
నిర్మాణ సంస్థలు | క్రాస్ పిక్చర్స్ బాలాజీ మోషన్ పిక్చర్స్ 12త్ స్ట్రీట్ ఎంటర్‌టైన్‌మెంట్ నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 21 సెప్టెంబరు 2023 |
సినిమా నిడివి | 139 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
కథ
మార్చుమాయా డిసౌజా (కరీనా కపూర్ ఖాన్) తన కుమార్తె తార (నైషా ఖన్నా)తో కలిసి పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌లో ఒక కేఫ్‌ను నడుపుతుంది. మాయ ఇంటి ప్రక్కన ఉండే నరేన్ వ్యాస్ (జైదీప్ అహ్లావత్) ఆమెని రహస్యంగా ప్రేమిస్తూ ఉంటాడు. మాయ తన భర్త అజిత్ మ్హత్రే (సౌరభ్ సచ్‌దేవా) హత్యను చేస్తుంది, ఆ హత్యను దాచడానికి మాయాకి నరేన్ సహాయం చేస్తాడు. ఈ హత్యను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసు కరణ్ ఆనంద్ (విజయ్ ఆనంద్) రంగంలోకి దిగుతాడు. అసలు మయా తన భర్తని ఎందుకు చంపింది, మాయా, నరేన్ ఈ హత్యతో పోలీసులకు చిక్కుతారా ? కరణ్ మిస్టరీని ఎలా ఛేదించాడు? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
మార్చు- కరీనా కపూర్ ఖాన్ [5]- మాయా డిసౌజా (నీ సోనీయా తావ్డే), కాలింపాంగ్‌లోని టిఫిన్ లాంజ్ & బార్ యజమాని.
- ఉదితి సింగ్ - బొంబాయిలోని షబ్నమ్ డ్యాన్స్ బార్‌లో పనిచేసే యువ సోనియా తావ్డే (అతి అతిథి పాత్ర)
- జైదీప్ అహ్లావత్ - నరేన్ "నరు" వ్యాస్, గోల్డ్ మెడలిస్ట్ & గణితంలో PhD, మౌంట్ జార్జ్ స్కూల్, కాలింపాంగ్‌లో గణిత ఉపాధ్యాయుడు. జుజిట్సులో నిపుణులైన అభ్యాసకుడు & రెడ్ బెల్ట్ .
- విజయ్ వర్మ ఇన్‌స్పెక్టర్ కరణ్ ఆనంద్, ముంబై పోలీస్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అజిత్ మ్హత్రే అదృశ్యం కేసులో నిపుణుడైన కురాష్ ప్రాక్టీషనర్ , నరేన్ వ్యాస్ కాలేజీ స్నేహితుడు.
- సౌరభ్ సచ్‌దేవా - ASI అజిత్ మ్హత్రే, మాయ భర్త, తార తండ్రి
- లిన్ లైష్రామ్ - ప్రేమ కామి, నేపాలీ వెయిట్రెస్‌గా & కాలింపాంగ్‌లోని టిఫిన్ లాంజ్ & బార్‌లో మాయ సహోద్యోగి.
- నైషా ఖన్నా - తారా డిసౌజా, మాయ & అజిత్ మ్హత్రేల కుమార్తె
పాటలు
మార్చుఈ సినిమాలకు పాటలను సచిన్-జిగర్ అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను క్లింటన్ సెరెజో, బియాంకా గోమ్స్ అందించారు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "జానే జాన్ - టైటిల్ ట్రాక్[6]" | రాజేంద్ర కృష్ణ | నేహా కక్కర్ | 2:20 |
2. | "దురియన్[7]" | ప్రియా సారయ్య | అరిజిత్ సింగ్ | 3:35 |
మొత్తం నిడివి: | 5:55 |
మూలాలు
మార్చు- ↑ Shackleton, Liz (21 September 2023). "Kareena Kapoor Khan On Her Gritty Role In 'Suspect X'; Making Her Streaming Debut & Upcoming UK-Set Feature". Deadline Hollywood. Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
- ↑ Namaste Telangana (4 September 2023). "కరీనా కపూర్ 'జానే జాన్' ట్రైలర్ అప్‌డేట్.. ఎప్పుడంటే". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Bureau, The Hindu (2023-08-25). "'Jaane Jaan': Kareena Kapoor Khan's streaming debut gets title, release date". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 25 August 2023. Retrieved 2023-08-25.
- ↑ Eenadu (22 September 2023). "రివ్యూ: జానే జాన్.. కరీనా తొలి ఓటీటీ మూవీ మెప్పించిందా?". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ "Kareena Kapoor On Her OTT Debut: "I Have The Jitters Of A Newcomer"". NDTV.com. Archived from the original on 25 August 2023. Retrieved 2023-08-25.
- ↑ "'Jaane Jaan': Title track". Archived from the original on 15 September 2023. Retrieved 18 September 2023.
- ↑ "Jaane Jaan song Doriyaan OUT". Archived from the original on 22 September 2023. Retrieved 19 September 2023.