కర్ట్‌లీ ఆంబ్రోస్
1963, సెప్టెంబర్ 21న జన్మించిన కర్ట్‌లీ ఆంబ్రోస్ (Curtly Elconn Lynwall Ambrose) వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడికి లిటిల్ బర్డ్ అనే ముద్దుపేరు ఉంది. కోర్ట్‌నీ వాల్ష్కు జతగా ఫాస్ట్ బౌలర్‌గా వెస్టీండీస్ జట్టులో కొనసాగినాడు. ఆంబ్రోస్ తన తొలి టెస్టును 1988లో పాకిస్తాన్ పై ఆడి 12 సంవత్సరాలు జట్టుకు సేవలందించి 2000, ఏప్రిల్లో ఇంగ్లాండు సీరీర్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Curtly Elconn Lynwall Ambrose | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | స్వెటెస్, ఆంటిగ్వా అండ్ బార్బురా | 1963 సెప్టెంబరు 21|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 7 అం. (2.01 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమ చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 192) | 1988 ఏప్రిల్ 2 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2000 ఆగస్టు 31 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 53) | 1988 మార్చి 12 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 ఏప్రిల్ 23 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1985–2000 | లీవార్డ్ ఐలాండ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998–1999 | ఆంటిగ్వా అండ్ బార్బురా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1989–1996 | నార్తాంప్టన్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: క్రిక్‌ఇన్ఫో, 2012 అక్టోబరు 24 |
ఆంబ్రోస్ టెస్ట్ క్రికెట్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 405 వికెట్లు సాధించాడు. 400 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్లలో ఇతడు ఐదోవాడు. ఇతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 45 పరుగులకు 8 వికెట్లు. ఇది 1990లో బార్బడస్లో ఇంగ్లాండుపై సాధించాడు. వన్డేలలో 176 మ్యాచ్‌లు ఆడి 225 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 17 పరుగులకు 5 వికెట్లు.