కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్
దస్త్రం:KarnatakaStateCricketAssociationLogo.png | |
ఆటలు | క్రికెట్ |
---|---|
పరిధి | బెంగళూరు |
పొట్టి పేరు | కెఎస్‌సిఎ |
స్థాపన | 1933 |
అనుబంధం | బిసిసిఐ |
స్థానం | బెంగళూరు |
అధ్యక్షుడు | ఎ రఘురాం భట్ |
కార్యదర్శి | ఎ శంకర్ |
కోచ్ | యేరే గౌడ్ |
Official website | |
కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కర్ణాటక రాష్ట్రంలో క్రికెట్ పాలక మండలి. ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు అనుబంధంగా ఉంటూ, కర్ణాటక క్రికెట్ జట్టును నియంత్రిస్తుంది. ఈ సంఘాన్ని 1933 లో స్థాపించారు. అప్పటి నుండి BCCIకి అనుబంధంగా ఉంది. KSCA బెంగళూరులోని M. చిన్నస్వామి స్టేడియంను నిర్వహిస్తుంది, ఇది అంతర్జాతీయ స్థాయి టెస్టు, ODI, T20 క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఇది హుబ్లీ, బెలగావిలలో కొత్తగా నిర్మించిన స్టేడియాలను కూడా నిర్వహిస్తోంది.
చరిత్ర
మార్చుకర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ను గతంలో మైసూర్ క్రికెట్ అసోసియేషన్ అని పిలిచేవారు. ఈ సంఘాన్ని 1933 సంవత్సరంలో స్థాపించారు. 1934లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)కి అనుబంధాన్ని పొందింది. ప్రొఫెసర్ JC రోల్లో, జస్టిస్ Mr P. మేదప్ప, కెప్టెన్. T మురారి, మేజర్ YVK మూర్తి, కెప్టెన్ MG విజయసారథిలు KSCAని BCCIకి అనుబంధంగా పొందడంలో కీలకపాత్ర పోషించారు. జెసి రోలో అనే ఆంగ్లేయుడు అసోసియేషన్‌కు మొదటి అధ్యక్షుడు. అసోసియేషన్ ప్రారంభంలో సెంట్రల్ కాలేజీ పెవిలియన్‌లో ఒక చిన్న గదిలో ఉండేది. 1950, 1960 లలో సంఘం, SA శ్రీనివాసన్, M.చిన్నస్వామి ల నేతృత్వంలో ఉండేది. 1975లో, KSCA, ప్రస్తుతం ఉన్న KSCA స్టేడియంలో తన నివాసాన్ని ఏర్పరచుకుంది. అదే సంవత్సరంలో బెంగుళూరులో వెస్టిండీస్‌తో మొట్టమొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇంతకు ముందు KSCA స్టేడియంగా పిలువబడే ఈ క్రికెట్ స్టేడియం పేరును M. చిన్నస్వామి పేరు మీదుగా మార్చారు. 1953 నుండి 1978 వరకు సంఘానికి కార్యదర్శిగా 1990 వరకు అధ్యక్షుడిగా అతను పనిచేసాడు.
మైసూరు రాష్ట్రం (1973లో కర్ణాటకగా మారింది) తన మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను 1934 నవంబరు 4 న మద్రాస్ రాష్ట్రం (ప్రస్తుతం తమిళనాడు) తో ఆడింది. ఇది మొట్టమొదటి రంజీ ట్రోఫీ గేం. ఇప్పటి వరకు ఒకే రోజులో పూర్తయిపోయిన ఏకైక రంజీ ట్రోఫీ గేం అది. అందులో మైసూరు ఓడిపోయింది. [1]
ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
మార్చుబెంగళూరులోని M.చిన్నస్వామి స్టేడియం కర్ణాటక ప్రభుత్వానికి చెందినది. క్రికెట్‌ను ప్రోత్సహించడం కోసం KSCAకి లీజుకు ఇచ్చింది. ఈ స్టేడియాన్ని ముందుగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (KSCA స్టేడియం) అని పిలిచేవారు [2] నాలుగు దశాబ్దాలుగా KSCAకి సేవలందించి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు 1977 నుండి 1980 వరకు అధ్యక్షుడిగా ఉన్న M. చిన్నస్వామికి నివాళిగా దీని పేరు మార్చారు. 55,000 సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో టెస్టులు, వన్ డే ఇంటర్నేషనల్, ఇతర ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే కాకుండా ఇతర సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ స్టేడియం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ జట్టుకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకూ హోమ్ గ్రౌండ్.
డి.ఆర్. బెంద్రే KSCA స్టేడియం రాజ్‌నగర్, హుబ్లీ
మార్చు50,000 పైచిలుకు సామర్థ్యం కలిగి, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యంలో ఉన్న స్టేడియం ఇది. రాజ్‌నగర్, హుబ్లీలో 2012 నవంబరులో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ దీన్ని ప్రారంభించాడు. ఇప్పటికే అండర్-16, అండర్-19, కేపీఎల్, రంజీ ట్రోఫీ వంటి డివిజనల్ మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతున్నాయి. KSCA కర్ణాటకలోని మణిపాల్, రాయచూర్ బెల్గాంలలో మరో మూడు అంతర్జాతీయ స్టేడియంలను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
సంస్థాగత సభ్యులు
మార్చుఈ క్రింది స్పోర్ట్స్ క్లబ్‌లు KSCA లో సంస్థాగత సభ్యులుగా ఎన్నుకోబడ్డాయి: [3]
- జోన్ - జవహర్ స్పోర్ట్స్ క్లబ్, సెలెక్ట్ క్రికెట్ క్లబ్, బెంగళూరు క్రికెటర్స్, మల్లేశ్వరం యునైటెడ్ క్రికెట్ క్లబ్, స్వస్తిక యూనియన్ CC, మౌంట్ జాయ్ CC.
- మైసూర్ జోన్ - మైసూర్ జింఖానా.
- షిమోగా మండలం – దుర్గిగుడి ఎస్సీ.
- ధార్వార్ జోన్ - హుబ్లీ ఎస్సీ.
- రాయచూర్ జోన్ - సిటీ XI క్రికెట్ క్లబ్
ప్రస్తుత ఆఫీస్ బేరర్లు
మార్చుతాజాగా ముగిసిన ఎన్నికల సమయంలో కింది సభ్యులు KSCAకి ఎన్నికయ్యారు. [4]
అధ్యక్షుడు: రఘురామ్ భట్
కార్యదర్శి: శంకర్ ఎ
కోశాధికారి: జయరామ్
మేనేజింగ్ కమిటీ: యౌరాజ్, వినయ్ మోడే
మంజునాథ రాజు
మూలాలు
మార్చు- ↑ History of KSCA
- ↑ Cricinfo Ground Information Page on Chinnaswamy Stadium
- ↑ "KSCA elections".
- ↑ Dawn of an era: Anil Kumble & Co sweep KSCA election - Sport - DNA. Dnaindia.com. Retrieved on 2013-12-23.