కర్రి నారాయణ రావు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కర్రి నారాయణ రావు (కె.నారాయణ రావుగా సుపరిచితుడు) భారతీయ న్యాయవాది. పార్లమెంటు సభ్యుడు. అతను 4వ, 5వ, లోక్ సభలకు బొబ్బిలి లోక్ సభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. 1967 నుండి 1977 వరకు లోక్ సభ సభ్యునిగా ఉన్నాడు.
కర్రి నారాయణరావు | |||
పార్లమెంటు సభ్యుడు
| |||
పదవీ కాలం 1967–1977 | |||
తరువాత | పూసపాటి విజయరామ గజపతి రాజు | ||
---|---|---|---|
నియోజకవర్గం | బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1 జూలై 1929 సంత నర్శీపురం, శ్రీకాకుళం జిల్లా | ||
మరణం | 2 మార్చి 2002 నడుకూరు , శ్రీకాకుళం జిల్లా | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సరస్వతి | ||
సంతానం | విజయ కుమార్ | ||
వెబ్‌సైటు | [1] |
జీవిత విశేషాలు
మార్చుకె.నారాయణ రావు 1929 జూలై 1న శ్రీకాకుళం జిల్లా సంత నర్శీపురం గ్రామంలోజన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. న్యాయవాద విద్యను అభ్యసించి లా కమిషన్ లో కీలక బాధ్యతలను నిర్వహించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, న్యూఢిల్లీ ఉపాధ్యక్షుడుగా పనిచేశారు.
1967 నుండి 1971 లలో జరిగిన 4,5 లోక్ సభ సాధారణ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు.