కలమట వెంకటరమణ మూర్తి
కలమట వెంకటరమణమూర్తి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, తెలుగుదేశంపార్టీ నాయకుడు.
కలమట వెంకటరమణ మూర్తి | |||
కలమట వెంకటరమణ మూర్తి | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
పాతపట్నం శాసనసభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 8 జూన్ 2014 – 2019 | |||
ముందు | శత్రుచర్ల విజయరామరాజు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మాతల, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా | 1963 జనవరి 15||
రాజకీయ పార్టీ | తెలుగు దేశం | ||
తల్లిదండ్రులు | కలమట మోహనరావు , వేణమ్మ | ||
జీవిత భాగస్వామి | ఇందిర | ||
నివాసం | మాతల, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా[1] | ||
పూర్వ విద్యార్థి | ప్రభుత్వ కళాశాల, గరివిడి | ||
వృత్తి | వ్యవసాయం, కొన్ని వ్యాపారసంస్థలలో వాటాదారుడు | ||
మతం | హిందూ |
జీవిత విశేషాలు
మార్చుకలమట వెంకటరమణ మూర్తి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన మాతల గ్రామంలో 1963 జనవరి 15 న జన్మించాడు. అతని తండ్రి కలమట మోహనరావు[2] పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు శాసనసభ్యునిగా గెలుపొందాడు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు చేతిలో ఓడిపోయాడు. 2014 ఎన్నికలలో అతను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు పై గెలుపొందాడు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మే 2016న అతను గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తిగిరి తెలుగుదేశం పార్టీలోకి చేరాడు.[3] నియోజకవర్గ అభివృద్ధి కోసం, తెదేపా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితుడై పార్టీలో చేరినట్టు వెంకటరమణ తెలిపారు.[4]
2019 శాసనసభ ఎన్నికలలో పాతపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి శాంతి చేతిలో ఓడిపోయాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "KALAMATA VENKATARAMANA MURTHY(Criminal & Asset Declaration)".
- ↑ "Kalamata Venkataramana Murty".
- ↑ Chilukuri, Arun (15 May 2019). "పాతపట్నం సెగ్మెంట్లో కొత్త చరిత్ర ఖాయమా?". Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
- ↑ "Kalamata crosses over to Telugu Desam".
- ↑ "AP Assembly Winners 2019 List: ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. జిల్లాలవారీగా విజేతల వివరాలు". Samayam Telugu. 2019-05-23. Retrieved 2019-07-21.