కలమట మోహనరావు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు.

జీవిత విశేషాలు

మార్చు
 
కలమట మోహనరావు

కలమట మోహనరావు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన మాతల గ్రామంలో 1934 ఏప్రిల్ 14న జన్మించాడు. అతను 1978లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందాడు. ఆ తర్వాత కాంగ్రెస్‌పార్టీలో చేరాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా విజయాలు సాధించాడు.[1] ఆ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలిచి రికార్డు సృష్టించాడు.[2] 1994 ఎన్నికల్లో దేవుని ఫోటో పెట్టి ప్రచారం చేశాడన్న కారణంతో ఎన్నికల సంఘం అతనిపై అనర్హత వేటువేసింది. దీంతో 1996లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం తరపున కలమట మోహనరావు సతీమణి కలమట వేణమ్మ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి చేతిలో ఓడిపోయింది.[3] 2009 ఎన్నికల ముందు మోహనరావు ప్రజారాజ్యంలో చేరగా, ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన కలమట వెంకటరమణ మూర్తి మాత్రం టీడీపీలో కొనసాగాడు. కలమట వెంక‌టర‌మ‌ణ‌మూర్తి 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించాడు. కానీ అతను ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయాడు.[4]

1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి జె.ఎన్.పి అభ్యర్థి లుకలాపు లక్ష్మణదాసుపై విజయం సాధించాడు.[5] 1989,1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన నారాయణరావుపై రెండుసార్లు విజయం సాధించాడు.[6] [7] 1999,2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొర్లె హరిబాబునాయుడు పై రెండుసర్లు విజయం సాధించాడు.[8][9]

మూలాలు

మార్చు
  1. "పాతపట్నం.. కొత్తరూటు - Andhra Pradesh | DailyHunt Lite". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2019-07-21. Retrieved 2019-07-21.
  2. "హ్యాట్రిక్‌ విజయాలు వీరి సొంతం". Sakshi. 2019-03-11. Retrieved 2019-07-21.
  3. Arun (2019-05-15). "పాతపట్నం సెగ్మెంట్‌లో కొత్త చరిత్ర ఖాయమా?". www.hmtvlive.com (in ఇంగ్లీష్). Archived from the original on 2019-07-21. Retrieved 2019-07-21.
  4. Vuyyuru, Subhash (2019-05-22). "రెడ్డి శాంతి రెడీ అయిపోతున్నారా...!". తెలుగు పోస్ట్. Archived from the original on 2019-07-21. Retrieved 2019-07-21.
  5. "Andhra Pradesh Assembly Election Results in 1978". www.elections.in. Retrieved 2019-07-21.
  6. "Andhra Pradesh Assembly Election Results in 1989". www.elections.in. Retrieved 2019-07-21.
  7. "Andhra Pradesh Assembly Election Results in 1994". www.elections.in. Archived from the original on 2016-09-05. Retrieved 2019-07-21.
  8. "Andhra Pradesh Assembly Election Results in 1999". www.elections.in. Retrieved 2019-07-21.
  9. "Andhra Pradesh Assembly Election Results in 2004". www.elections.in. Retrieved 2019-07-21.[permanent dead link]

బహ్య లంకెలు

మార్చు