కలెక్టర్ జానకి

ఎస్.ఎస్.బాలన్ దర్శకత్వంలో 1972లో విడుదలైన తెలుగు చలనచిత్రం

కలెక్టర్ జానకి 1972, మార్చి 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. జెమిని ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎస్.ఎస్.బాలన్ నిర్మాణ సారథ్యంలో ఎస్.ఎస్.బాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగ్గయ్య, జమున, జయంతి, సి.హెచ్.నారాయణరావు ప్రధాన పాత్రల్లో నటించగా, వి. కుమార్ సంగీతం అందించాడు.[1]

కలెక్టర్ జానకి
కలెక్టర్ జానకి సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్.ఎస్.బాలన్
రచనజోసఫ్ ఆనందన్ (కథ), రాజశ్రీ (మాటలు)
నిర్మాతఎస్.ఎస్. బాలన్
తారాగణంజగ్గయ్య,
జమున,
జయంతి,
సి.హెచ్.నారాయణరావు
ఛాయాగ్రహణంకె.హెచ్. కపాడియా
కూర్పుఎం. ఉమానాథ్
సంగీతంవి. కుమార్
నిర్మాణ
సంస్థ
జెమిని ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
మార్చి 10, 1972
సినిమా నిడివి
152 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • నిర్మాత, దర్శకత్వం: ఎస్.ఎస్.బాలన్
  • కథ: జోసఫ్ ఆనందన్
  • మాటలు: రాజశ్రీ
  • సంగీతం: వి. కుమార్
  • ఛాయాగ్రహణం: కె.హెచ్. కపాడియా
  • కూర్పు: ఎం. ఉమానాథ్
  • కళా దర్శకత్వం: హెచ్. శాతారాం
  • నృత్యం దర్శకత్వం: పి.ఎస్. గోపాలకృష్ణన్
  • నిర్మాణ సంస్థ: జెమిని ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్

పాటలు సవరించు

ఈ చిత్రానికి కుమార్ సంగీతం అందించగా, `సి. నారాయణరెడ్డి రాసిని పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రామారావు, స్వర్ణ, పి.సుశీల, పట్టాభి భాగవతార్, కె. జమునారాణి తదితరులు పాటలు పాడారు. ఒడియన్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[2]

  • నీవన్నది నీవనుకున్నది
  • పాట ఆగిందా ఒక సీటు గోవిందా (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  • చింతించకో ప్రాణనాథ (హరికథ-ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  • అభినవ కుచేల (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  • వెండితెరపై
  • ఒక చిలకమ్మ (పి.సుశీల)

మూలాలు సవరించు

  1. "Collector Janaki (1972)". Indiancine.ma. Retrieved 2020-08-22.
  2. "Collector Janaki". www.mio.to. Archived from the original on 2019-08-01. Retrieved 2020-08-22.