కాకరాల సత్యనారాయణ
కాకరాల వీర వెంకట సత్యనారాయణ ప్రముఖ రంగస్థల, సినీ నటుడు. సుమారు 250 పైచిలుకు చిత్రాల్లో నటించిన కాకరాల పాత్రికేయునిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరుగాంచాడు.[1]
కాకరాల సత్యనారాయణ | |
---|---|
జననం | డిసెంబర్ 18, 1937 ఖండవల్లి, ఆంధ్రప్రదేశ్ |
ప్రసిద్ధి | రంగస్థల, సినీ నటుడు. |
మతం | హిందూమతం |
భార్య / భర్త | సూర్యకాంతం |
తండ్రి | కాకరాల వీరభద్రం |
తల్లి | కనకమహాలక్ష్మి |
జననం
మార్చుకాకరాల 1937, డిసెంబర్ 18 న వీరభద్రం, కనకమహాలక్ష్మి దంపతులకు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం లోని ఖండవల్లి గ్రామంలో జన్మించాడు.[1]
రంగస్థల ప్రస్థానం
మార్చు48సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ప్రజ్ఞాశాలి. తొమ్మిదో తరగతిలో తెలుగు మాస్టారి చొరవతో సంస్కృత నాటకం ‘భోజసభ’ లో, ‘ఒథెల్లో’ నాటకంలో జడ్జి పాత్ర, జయంత జయపాల వంటి నాటకాలలో నటించాడు. ప్రజానాట్యమండలిలో పనిచేశాడు. సత్య హరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం, బాలనాగమ్మ, అల్లూరి సీతారామరాజు, జైభవాని, పట్టాలు తప్పిన బండి, కన్యాశుల్కం, గాంధీ జయం, భవబంధాలు, నా బాబు, క్రెంబ్లిన్ గంటలు మొదలైన నాటకాలలో నటించాడు. ఈయన కొన్ని టి.వి.సీరియళ్లలో కూడా నటించాడు. కొంతమందికి డబ్బింగ్ కూడా చెప్పాడు.
సినిమారంగం
మార్చుఈయన నటించిన సినిమాలలో కొన్ని:
- సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
- పరువు ప్రతిష్ఠ (1963)
- తోటలో పిల్ల కోటలో రాణి (1964)
- వీరాభిమన్యు (1965)
- రంగులరాట్నం (1966)
- నిన్నే పెళ్ళాడుతా (1968)
- అల్లుడే మేనల్లుడు (1970)
- పెళ్లి కూతురు (1970)
- ప్రేమనగర్ (1971)
- కలెక్టర్ జానకి (1972)
- అందాల రాముడు (1973)
- దేవుడు చేసిన పెళ్లి (1974)
- అందరూ బాగుండాలి (1975)
- నాకూ స్వతంత్రం వచ్చింది (1975)
- ముత్యాలముగ్గు (1975)
- పొరుగింటి పుల్లకూర (1976)
- మనుషులంతా ఒక్కటే (1976)
- మాంగల్యానికి మరో ముడి (1976)
- అడవి రాముడు (1977)
- ఇంద్రధనుస్సు (1978)
- దొంగల దోపిడీ (1978)
- దొంగల వేట (1978)
- విచిత్ర జీవితం (1978)
- తూర్పు వెళ్లే రైలు (1979)
- మా భూమి (1979)
- శృంగార రాముడు (1979)
- సంఘం మారాలి (1981)
- అల్లుడుగారు జిందాబాద్ (1981)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- దారి తప్పిన మనిషి (1981)
- కొత్త నీరు (1982)
- రంగులకల (1983)
- విముక్తి కోసం (1983)
- నేటి యుగధర్మం (1986)
- శ్రీనివాస కళ్యాణం (1987)
- కర్తవ్యం (1991)
- రౌడీగారి పెళ్ళాం (1991)
- తెలుగోడు (1998)
- నీకు నేను నాకు నువ్వు (2003)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్రజ్యోతి. "'హీరో చుట్టూ కథలల్లి, గ్లామర్‌ని నమ్ముకుంటే ఫ్లాపులే". Retrieved 4 April 2017.