కల్నల్ సాండర్స్

(కల్నల్‌ సాండర్స్‌ నుండి దారిమార్పు చెందింది)

కల్నల్ హార్లాండ్ డేవిడ్ సాండర్స్ [a] (1890 సెప్టెంబరు 9  – 1980 డిసెంబరు 16) అమెరికన్ వ్యాపారవేత్త, ఫాస్ట్ ఫుడ్ చికెన్ రెస్టారెంట్ల శ్రేణి కెంటుకీ ఫ్రైడ్ చికెన్ (దీనిని KFC అని కూడా పిలుస్తారు) ను స్థాపించాడు. తరువాత కంపెనీ వ్యాపార రాయబారిగా, చిహ్నంగా పనిచేశాడు. అతని పేరు, చిత్రం ఇప్పటికీ కె.ఎఫ్.సి సంస్థకు చిహ్నాలుగా ఉన్నాయి. "కల్నల్" అనే బిరుదు గౌరవప్రదమైనది - కెంటుకీ కల్నల్ - సైనిక హోదా కాదు.

కల్నల్‌ సాండర్స్‌
ఐకానిక్ ఔట్‌ఫిట్‌ లో సాండర్స్ సుమారు 1974
జననం
హార్లాండ్ డేవిడ్ సాండర్స్‌

(1890-09-09)1890 సెప్టెంబరు 9
హెన్రీ వెల్లె, ఇండియానా, యు.ఎస్
మరణం1980 డిసెంబరు 16(1980-12-16) (వయసు 90)
లూయిస్‌వెల్లె, కెంటకీ, యు.ఎస్.
సమాధి స్థలంకేవ్ హిల్ సెమెటరీ, లూయిస్‌విల్లె
జాతీయతఅమెరికన్
విద్యలా ఎక్స్‌టెన్షన్ యూనివర్శిటీ
వృత్తి
  • వ్యాపారవేత్త
  • అల్పాహారశాల యజమాని
క్రియాశీల సంవత్సరాలు1930–1980
బోర్డు సభ్యులుకె.ఎఫ్.సి వ్యవస్థాపకుడు
జీవిత భాగస్వామి
Josephine King
(m. 1909; div. 1947)

Claudia Price
(m. 1949)
పిల్లలు3
సంతకం

సాండర్స్ తన ప్రారంభ జీవితంలో ఆవిరి యంత్రాలకు బొగ్గులు వేసే ఉద్యోగంలో, ఇన్సూరెన్స్ అమ్మకం దారుగా, ఇంధనాన్ని నింపే కేంద్రంలో పనివాడిగా అనేక ఉద్యోగాలను చేసాడు. అతను ఆర్థిక మాంద్యం సమయంలో కెంటుకీలోని నార్త్ కార్బిన్‌లోని రోడ్డు ప్రక్కన రెస్టారెంట్ ను నిర్వహిస్తూ వేయించిన కోడిమాంసం అమ్మడం ప్రారంభించాడు. ఆ సమయంలో సాండర్స్ తన రహస్య వంటకంను, ప్రెజర్ ఫ్రైయర్‌లో కోడిమాంసం వంటలకు పేటెంటు హక్కులు పొంది వాటిని అభివృద్ధి చేశాడు. సాండర్స్ ఫలహార శాల రంగంలో గొలుసుకట్టు దుకాణాలు(ఫ్రాంఛైజింగ్) భావన సామర్థ్యాన్ని గుర్తించాడు. మొదటి కెఎఫ్సి గొలుసుకట్టుదుకాణం 1952 లో ఉటా లోని సౌత్ సాల్ట్ లేక్‌లో ప్రారంభించబడింది. తన అసలు రెస్టారెంట్ మూసివేసిన తరువాత, తన వేయించిన చికెన్‌ను దేశవ్యాప్తంగాగొలుసుకట్టు దుకాణాలు అభివృద్ధి చేయడానికి పూర్తి సమయం కేటాయించాడు.

అమెరికా సంయుక్తరాష్ట్రాలలో, విదేశాలలో కంపెనీ వేగంగా విస్తరించడం సాండర్స్ కు మహర్దశ పట్టింది. 1964 లో తన 73 సంవత్సరాల వయస్సులో, అతను కంపెనీని జాన్ వై. బ్రౌన్ జూనియర్, జాక్ సి. మాస్సే నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందానికి $2 మిలియన్లకు (ఈ రోజు 16.5 మిలియన్లు) విక్రయించాడు. అయినప్పటికీ, అతను కెనడాలో కార్యకలాపాల నియంత్రణ అతను చేసేవాడు. అతను కెంటుకీ ఫ్రైడ్ చికెన్ కోసం జీతం పొందిన వ్యాపార రాయబారి అయ్యాడు. తన తరువాతి సంవత్సరాల్లో, అతను కెఎఫ్సి ఫలహారశాలలు అందించే ఆహారాన్ని తీవ్రంగా విమర్శించాడు. ఎందుకంటే అవి ఖర్చులు తగ్గించి, నాణ్యత క్షీణించటానికి కారణమయ్యాయని నమ్మాడు.

జీవితం, వృత్తి

మార్చు

1890-1906: ప్రారంభ జీవితం

మార్చు
 
1897 లో 7 సంవత్సరాల వయస్సులో తన తల్లితో సాండర్స్

హర్లాండ్ డేవిడ్ సాండర్స్ 1890 సెప్టెంబరు 9 న ఇండియానాలో హెన్రీవిల్లెకు తూర్పున 5 కి.మీ దూరంలోని ప్రాంతంలో ఉన్న నాలుగు గదుల ఇంట్లో జన్మించాడు.[1] అతను విల్బర్ డేవిడ్, మార్గరెట్ ఆన్ సాండర్స్ దంపతులకు జన్మించిన ముగ్గురు పిల్లలలో పెద్దవాడు. కుటుంబం అడ్వెంట్ క్రిస్టియన్ చర్చికి హాజరయ్యేవారు. [2] అతని తండ్రి సౌమ్యమైన, ఆప్యాయతగల వ్యక్తిగా తన 80 ఎకరాల పొలంలో తాను క్రిందపడిపోయి కాలు విరిగిపోయేంతవరకు పనిచేశాడు. ఆ తర్వాత హెన్రీవిల్లేలో రెండేళ్లపాటు కసాయిగా పనిచేశాడు. సాండర్స్ తల్లి భక్తురాలైన క్రైస్తవ మతస్తురాలు. తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దడానికి కఠినంగా "మద్యం, పొగాకు, జూదం, ఆదివారం నాడు ఈలలు వేయటం" గురించి నిరంతరం హెచ్చరిస్తుండేవారు. [3]

సాండర్స్ తండ్రి 1895 లో మరణించాడు. అతని తల్లికి టమోటా పరిశ్రమలో ఉద్యోగం వచ్చింది. యువ హార్లాండ్ తన తోబుట్టువులను చూసుకోవడం, వండిపెట్టడం చేసేవాడు. [1] ఏడు సంవత్సరాల వయస్సులో అతను రొట్టె, కూరగాయలు వండే నైపుణ్యం పొందాడు. తరువాత మాంసంతో వంటకాలు చేయడం నేర్చుకున్నాడు. ఆమె తల్లి ఉద్యోగం కోసం కొన్ని రోజులు పిల్లలకు దూరంగా ఉన్నందున వారికి ఆహారం అందించడంలోసం ఇవన్నీ చేసేవాడు. అతను తన 10 సంవత్సరాల వయస్సులో పొలంకూలిగా పనిచేయడం ప్రారంభించాడు.

1902 లో సాండర్స్ తల్లి విలియం బ్రాడ్‌డస్‌తో తిరిగి వివాహం చేసుకుంది. [4] వారి కుటుంబం ఇండియానాలోని గ్రీన్‌వుడ్‌కు వెళ్లింది. [5] సవతి తండ్రికి ఈ పిల్లలు ఉండటం ఇష్టం ఉండేది కాదు. అందువలన తరచూ గొడవలు పడుతుండేవాడు. తన సవతి తండ్రితో సాండర్స్ కు మంచి సంబంధాలు ఉండేవి కాదు. 1903 లో అతను ఏడవ తరగతి పరీక్ష తప్పాడు. తరువాత సమీపంలోని పొలంలో నివసిస్తూ, అక్కడ పని చేయడానికి వెళ్ళాడు. 13 సంవత్సరాల వయస్సులో అతను ఇల్లు విడిచి బయటకు వెళ్లాడు. [3] ఆ తరువాత ఇండియానా పోలిస్‌లో గుర్రపు బండ్లకు రంగులు వేసే ఉద్యోగంలో చేరాడు. అతను 14 సంవత్సరాల వయస్సులో, అతను పొలంకూలివానిగా పని చేయడానికి దక్షిణ ఇండియానాకు వెళ్లాడు.

1906-1930: వివిధ ఉద్యోగాలు

మార్చు

1906 లో సాండర్స్ తన తల్లి ఆమోదంతో తన మామతో కలిసి ఇండియానాలోని న్యూ అల్బానీలో నివసించడానికి వెళ్లాడు[6] అతని మామ రోడ్డుపైనడిచే రైలు కంపెనీలో పనిచేసేవాడు. అతను సాండర్స్‌కు కండక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. [7]

1906 అక్టోబరులో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో చేరాడు. క్యూబాలో సరకులబండి తోలే పనిచేసేవాడు. [6] అతను 1907 ఫిబ్రవరిలో గౌరవప్రదంగా ఈ ఉద్యోగం మానివేసి, అతని మామ నివసించిన అలబామాలోని షెఫీల్డ్‌లి వెళ్ళాడు. అక్కడ అతను తన సోదరుడు క్లారెన్సును కలుసుకున్నాడు. తన సోదరుడు కూడా వారి సవతి తండ్రి నుండి తప్పించుకోవడానికి అక్కడకి చేరాడు. అతని మామ దక్షిణ రైల్వేలో పనిచేసేవాడు. అతను సాండర్స్‌కు వర్క్‌షాపులలో కమ్మరి సహాయకుడిగా ఒక ఉద్యోగం సంపాదించాడు. [5] రెండు నెలల తరువాత, సాండర్స్ అలబామాలోని జాస్పర్‌కు వెళ్లి, అక్కడ ఉత్తర అలబామా రైల్‌రోడ్ (దక్షిణ రైల్వే లోని ఒక విభాగం) లో ప్రయాణం పూర్తయిన రైలు బండ్లలోని బూడిద పాత్రలను శుభ్రపరిచే ఉద్యోగంలో చేరాడు. తరువాత అతను తన 16 లేదా 17 యేడ్ల వయసులో ధూమయంత్రమునందు నిప్పును ఎగదోసే పని (ఫైర్‌మన్) గా చేరాడు.

1909 లో, సాండర్స్ నార్ఫోక్ అండ్ వెస్ట్రన్ రైల్వేలో శ్రామికునిగా పనిచేసాడు. [5] రైలుమార్గ నిర్మాణంలో పనిచేస్తున్నప్పుడు, అతను అలబామాలోని జాస్పర్‌కు చెందిన జోసెఫిన్ కింగ్‌ను కలిశాడు. కొంతకాలం తర్వాత వారు వివాహం చేసుకున్నారు. వారికి హార్లాండ్ జూనియర్ అనే కుమారుడు కలిగాడు. కానీ 1932లో టాన్సిల్స్ సోకి మరణించాడు. సాండర్స్ కు మార్గరెట్ సాండర్స్, మిల్డ్రెడ్ సాండర్స్ రగ్గల్స్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పుడు అతను ఇల్లినాయిస్ సెంట్రల్ రైల్‌రోడ్‌లో ఫైర్‌మెన్‌గా పని చేసేవాడు. అతను తన కుటుంబంతో టేనస్సీలోని జాక్సన్‌కు వెళ్లాడు. రాత్రి పాఠశాలలో సాండర్స్ లా సల్లే ఎక్స్‌టెన్షన్ విశ్వవిద్యాలయం ద్వారా కరస్పాండెన్స్ ద్వారా న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు. సహోద్యోగితో గొడవపడినందువల్ల సాండర్స్ ఇల్లినాయిస్‌లో ఉద్యోగాన్ని కోల్పోయాడు. [8] అతను తన పిల్లలను సరిగా పోషించలేకపోయాడు. సాండర్స్ రాక్ ఐలాండ్ రైల్‌రోడ్లో పని చేయడానికి వెళ్ళగా, అతని భార్య జోసెఫిన్, పిల్లలు ఆమె తల్లిదండ్రులతో కలిసి జీవించడానికి అతనిని వదిలి వెళ్లారు. భార్యా పిల్లలు ఆయనను వదిలి వెళ్లిపోయిన తరువాత అతను సాండర్స్ లిటిల్ రాక్‌లో న్యాయశాస్త్రం ప్రాక్టీసు ప్రారంభించాడు. అతను మూడు సంవత్సరాలు పనిచేసి, అతని కుటుంబం అతనితో కలిసి ఉండటానికి తగినంత డబ్బు సంపాదించాడు. కానీ తన సొంత కక్షిదారుడితో కోర్టు గదిలో ఘర్షణ పడినందున అతని న్యాయవాద వృత్తి జీవితం ముగిసింది. [9] అతను జీవితంలో చాలా నిరాశ చెందాడు.

ఆ తరువాత, సాండర్స్ తన తల్లితో హెన్రీవిల్లేకి తిరిగి వెళ్లి, పెన్సిల్వేనియా రైల్‌రోడ్‌లో కూలీగా పనిలో చేరాడు. [5] 1916 లో ఈ కుటుంబం జెఫెర్సన్‌విల్లేకు వెళ్లింది. అక్కడ సాండర్స్ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి జీవిత బీమాను విక్రయించే ఉద్యోగం పొందాడు. చివరికి అవిధేయత వలన ఆ ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. [10] అతను లూయిస్ విల్లెకు వెళ్లి న్యూజెర్సీ మ్యూచువల్ బెనిఫిట్ లైఫ్లో సేల్స్‌మన్ ఉద్యోగం పొందాడు.

1920 లో, సాండర్స్ ఒహియో నదిపై జెఫెర్సన్‌విల్లే, లూయిస్‌విల్లే మధ్య పడవను నడిపే ఫెర్రీ బోట్ కంపెనీని స్థాపించాడు.[5] అతను నిధుల కోసం అర్ధించి, స్వయంగా తక్కువశాతం వాటాదారుడు అయ్యాడు. తరువాత సంస్థ కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఫెర్రీ బోట్ కంపెనీ తక్షణ విజయం సాధించింది. [11] 1922 లో ఇండియానాలోని కొలంబస్‌లో ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో కార్యదర్శిగా ఉద్యోగంలో చేరాడు. అతను ఉద్యోగం అంత బాగా చేయడంలేడని స్వయంగా ఒప్పుకొని ఒక సంవత్సరం లోపే ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సాండర్స్ తన ఫెర్రీ బోట్ కంపెనీ షేర్లను $22,000 (ఈ రోజు $ 330,000 ) లకు అమ్మివేసాడు. ఈ డబ్బును ఎసిటిలీన్ దీపాలను తయారుచేసే సంస్థను స్థాపించడానికి ఉపయోగించాడు. డెల్కో సంస్థ తయారుచేసి విక్రయిస్తున్న విద్యుత్ బల్బులను అందరూ ఆదరిస్తున్నందున అతను స్థాపించిన దీపాల సంస్థ విఫలమైంది.

మిచెలిన్ టైర్ కంపెనీకి సేల్స్ మాన్ గా పనిచేయడానికి సాండర్స్ కెంటుకీలోని వించెస్టర్ కు వెళ్ళాడు. [5] 1924 లో మిచెలిన్ టైర్ కంపెనీ న్యూజెర్సీలోని తయారీ కర్మాగారాన్ని మూసివేసినప్పుడు అతను ఉద్యోగం కోల్పోయాడు. [12] 1924 లో అనుకోకుండా, అతను స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కెంటుకీ జనరల్ మేనేజర్‌ను కలిశాడు. అతను నికోలస్విల్లేలో ఒక సర్వీసు స్టేషనును నడపమని కోరాడు. 1930 లో, ఆర్థిక మాంద్యం ఫలితంగా స్టేషన్ మూసివేయబడింది. [13]

చిన్ననాటి నుంచి అనేక పర్యాయాలు జీవితమనే యుద్ధంలో ఓడిపోతూనే ఉన్నాడు.

దస్త్రం:Sanders cafe 2.png
కెంటకీలోని కార్బిన్ వద్ద తన కేఫ్‌లో పనిచేస్తున్న సాండర్స్, సుమారు 1930దశకం

1930 లో, షెల్ ఆయిల్ కంపెనీ సాంటెర్స్‌కు కెంటకీలోని నార్త్ కార్బిన్‌లో ఒక సర్వీసు స్టేషన్‌ను అద్దెలేకుండా ఉచితంగా ఇచ్చింది. దీనికి బదులుగా కంపెనీకి అమ్మకాలలో కొంత శాతం చెల్లించాలని సూచించింది. [5] సాండర్స్ కోడిమాంసపు వంటకాలు, స్థానిక మాంసం వంటకాలు, వండిన మాంసముముక్కలు వంటి ఇతర భోజన పదార్థాలను అందించడం ప్రారంభించాడు. ప్రారంభంలో అతను రెస్టారెంట్ తెరవడానికి ముందు తన ప్రక్కనే ఉన్న గదిలో ఖాతాదారులకు వడ్డించేవాడు. ఈ కాలంలోనే, సాండర్స్ తన స్టేషన్‌కు ట్రాఫిక్‌ను నిర్దేశించే గుర్తును తిరిగి పెయింట్ చేయడంపై మాట్ స్టీవర్ట్ అనే స్థానిక పోటీదారుడిచే కాల్పులకు గురయ్యాడు. సాండర్స్ పోటీని తొలగించుకునేందుకు, సాండర్స్ తో ఉన్న షెల్ ఉద్యోగిని స్టీవర్ట్ హత్య చేసాడు. 1935 లో కెంటుకీ గవర్నర్ రూబీ లాఫూన్ సాండర్స్ ను కెంటుకీ కల్నల్ గా నియమించాడు. అతనికి స్థానిక ప్రజాదరణ పెరిగింది. 1939 లో, వంట విమర్శకుడు డంకన్ హైన్స్ సాండర్స్ రెస్టారెంట్‌ను సందర్శించి, యు.ఎస్ అంతటా రెస్టారెంట్లకు అతని గైడ్ అయిన అడ్వెంచర్స్ ఇన్ గుడ్ ఈటింగ్‌లో చేర్చాడు. నమోదు వివరాలు చదవండి:

Corbin, KY.   Sanders Court and Café
41 — Jct. with 25, 25 E. ½ Mi. N. of Corbin. క్రిస్టమస్ తప్పించి సంవత్సరం పొడుగునా తెరచివుంటుంది
కుంబర్లాండ్ ఫాల్స్ కు, గ్రేట్ స్మోకీస్ కు వెళ్లేదారిలో ఆగటానికి మంచి స్థలం. 24 గంటల సేవ, వేడి స్టీకులు, వేయించిన కోడిమాంసం, దేశవాళీ పందిమాంసం, వేడి బిస్కట్లు. L 50¢ నుండి $1; D., 60¢ నుండి $1

1939 జూలై లో, సాండర్స్ నార్త్ కరోలినాలోని అషేవిల్లేలో ఒక గృహాన్ని కొనుక్కున్నాడు. [14] అతని నార్త్ కార్బిన్ రెస్టారెంట్, గృహం 1939 నవంబరులో జరిగిన అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. సాండర్స్ దీనిని 140 కూర్చొనగలిగే అల్పాహార శాలగా గృహంగా పునర్నిర్మించాడు. 1940 జూలై నాటికి, శాండర్స్ కోడిమాంసంను పెనంపై వేయించే కన్నా ఫ్రెషర్ పెనంపై వేయించి వేగంగా వండి తన " రహస్య వంటపద్ధతి " పై తుది నిర్ణయం చేసాడు. 1941 డిసెంబరులో యునైటెడ్ స్టేట్స్ రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించినప్పుడు, గ్యాస్ వాడకం నియంత్రించబడింది. పర్యాటక రంగం నష్టపోవడంతో సాండర్స్ తన అషేవిల్లే మోటెల్‌ను మూసివేయవలసి వచ్చింది. అతను 1942 చివరి భాగం వరకు సీటెల్‌లో పర్యవేక్షకుడిగా పనిచేశాడు. [5] తరువాత అతను టేనస్సీలోని ఆర్డినెన్స్ వర్క్స్‌లో ప్రభుత్వానికి ఫలహారశాలలను నడిపాడు. తరువాత టేనస్సీలోని ఓక్ రిడ్జ్‌లో సహాయక ఫలహారశాల మేనేజర్‌గా ఉద్యోగం పొందాడు.

అతను తన ఉంపుడుగత్తె క్లాడియా లిడింగ్టన్-ప్రైస్‌ను నార్త్ కార్బిన్ రెస్టారెంట్, మోటెల్‌కు మేనేజర్‌గా నియమించాడు. [5] 1942 లో, అతను అషేవిల్లే వ్యాపారాన్ని విక్రయించాడు. 1947 లో అతను తన భార్య జోసెఫిన్‌తో విడాకులు తీసుకున్నాడు. సాండర్స్ 1949 లో అతను చాలాకాలంగా కోరుకున్న క్లాడియాను వివాహం చేసుకున్నాడు. [15] సాండర్స్ ను అతని స్నేహితుడు గవర్నర్ లారెన్స్ వెథర్బీ 1950 లో కెంటుకీ కల్నల్ గా "తిరిగి నియమించాడు".

1952-1980: కెంటుకీ ఫ్రైడ్ చికెన్

మార్చు
 
ప్రపంచంలోని మొట్టమొదటి కెఎఫ్సి(KFC), ఉటాలోని సౌత్ సాల్ట్ లేక్‌లో ఉంది

1952 లో, సాండర్స్ తన రహస్య వంటకం "కెంటుకీ ఫ్రైడ్ చికెన్"(KFC)ను మొదటిసారి ఉటాలోని సౌత్ సాల్ట్ లేక్ కు చెందిన పీట్ హర్మాన్ కు నియమించాడు. పీట్ హర్మాన్ ఆ నగరంలోని అతిపెద్ద ఉపాహారశాలలో ఒకదానికి నిర్వాహకుడు. [16] ఉత్పత్తిని అమ్మిన మొదటి సంవత్సరంలో అమ్మకాలు మూడు రెట్లు పెరిగి, వేయించిన కోడిమాంసం అమ్మకాలలో 75% పెరుగుదల వచ్చింది. [17] హర్మాన్ అతని ఉపాహారశాల పోటీదారుల నుండి భిన్నంగా ఉండేందుకు మార్గంగా వేయించిన చికెన్‌ను అందించేవాడు. [18] హర్మాన్ చేత నియమించబడిన సంకేత చిత్రకారుడు డాన్ ఆండర్సన్ దానికి కెంటుకీ ఫ్రైడ్ చికెన్ అనే పేరు పెట్టాడు . హర్మాన్ విజయం తరువాత, అనేక ఇతర ఉపాహారశాలల యజమానులు ఈ భావనను వాడుకున్నారు. ప్రతి కోడిమాంసపు ముక్కకు సాండర్స్ కు $0.04 చెల్లించారు. [4]

తన పనిలో గెలిచిన ఆత్మవిశ్వాసంతో 120 దేశాల్లో 20 వేలకు పైగా రెస్టారెంట్లను స్థాపించాడు. అమెరికాలోనే తిరుగులేని వ్యక్తిగా రూపొందాడు. ఓటమి గెలుపునకు మొదటి మెట్టు అని సాండర్స్‌ నిరూపించాడు.

తన నార్త్ కార్బిన్ రెస్టారెంట్ నిరవధికంగా విజయవంతమవుతుందని సాండర్స్ నమ్మాడు, కాని కొత్తగా అంతర రాష్ట్ర రహదాని నిర్మించిన కారణంగా కస్టమర్ల రద్దీ తగ్గినందున తన 65 ఏళ్ళ వయసులో దీనిని నష్టానికే విక్రయించాడు.[19] తన పొదుపు, సామాజిక భద్రతా పథకం వల్ల ప్రభుత్వం నుండి వచ్చిన పెన్షన్ నెలకు $ 105 మాత్రమే అతని వద్ద మిగిలి ఉంది. జీవితమంతా ఎన్నో కష్టాలు, కనీసం చివర్లోనైనా సుఖంగా గడుపుతామంటే నెల నెలా వచ్చే ఈ పెన్షన్ తోనే జీవితం సాగించాలి. తనకంటూ తాను చేసుకున్నది, సాధించింది ఏమీ లేదు. మనసు నిండా ఇదే భాధ. దీనితో అతను 65 సంవత్సరాల వయస్సులో జీవితంపై విరక్తితో మరణించాలనుకున్నాడు. ఆఖరికి ఆత్మహత్యాయత్నంలో కూడా ఆయన ఓడిపోయాడు. ఒక రోజు పార్క్‌లో ఒక చెట్టుకింద కూర్చుని తన జీవితంపై సమీక్ష నిర్వహించాడు. తాను జీవితంలో ఓటమి పాలవడానికి కారణాలను అన్వేషించాడు. పరిశోధించాడు. సుదీర్ఘంగా ఆలోచించాడు. ప్రపంచంలో ఎవరూ చేయలేని పనిని చేయాలని నిర్ణయించుకున్నాడు. మనిషికి ప్రాథమిక అవసరమైన ఆహారం విషయంలో అనేక పరిశోధనలు చేశాడు. చివరకు విజయం సాధించాడు.11 రకాల మసాలా దినుసులతో కూడిన మంచి చికెన్ వంటకాన్ను తయారుచేసాడు. చికెన్‌ వంటకంతో ఒక రెస్టారెంట్‌ ప్రారంభించాడు. అది అనతికాలంలోనే ప్రజల ఆదరణ పొందింది.

సాండర్స్ తన కోడిమాంసపు భావనను గొలుసుకట్టు ద్వారా విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. తగిన ఉపాహరశాలల కోసం యు.ఎస్‌లో పర్యటించాడు. ఉత్తర కోర్బిన్ సైట్ మూసివేసిన తరువాత 1959 లో సాండర్స్, క్లాడియా కలసి షెర్బేవిల్లే వద్ద కొత్త ఉపాహారశాల, సంస్థ ప్రధాన కార్యాలయం ప్రారంభించారు.[20] తరచుగా తన కారు వెనుక సీటులో నిద్రిస్తూ సాండర్స్ అనేక ఉపాహారశాలలను సందర్శించాడు. అన్నింటిలో తాను చేసిన రెసిపీని వండి చూపించాడు. [4] వారు తమకు ఈ వంటకం నచ్చలేదని తెలిపారు. అయినా అతను బాధపడలేదు. మొత్తం అమెరికా అంతటా తిరుగుతూ అమెరికా అంతటా ఉన్న ఉపాహారశాలలలో తన వంటకాన్ని వండి చూపించాడు. అలా 1009 మంది తాను చేసిన కోడిమాంసంను వ్యతిరేకించారు. అయినా అతను పట్టు వదల్లేదు. చివరికి ఒక వ్యక్తి దీనిని తన రెస్టారెంటులో అమ్మడానికి ఒప్పుకున్నాడు. అమ్ముడైన ప్రతీ చికెన్ ముక్కకు 0.04 డాలర్లు ఇవ్వడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు.

గొలుసుకట్టు విధానం చాలా విజయవంతమైంది. అంతర్జాతీయంగా విస్తరించిన మొట్టమొదటి ఫాస్ట్ ఫుడ్ శ్రేణిలో కెఎఫ్సి ఒకటిగా నిలిచింది. కెనడా, యుకె, మెక్సికో, జమైకాలో 1960 ల మధ్యలో ఉపాహారశాలలను ప్రారంభించింది. సాండర్స్ 1962 లో తన వత్తిడి వంటసామాగ్రిలో వేయించి వండే కోడిమాంసం (ప్రెజర్ ఫ్రైయింగ్ చికెన్) పద్ధతికి పేటెంట్ పొందాడు.[21] 1963 లో "ఇట్స్ ఫింగర్ లికిన్ 'గుడ్' " అనే పదబంధాన్ని వ్యాపార చిహ్నంగా నమోదు చేశాడు.

600 కి పైగా స్థానాలకు కంపెనీ వేగంగా విస్తరించడం వృద్ధాప్యంలో ఉన్న సాండర్స్‌కు వాటిని నిర్వహించడం అధిక భారంగా మారింది. 1964 లో, అప్పటి 73 సంవత్సరాల వయస్సులో, అతను కెంటకీ ఫ్రైడ్ చికెన్ కార్పొరేషన్‌ను 2 మిలియన్ల (ఈ రోజు 16.5 మిలియన్లకు) అమెరికన్ డాలర్లకు 29 ఏళ్ల న్యాయవాది, భవిష్యత్ గవర్నర్ జాన్ వై. బ్రౌన్ జూనియర్ నేతృత్వంలోని కెంటుకీ వ్యాపారవేత్తల భాగస్వామ్యానికి విక్రయించాడు. బోర్డు మెంబర్లలో ఒకనిగా ఉంటూ సంవత్సరానికి 75 వేల డాలర్లు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. కంపెనీ అమ్మివేసిన తరువాత కూడా అతను కె.ఎఫ్.సి రెస్టారెంట్లన్నిటికి తిరుగుతూ వారు సరిగా వండుతున్నారో లేదో పరీక్షించేవాడు. ఒక వేళ ఏవైనా లోపాలుంటే ఒప్పుకొనేవాడు కాదు. [22]

1965 లో, సాండర్స్ తన కెనడియన్ గొలుసుకట్టు ఉపాహారశాలలను పర్యవేక్షించడానికి అంటారియోలోని మిస్సిసాగాకు వెళ్లాడు. కెనడాలో, యుఎస్‌లో గొలుసుకట్టు ఉపాహారశాలలనుండి రుసుములను సేకరించడం కొనసాగించాడు. సాండర్స్ 1965 నుండి 1980 వరకు మిస్సిసాగాలోని లేక్‌వ్యూ ప్రాంతంలోని 1337 మెల్టన్ డ్రైవ్ వద్ద ఒక బంగ్లాను కొనుగోలు చేసి అందులో నివసించాడు. [23] 1970 సెప్టెంబరులో అతను, అతని భార్య జోర్డాన్ నదిలో బాప్తిస్మం తీసుకున్నారు. [24] అతను బిల్లీ గ్రాహం, జెర్రీ ఫాల్వెల్ లతో స్నేహం చేశాడు.

సాండర్స్ తన కంపెనీ అమ్మిన తరువాత కంపెనీవ్యాపార రాయబారిగా ఉండి, సంస్థ తరపున సంవత్సరానికి 200,000 మైళ్ళు ప్రయాణించి, అనేక టీవీ వాణిజ్య ప్రకటనలు, ప్రదర్శనలను చిత్రీకరించాడు.

భారతదేశంలో కెఎఫ్సి

మార్చు

1990 దశకంలో భారతదేశం తొలిగా బెంగుళూరు కెఎఫ్సి ఉపాహారశాల తెరవబడింది. తరువాత చిన్న పట్టణాలలో కూడా ఇటువంటి ఉపాహరశాలలు తెరవబడ్డాయి.

 
1990 దశకంలో భారతదేశం తొలిగా బెంగుళూరు లో తెరచిన కెఎఫ్సి

ప్రజా గుర్తింపు

మార్చు

1950 లో గవర్నర్ లారెన్స్ వెథర్బీ చేత కెంటుకీ కల్నల్‌గా తిరిగి నియమించబడిన తరువాత, సాండర్స్ వస్త్ర ధారణను మార్చాడు. ఒక గోటీ (మేక గడ్డం వంటి గడ్డం) ను పెంచుకున్నాడు. నల్ల ఫ్రాక్ కోటు (తరువాత తెల్లటి సూట్‌కు మారడం), స్ట్రింగ్ టై ధరించి, తనను తాను "కల్నల్" అని పేర్కొన్నాడు. "

అతను తన జీవితంలో చివరి 20 సంవత్సరాలలో బహిరంగంగా మరేదీ ధరించలేదు. శీతాకాలంలో భారీ ఉన్ని సూట్, వేసవిలో తేలికపాటి కాటన్ సూట్ ఉపయోగించాడు. [25] అతను తన తెల్ల జుట్టుకు సరిపోయేలా మీసం గడ్డాన్ని బ్లీచ్ చేశాడు. [15]

కల్నల్‌ సాండర్స్‌ గోరీ వున్న స్థలం
సాండర్స్, అతని భార్య గోరీలున్న కేవ్ హిల్ శ్మశానం,లూయిస్విల్లే, కెంటుకీ

1980 జూన్ లో సాండర్స్ తీవ్రమైన లుకేమియాతో బాధపడ్డాడు. [26] అతను 1980 డిసెంబరు 16 న 90 సంవత్సరాల వయసులో న్యుమోనియాతో కెంటుకీలోని లూయిస్విల్లేలోని యూదు ఆసుపత్రిలో మరణించాడు. [27] [28] సాండర్స్ అతని మరణానికి ఒక నెల ముందు చురుకుగా ఉండి, తన తెల్లని సూట్‌లో జనాలకు కనిపించాడు. [29] దక్షిణ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ చాపెల్ లో అంతిమ సంస్కారాల సేవకు 1,000 మంది కంటేఎక్కువగా హాజరయ్యారు. ఆ తరువాత కెంటుకీ రాజధాని ఫ్రాంక్పోర్ట్ లో ప్రజాసందర్శనార్ధం వుంచారు. ఆతరువాత లూయిస్ విల్లెలోని కేవ్ హిల్ శ్మశానవాటికలో అతని శరీరం వైట్ సూట్, బ్లాక్ వెస్ట్రన్ స్ట్రింగ్ టై వస్త్రధారణలో ఖననం చేయబడింది .

స్మారకం

మార్చు

సాండర్స్ మరణించే సమయానికి, ప్రపంచవ్యాప్తంగా 48 దేశాలలో 6,000 కెఎఫ్సి అవుట్‌లెట్‌లు ఉన్నాయని, సంవత్సరానికి 2 బిలియన్ డాలర్లు అమ్మకాలు జరిగేవని అంచానా వేయబడింది. [30]

దాతృత్వం

మార్చు

అతని మరణానికి ముందు సాండర్స్ తన స్టాక్ హోల్డింగ్స్‌ను కల్నల్ హార్లాండ్ సాండర్స్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్, రిజిస్టర్డ్ కెనడియన్ ఛారిటీని సృష్టించాడు. [31] మహిళల, పిల్లల సంరక్షణ కోసం మిస్సిసాగా హాస్పిటల్ విభాగానికి కల్నల్ హార్లాండ్ సాండర్స్ ఫ్యామిలీ కేర్ సెంటర్ అని పేరు పెట్టారు. [32] సాండర్స్ ఫౌండేషన్ కూడా ఇతర కెనడియన్ పిల్లల ఆస్పత్రులను సహా మక్ మాస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఇడబ్ల్యుకె (IWK) ఆరోగ్య కేంద్రం, స్టోలరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ లకు విరాళాలనిచ్చింది.[33] కెనడా రెవెన్యూ ఏజెన్సీకి దాఖలు చేసిన పన్ను రిటర్న్ ప్రకారం, టొరంటో ఆధారిత ఫౌండేషన్ 2016 లో $500,000 ను ఇతర కెనడియన్ స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేసింది. [34]

మూలాలు

మార్చు
  1. Sanders was given the honorary title "Kentucky Colonel" in 1935 by Governor Ruby Laffoon.
  1. 1.0 1.1 Klotter, The Human Tradition in the New South, p. 130.
  2. Sanders, Harland (1974). The Incredible Colonel. Illinois: Creation House. p. 13. ISBN 978-0-88419-053-0.
  3. 3.0 3.1 "Colonels of Truth".
  4. Kleber, John E.; Clark, Thomas D.; Harrison, Lowell H.; Klotter, James C., eds. (January 13, 2015) [1992]. "Sanders, Harland David". The Kentucky Encyclopedia. Lexington, Kentucky: University Press of Kentucky. pp. 796–797. ISBN 978-0-8131-1772-0. Archived from the original on September 12, 2016. Retrieved March 16, 2016.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 Sanders, Harland (2012). The Autobiography of the Original Celebrity Chef (PDF). Louisville: KFC. ISBN 978-0-9855439-0-7. Archived from the original (PDF) on September 21, 2013. Retrieved October 1, 2013.
  6. 6.0 6.1 Klotter, The Human Tradition in the New South, p. 131.
  7. Ozersky, Josh (2012). Colonel Sanders and the American Dream. University of Texas Press. p. 8. ISBN 978-0-292-74285-7.
  8. Sanders, Harland (1974). The Incredible Colonel. Illinois: Creation House. p. 30. ISBN 978-0-88419-053-0.
  9. Ozersky, Josh (2012). Colonel Sanders and the American Dream. University of Texas Press. p. 12. ISBN 978-0-292-74285-7.
  10. Ozersky, Josh (2012). Colonel Sanders and the American Dream. University of Texas Press. p. 14. ISBN 978-0-292-74285-7.
  11. Klotter, The Human Tradition in the New South, p. 134.
  12. Sanders, Harland (1974). The Incredible Colonel. Illinois: Creation House. p. 45. ISBN 978-0-88419-053-0.
  13. Ozersky, Josh (2012). Colonel Sanders and the American Dream. University of Texas Press. p. 19. ISBN 978-0-292-74285-7.
  14. Darden, Robert (January 1, 2004). Secret Recipe: Why Kfc Is Still Cooking After 50 Years. Tapestry Press. ISBN 978-1-930819-33-7. Archived from the original on May 30, 2013. Retrieved April 10, 2013.
  15. 15.0 15.1 Klotter, The Human Tradition in the New South, p. 142.
  16. Nii, Jenifer K. (2004). "Colonel's landmark KFC is mashed". Deseret Morning News. Archived from the original on January 13, 2010. Retrieved October 28, 2007.
  17. Lawrence, Jodi (November 9, 1969). "Chicken Big and the Citizen Senior". The Washington Post and Times-Herald. p. 305.
  18. Liddle, Alan (May 21, 1990). "Pete Harman". Nation's Restaurant News.
  19. I've Got a Secret interview, originally broadcast April 6, 1964 (rebroadcast by GSN March 30, 2008).
  20. McGuire, Jenn (October 12, 2010). "Claudia Sanders Dinner House Serves Up the Real Thing". HelloLouisville. Archived from the original on 2013-12-31. Retrieved August 23, 2016.
  21. "Process of producing fried chicken under pressure US 3245800 A". Archived from the original on November 10, 2016. Retrieved November 9, 2016.
  22. "KFC Corporation History". Retrieved August 23, 2016.
  23. "KFC nixes Mississauga's Col. Sanders for new upmarket restaurant". NiagarathisWeek. July 17, 2013. Archived from the original on 2016-01-30. Retrieved August 23, 2016.
  24. Klotter, The Human Tradition in the New South, p. 153.
  25. Ozersky, Josh (September 15, 2010). "KFC's Colonel Sanders: He Was Real, Not Just an Icon". Time. Archived from the original on 2012-09-13. Retrieved September 18, 2010.
  26. Miller, John Winn (December 16, 1980). "Flags at half-staff to honor Sanders". Associated Press. Louisville, Ky. – Flags were flying at half-staff here today as Kentucky honored Col. Harland sanders, the smiling, white-suited gentleman whose "secret recipe" started an international fried chicken empire.
    Sanders, founder of the Kentucky Fried Chicken franchise, died Tuesday at age 90.
    The immediate cause of death was pneumonia, aggravated by leukemia, said KFC spokesman John Cox.
    ...
    Sanders had been hospitalized Nov. 7 for treatment of an infection of the kidney and bladder. While undergoing treatment, he developed pneumonia for the third time this year and lapsed into critical condition.
    During an earlier hospital stay, doctors found he also was suffering from leukemia, a blood disease.
  27. "Col. Sanders, fried chicken king, dead". Chicago Tribune. December 17, 1980. p. 5.
  28. "Col. Sanders, 90, Dies of Pneumonia". The Washington Post. December 17, 1980.
  29. Downs, Jere (May 27, 2015). "KFC Col. Sanders' revival 'tarnishes' the icon". The Courier-Journal. Retrieved August 23, 2016.
  30. Smith, J. Y. (December 17, 1980). "Col. Sanders, the Fried-Chicken Gentleman, Dies". Washington Post.
  31. "Colonel Harland Sanders Charitable Organization, Inc". Canadian registered charities. Canada Revenue Agency. Retrieved February 16, 2018.[permanent dead link]
  32. "Child & Family Services". Trillium Health Partners (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on September 6, 2017. Retrieved July 12, 2017.
  33. Picard, Andre (November 13, 2008). "Health care in a bucket with fries". The Globe and Mail. Archived from the original on June 24, 2016. Retrieved February 16, 2018.
  34. "Colonel Harland Sanders Charitable Organization - Quick View". Charities listing. Canada Revenue Agency.[permanent dead link]

వనరులు

మార్చు

ఇతర పఠనాలు

మార్చు

బాహ్య లింకులు

మార్చు