కవల పిల్లలు

(కవల నుండి దారిమార్పు చెందింది)

కవల పిల్లలు తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి 1963లో విడుదలైన పార్ మగళె పార్ అనే తమిళ సినిమా మాతృక.

కవల పిల్లలు
(1964 తెలుగు సినిమా)
తారాగణం శివాజీ గణేశన్,
జానకి,
ఎం.ఆర్.రాధా,
పుష్పలత
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ కస్తూరి ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సంతానం కోసం తపించిన జమీందారు శివానందానికి చివరకు ఒక ఆడపిల్ల కలుగుతుంది. అదే సమయంలో అదే ఆసుపత్రిలో సులోచన అనే ఒక నర్తకి కూడా మరో ఆడపిల్లను కంటుంది. ప్రసవ సమయానికి శివానందం ఊరిలో ఉండడు. అతని స్నేహితుడు రామస్వామి ఆ సమయంలో సహాయంగా ఉంటాడు. ఆ పసికందులకు నీళ్ళు పోయడానికి తీసుకుపోయిన నర్సులు ఎలెక్ట్రిక్ షాకుతో మరణిస్తారు. భర్త చేత వంచించ బడిన సులోచన ఆసుపత్రి నుండి వెళ్లిపోతుంది. ఆ ఇద్దరు శిశువులు ఎవరి పిల్లలో గుర్తు పట్టడానికి వీలు లేకుండా పోతుంది. డాక్టరు ఆ ఇద్దరు శిశువులను జమీందారు భార్య లక్ష్మికి చూపిస్తుంది. ఆమె కూడా తన బిడ్డ ఎవరో గుర్తించలేకపోతుంది. సరిగ్గా ఆ సమయానికి శివానందం వచ్చి ఆ శిశువులను చూసి తన భార్యకు పుట్టిన కవలలు అనుకుంటాడు. అసలు విషయాన్ని డాక్టర్, లక్ష్మి, రామస్వామి జమీందారుకు చెప్పలేకపోతారు. ఆ పిల్లలు చంద్ర, కాంత పేర్లతో పెద్దవుతారు. రామస్వామి ధనికుడిగా ఉన్నప్పుడు అతని కొడుకుకు పిల్లనిస్తానంటూ చేసిన వాగ్దానాన్ని ఆ తర్వాత నిరాకరించగా రామస్వామి కవలపిల్లల రహస్యాన్ని చాటింపు వేస్తాడు. దానితో కోటీశ్వరుని సంబంధం తప్పిపోతుంది. చివరకు శివానందం ఆ ఇద్దరినీ తన కవలపిల్లలుగానే స్వీకరిస్తాడు.[1]

పాటలు

మార్చు
  1. ఆమె బలియై పోగానే నన్నే మరచిపోగానే - పి.బి. శ్రీనివాస్, జేసుదాస్
  2. నా జనకుని మనోవీధి ప్రశాంతి యేది నేనిపుడు - పి.సుశీల
  3. నే కోరు పాటలనే ఏనాడు పాడి నాతోడు నీడగనే - ఘంటసాల
  4. బిడియమాయెనే సఖి చూడ - శూలమంగళం రాజ్యలక్ష్మి, పి.లీల
  5. మధురా నగరాన వసంతం అది మంగళ గీతి - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
  6. మా మనసే యమ్మా మా మనసే యమ్మా ఆరని చితిగా - జేసుదాస్

మూలాలు

మార్చు
  1. సంపాదకుడు (6 December 1964). "చిత్రసమీక్ష - కవల పిల్లలు". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 24 జూలై 2020. Retrieved 24 July 2020.

బయటిలింకులు

మార్చు