పుష్పలత (నటి)
పుష్పలత, ముందుతరం సినిమా నటి. ఈమె తెలుగు, తమిళ సినిమాలలో క్యారెక్టర్ పాత్రలను పోషించింది. ఈమె తమిళ నటుడు ఎ.వి.ఎం.రాజన్ను వివాహం చేసుకుంది. వీరి కుమార్తె మహాలక్ష్మి పలు కన్నడ సినిమాలలో నటించింది.
పుష్పలత | |
---|---|
జననం | మెట్టుపాళయం, కోయంబత్తూర్, భారతదేశం |
మరణం | 2025 ఫిబ్రవరి 4 |
వృత్తి | నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 1955-1987 |
భార్య / భర్త |
ఎ. వి. ఎమ్. రాజన్ (m. 1964) |
పిల్లలు | 2, మహాలక్ష్మితో సహా |
పుష్పాలత 1958లో ''సెంగోట్టై సింగం'' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది.
పుష్పలత నటించిన తెలుగు సినిమాలు
మార్చుపుష్పలత నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- సంసారం (1950)
- తిలోత్తమ (1951)
- పెళ్ళి చేసి చూడు (1952)
- ఆడబిడ్డ (1955)
- విప్లవ స్త్రీ (1961)
- కవల పిల్లలు (1964)
- పూలపిల్ల (1968)
- పెద్ద కొడుకు (1972)
- మేమూ మనుషులమే (1973)
- ఊర్వశి (1974)
- జమీందారు గారి అమ్మాయి (1975)
- యుగపురుషుడు (1978)
- రాజపుత్ర రహస్యం (1978)
- శ్రీరామ పట్టాభిషేకం (1978)
- మా వారి మంచితనం (1979)
- రంగూన్ రౌడీ (1979)
- వేటగాడు (1979 )
- అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
- కాళి (1980)
- కొండవీటి సింహం (1981)
- ప్రేమ కానుక (1981)
- రాధా కల్యాణం (1981)
- నువ్వే నా శ్రీమతి (1988)
మరణం
మార్చుపుష్పలత వృద్ధాప్యం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 87 సంవత్సరాల వయసులో టీ.నగర్ లోని తిరుమల పిళ్లై రోడ్డులోని ఆమె స్వగృహంలో 2025 ఫిబ్రవరి 4న మరణించింది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ "సీనియర్ నటి పుష్పలత ఇకలేరు... యాక్టింగ్ మానేశాక ఏం చేశారు? కూతురూ హీరోయినే అని తెల్సా?". A. B. P. Desam. 5 February 2025. Archived from the original on 5 February 2025. Retrieved 5 February 2025.
- ↑ "ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి పుష్పలత కన్నుమూత." TV9 Telugu. 5 February 2025. Archived from the original on 5 February 2025. Retrieved 5 February 2025.
- ↑ "సీనియర్ నటి పుష్పలత కన్నుమూత". Chitrajyothy. 5 February 2025. Archived from the original on https://www.chitrajyothy.com/2025/cinema-news/senior-actress-pushpalatha-passes-away-60799.html. Retrieved 5 February 2025.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help); External link in
(help)|archivedate=