కవిత 1976లో విడుదలయిన తెలుగు సినిమా. విజయకృష్ణ కంబైన్స్ పతాకంపై ఎస్.రఘునాథ్ నిర్మించిన ఈ సినిమాము విజయనిర్మల దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ కల్పించింది.

కవిత (1976)
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
నిర్మాణ సంస్థ విజయ కృష్ణ కంబైన్స్
భాష తెలుగు

పేరు లేని ఒక తెలుగు ఊరిలో మాధవయ్య (జగ్గయ్య) అనే ధనవంతుడు ఉరఫ్ కామాంధుడు ఉంటాడు. యవ్వనంలోనే భర్తను కోల్పోయి జీవనాధారం కోల్పోయి, తర్వాత ఒక్కగానొక్క కూతురి భవిష్యత్తు కోసం శీలాన్నీ కోల్పోయిన ఒకానొక స్త్రీ (సావిత్రి) ని మాధవయ్య ఉంచుకుంటాడు. ఆమె కూతురు కవిత చిన్ననాట నుంచీ మాధవయ్యను ఈసడించుకుంటూ పెరిగి పెద్దదవుతుంది. ఆ తర్వాత (విజయ నిర్మల అంత ఐన తర్వాత) సార్థక నామథేయురాలు కావడం కోసం కవితం రాస్తూంది. మహిళా మణుల రచనలకు మార్కెట్లో మంచి డిమాండు ఉంది కనుక ఆమె మంచి రచయిత్రి అవుతుంది.

కవి త స్వశక్తితో ఎంత రాణిస్తున్నా, సంఘం అమెను కులట కూతురిగా అవమానిస్తుంది. ఈ అడుగడుగునా అవమానాల్ని భరించలేక, మాధవయ్యను ఇంటికి రానీకుండా చేస్తుంది. ఇల్లు గడవడానికి కవిత చేసిన ఉద్యోగ ప్రయత్నాల్లో పగపట్టిన మాధవయ్య అడ్డుతగులుతుంటాడు. చివరికి కవిత ఒక మిషనరీ స్కూల్లో టీచరుగా చేరుతుంది.

ఒక రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉనన్ సమయంలో కవిత మాధవయ్య చేతిలో పతిత అవుతుంది. మాధవయ్య కవిత తల్లి చేతుల్లో హతమవుతాడు. పోలీసు తల్లీ కూతుళ్లను అరెస్టు చేస్తుంది. తర్వాత కవితను తలచుకొన్నప్పుడు కనబడమని విడుదల చేస్తారు. శీలం కోల్పోయిన కవిత ఉద్యోగమూ కోల్పోతుంది. మాధవయ్య కుమారుడు వేణు (చంద్రమోహన్) ఆమెకు ఆపద్భాంధవుడవుతాడు. కానీ మాధవయ్య అక్రమ సంతానం తన కడుపులో పెరుగుతున్నందున వేణుతో వివాహం సక్రమం కాదని వేణు చెల్లెలి పెళ్ళిలో బరువైన డైలాగులతో పెద్ద సందేశం చెప్పి వెళ్ళిపోతుంది కవిత.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: విజయనిర్మల
  • సంగీతం రమేష్ నాయుడు.
  • నిర్మాత:రఘునాథ్
  • విరజాజి పువ్వుల్లారా, వెలలేని రవ్వల్లారా, చిన్నారి పాపల్లారా, మాకంటి దివ్వెల్లారా, సుప్రభాతం, రచన: ఆరుద్ర గానం.పి.సుశీల బృందం
  • అబలగా జన్మించుటే అతివ నేరమా, రచన:ఆరుద్ర , గానం.పులపాక సుశీల
  • కారుమబ్బులు మూసేనే కటిక చీకటి, రచన:ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  • బాజా భజంత్రీలు మ్రోగుతాయి పందిట్లో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.అంజలి .

మూలాలు

మార్చు
  1. "Kavitha (1976)". Indiancine.ma. Retrieved 2020-08-23.
  2. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

3.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

"https://te.wikipedia.org/w/index.php?title=కవిత_(1976)&oldid=4309666" నుండి వెలికితీశారు