పోర్‌బందర్

గుజరాత్ లోని నగరం

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో పోర్‌బందర్ జిల్లా (గుజరాతీ : પોરબંદર જિલ્લો) ఒకటి.పోర్‌బందర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.జిల్లావైశాల్యం 2,298 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 5,86,062. వీరిలో 48.77% నగరప్రాంతాలలో నివసిస్తున్నారు.[1] జునాగఢ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి పోర్‌బందర్ జిల్లా రూపొందించబడింది. జిల్లా గుజరాత్ రాష్ట్ర ఖతియార్ ద్వీపకల్పం భూభాగంలో ఉంది.పోర్‌బందర్ ఉచ్ఛారణ భారత దేశము యొక్క గుజరాత్ రాష్ట్రములోని ఒక తీరప్రాంతపు పట్టణం. జాతిపిత మహాత్మా గాంధీ జన్మ స్థలము. ఇది పోర్‌బందర్ జిల్లా ముఖ్య పట్టణం.

పోర్‌బందర్ లోని గీతా మందిరములో మహాత్మా గాంధీ విగ్రహము
Districts of Saurashtra, Gujarat

పేరు వెనుక చరిత్రసవరించు

పోర్‌బందర్ అన్న పేరు పోరై , బందర్ అను రెండు పదాల కలయిక. పోరై", స్థానిక దేవత పేరు. బందర్ అనగా రేవు అని అర్ధం. కలిసి పోర్‌బందర్ అనగా పోరై యొక్క రేవు అని అర్ధం. చాలా చారిత్రక మూలల ఆధారముగా ఈ ప్రాంతము 10 వ శతాబ్దములో 'పౌరవెలకుల్' గా పిలవబడేదని తెలుస్తున్నది. ఈ ప్రాచీన నామమును పోరై తెగ యొక్క భూమి అని అనువదించవచ్చు. హిందూ పురాణాలలో ఈ పట్టణం శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు, సహాధ్యాయి అయిన సుధాముని స్వస్థలముగా పేర్కొనబడింది. ఈ వృత్తాంతముతో పట్టణం సుధామపురి అని కూడా పేరొందినది.

ప్రత్యేకతలుసవరించు

 
1958లో రోఖడియా హనుమాన్ గుడి

భారత దేశ పశ్చిమాత్య భాగములో ఉన్న పోర్‌బందర్ అరేబియా సముద్రము తీరంలో అన్ని ఋతువులలో పనిచేసే ఓడరేవు. 2001 జనాభా లెక్కల ప్రకారము ఈ పట్టణంలో లక్షన్నరకు పైగా జనాభా ఉంది. మహాత్మా గాంధీతో ఉన్న అనుబంధము వలన ప్రస్తుతము పోర్‌బందర్ ఒక యాత్రా ప్రదేశమైనది. ఇక్కడ ఒక విమానాశ్రయము, రైల్వే స్టేషను ఉన్నాయి. ఇక్కడి లోతు సముద్ర రేవు 20వ శతాబ్దపు చివరి పావు భాగములో నిర్మించబడింది.

సరిహద్దులుసవరించు

పోర్‌బందర్ జిల్లా ఉత్తర సరిహద్దులో జామ్‌నగర్ జిల్లా , దేవ్‌భూమి ద్వారకా జిల్లా, తూర్పు సరిహద్దులో జునాగఢ్ జిల్లా , రాజకోట్ జిల్లా, పశ్చిమ , దక్షిణ సరిహద్దులో అరేబియన్ సముద్రం ఉన్నాయి. 2011 గణాంకాలు అనుసరించి జిల్లా గుజరాత్ రాష్ట్రంలో అత్యల్ప జసంఖ్య కలిగిన రెండవ జిల్లాగా గుర్తించబడుతుంది. మొదటి స్థానంలో డాంగ్స్ జిల్లా ఉంది.[2]

చరిత్రసవరించు

పోర్‌బందర్ మహాత్మా గాంధీ జన్మస్థలంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఈ ప్రాంతం గురించి మాహాభారతంలో కూడా ప్రస్తావించబడింది. శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు సుధాముడు (కుచేలుడు) స్వస్థలంకూడా ఇదే. ఇక్కడ ఇప్పుడు సుధాముని మందిరం ఉంది. ఈ కారణంగా పోర్‌బందర్ ప్రముఖ యాత్రీక ప్రదేశంగా గుర్తించబడితుంది.

విభాగాలుసవరించు

పోర్‌బందర్ జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి.

  • పోర్‌బందర్ 1
  • పోర్‌బందర్ 2
  • పోర్‌బందర్ 3

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 586,062,[2]
ఇది దాదాపు. వయోమింగ్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. సోలోమన్ ఐలాండ్స్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 529వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 225 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.17%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 947:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 76.63%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

రవాణాసవరించు

  • విమానాశ్రయం: పోర్బందర్ విమానాశ్రయం నగరానికి విమానసేవలు అందిస్తుంది.
  • రైల్వే: పోర్బందర్ రైల్వే స్టేషను పోర్బందర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది.
  • రహదారులు: జాతీయరహదారి -8బి పోర్బందర్‌ను రాజ్కోట్‌తో కలుపుతుంది.

ప్రముఖులుసవరించు

  • మోహందాస్ కరంచంద్ గాంధి (1869–1948) ఆదర్శవాది , రాజకీయనాయకుడు, భారతస్వాతంత్ర్య సమరంలో కీలాపాత్ర వహించాడు. ఈయన పోర్బందర్‌లో జన్మించాడు.జాతిపితగా గౌరవించబడ్డాడు.[5]
  • విజయగుప్త మౌర్య (1909-1992) సైన్సు రచయిత. విజయగుప్త మౌర్య పోర్బందర్‌లో జన్మించాడు.

మూలాలుసవరించు

  1. "Census India Map". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-13.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Wyoming 563,626
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est.
  5. Fischer, Louis (1954). "Gandhi:His life and message for the world". Mentor. {{cite journal}}: Cite journal requires |journal= (help)

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

మూలాలజానితాసవరించు