మణిలాల్ గాంధీ

భారతీయ కార్యకర్త

మణిలాల్ మోహనదాస్ గాంధీ (అక్టోబరు 28 1892ఏప్రిల్ 5 1956[1][2])మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, కస్తూరిబాయి గాంధీ ల రెండవ కుమారుడు. ఈయన బ్రిటిష్ ఇండియాలో రాజకోట్ లో జన్మించారు. 1897 లో మణిలాల్ గాంధీ మొదటిసారి దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణమయ్యారు. అచట డర్బన్ వద్ద ఫోయినిక్స్ ఆశ్రమం లో పనిచేస్తూ గడిపారు. భారత దేశ పర్యటనల అనంతరం 1917 లో మణిలాల్ గాంధీ మరల దక్షిణాఫ్రికా కు వెళ్ళి "గుజరాతీ-ఇంగ్లీషు" కు చెందిన "ఇండియన్ ఒపీనియన్" అనే వారపత్రిక లో ముద్రణా సహాయకునిగా పనిచేశారు. 1918 లో మణిలాల్ ఆ ముద్రణా సంస్థకు విశేష సేవలందించారు. అనంతరం 1920 లో ఆ పత్రికకు సంపాదకునిగా ఎదిగారు. ఆయన తండ్రి మహాత్మా గాంధీ వలెనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆయన 1956 వరకు (ఆయన మరనం వరకూ) ఆ పత్రికకు సంపాదకునిగానే ఉన్నారు. ఆయన "సెరెబ్రల్ థ్రోంబోసిస్" అనే వ్యాధితో మరణించారు.

మణిలాల్ గాంధీ
ManilalGandhiImage.jpg
జననం(1892-10-28) 1892 అక్టోబరు 28
రాజ్‌కోట్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్, భారతదేశము)
మరణం1956 ఏప్రిల్ 5 (1956-04-05)(వయసు 63)
డర్బన్, దక్షిణ ఆఫ్రికా
జీవిత భాగస్వామిసుశీల మశ్రువాలా
(1927-1956)
పిల్లలుసీత (1928)
ఈలా గాంధీ (1940)
అరుణ్ మణిలాల్ గాంధీ (1934)
తల్లిదండ్రులుమహాత్మా గాంధీ
కస్తూరిబాయి గాంధీ

వారసత్వంసవరించు

1927 లో మణిలాల్ గాంధీ "సుశీల మశ్రువాల"ను వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. వారు సీత(1928) ,ఈలా గాంధీ (1940), అరుణ్ మణిలాల్ గాంధీ(1934). అరుణ్ మణిలాల్, ఎలా గాంధీలు సామాజిక-రాజకీయ కార్యకర్తలు. సమాజ సేవకులు. సీత కుమార్తె అయిన ఉమా డి.మెస్త్రీ యిటీవల "మణిలాల్ గాంధీ జీవిత చరిత్ర" పై ఒక పుస్తకాన్ని ప్రచురించారు.[3]

నోట్సుసవరించు

  1. http://lccn.loc.gov/n90712835
  2. Dhupelia-Mesthrie: Gandhi’s Prisoner? The Life of Gandhi’s Son Manilal, p. 384
  3. Uma Dhupelia Mesthrie, Gandhi’s Prisoner? The Life of Gandhi’s Son Manilal. (Permanent Black: Cape Town, South Africa, 2003).

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు