కాగిత వెంకట్రావు

కాగిత వెంకటరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. ఆయన పెడన నియోజకవర్గం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు.

కాగిత వెంకట్రావు

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
ముందు జోగి రమేష్
తరువాత జోగి రమేష్
నియోజకవర్గం పెడన నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
నాగేశ్వరరావుపేట గ్రామం, బంటుమిల్లి మండలం , కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 29 ఏప్రిల్ 2021
విజయవాడ
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు సుబ్బారావు
సంతానం 2
నివాసం మచిలీపట్నం

జననం మార్చు

కాగిత వెంకటరావు 1950లో తల్లిదండ్రులు  సుబ్బరావమ్మ  సుబ్బారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలం, నాగేశ్వరరావు పేట గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం మార్చు

కాగిత వెంకటరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యాడు. ఆయన మల్లేశ్వరం, పెడన నియోజకవర్గాల నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కాగిత వెంకట్రావు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌‌గా , రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి బంటుమిల్లి జెడ్పిటీసీగా ఎన్నికై, కృష్ణా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా పని చేశాడు.

పోటీ చేసిన నియోజకవర్గాలు మార్చు

సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు ఫలితం
2014 పెడన జనరల్ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 71,779 బూరగడ్డ వేదవ్యాస్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 58,085 గెలుపు
2009 పెడన జనరల్ జోగి రమేష్ కాంగ్రెస్ పార్టీ 44480 కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 43288 ఓటమి
2004 మల్లేశ్వరం జనరల్ బూరగడ్డ వేదవ్యాస్‌ కాంగ్రెస్ పార్టీ 65300 కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 41499 ఓటమి
1999 మల్లేశ్వరం జనరల్ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 49310 బూరగడ్డ వేదవ్యాస్‌ కాంగ్రెస్ పార్టీ 48641 గెలుపు
1994 మల్లేశ్వరం జనరల్ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 50791 బూరగడ్డ వేదవ్యాస్‌ కాంగ్రెస్ పార్టీ 42680 గెలుపు
1989 మల్లేశ్వరం జనరల్ బూరగడ్డ వేదవ్యాస్‌ కాంగ్రెస్ పార్టీ 48837 కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 43839 ఓటమి
1985 మల్లేశ్వరం జనరల్ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 38518 బూరగడ్డ వేదవ్యాస్‌ కాంగ్రెస్ పార్టీ 37289 గెలుపు

మరణం మార్చు

కాగిత వెంకట్రావు అనారోగ్యంతో బాధపడుతూ 29 ఏప్రిల్ 2021న గుండెపోటుతో మరణించాడు.[1][2][3]

మూలాలు మార్చు

  1. EENADU (29 April 2021). "మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మృతి". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  2. The Hans India (30 April 2021). "TDP senior leader Kagita Venkata Rao passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  3. Andrajyothy (29 April 2021). "టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు మృతి". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.