కాచవరం (కారంపూడి)
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
(కాచవరం(కారంపూడి) నుండి దారిమార్పు చెందింది)
"కాచవరం (కారంపూడి)" పల్నాడు జిల్లా, కారంపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కాచవరం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°32′13″N 79°43′07″E / 16.536873°N 79.718603°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | కారంపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | సయ్యెద్ కరీమూన్ |
పిన్ కోడ్ | 522614 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ పంచాయతీ
మార్చు2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, సయ్యెద్ కరీమూన్, సర్పంచిగా ఎన్నికైనాడు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ రామాలయం
మార్చుఈ గ్రామములోని ఈ ఆలయంలో నూతనంగా నిర్మించిన ఐదు ఉపాలయాలలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-4వతేదీ ఆదివారం నుండి ప్రారంభించారు. 8వతేదీ గురువారం ఉదయం 8-35 కి, ఐదు ఉపాలయాలలో, ఏకకాలంలో, యంత్రప్రతిష్ఠలతోపాటు, సీతారామచంద్రమూర్తి, గణపతి, ఆంజనేయస్వామి, పాటిపాటేశ్వరమ్మ, పోలేరమ్మ అమ్మవారి విగ్రహాలతోపాటు, నాభిశిల, జీవధ్వజ, కీర్తిధ్వజ, కలశప్రతిష్ఠలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రమూర్తిస్వామివారికి శాంతికళ్యాణం నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామయువకులు నిర్వహించిన కోలాట ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నది.