కాటన్ విశ్వవిద్యాలయం

(కాటన్ కళాశాల నుండి దారిమార్పు చెందింది)

కాటన్ విశ్వవిద్యాలయం (గతంలో కాటన్ కాలేజ్ అని పిలువబడేది) భారతదేశంలోని అస్సాం గౌహతిలో ఉన్న ఒక ప్రభుత్వ రాష్ట్ర విశ్వవిద్యాలయం. కాటన్ కాలేజ్ స్టేట్ యూనివర్శిటీ , కాటన్ కాలేజీలను విలీనం చేసిన అస్సాం శాసనసభ చట్టం నిబంధనల ద్వారా ఇది 2017లో స్థాపించబడింది. ఈ విశ్వవిద్యాలయం దేశంలోని అగ్ర విద్యాసంస్థలలో ఒకటి. కాటన్ కాలేజీని 1901లో మాజీ బ్రిటిష్ ప్రావిన్స్ అస్సాం చీఫ్ కమిషనర్ సర్ హెన్రీ స్టెడ్మన్ కాటన్ స్థాపించాడు. ఇది అస్సాంతో పాటు ఈశాన్య భారతదేశం అన్ని ఉన్నత విద్యాసంస్థలలో అత్యంత పురాతనమైన సంస్థ. కాటన్ కళాశాల 1948నుండీ గౌహతి విశ్వవిద్యాలయం యొక్క అనుబంధ కళాశాలగా ఉండేది. తరువాత అస్సాం ప్రభుత్వం 2011లో ఒక చట్టం (2011 చట్టం XIX) ద్వారా స్థాపించబడిన కాటన్ కాలేజ్ స్టేట్ యూనివర్శిటీకి అనుబంధ కళాశాలగా అవతరించింది. కళాశాల, విశ్వవిద్యాలయాల మధ్య సమస్యలను పరిష్కరించడానికి కాటన్ విశ్వవిద్యాలయ చట్టం, 2017 అమలు చేయబడింది.

కాటన్ విశ్వవిద్యాలయం
నినాదంఅప్రమత్తేన వేదవ్యం
ఆంగ్లంలో నినాదం
Knowledge in any field
రకంపబిక్ స్టేట్ యూనివర్సిటీ
స్థాపితం
  • 1901; 123 సంవత్సరాల క్రితం (1901) (కాటన్ కాలేజీగా)
  • 2017; 7 సంవత్సరాల క్రితం (2017) (కాటన్ విశ్వవిద్యాలయంగా)
వ్యవస్థాపకుడుసర్ హెన్రీ జాన్ స్టెడ్‌మన్ కాటన్
ఛాన్సలర్అస్సాం గవర్నరు
వైస్ ఛాన్సలర్డా.రమేష్ సి.హెచ్. డేకా[1]
స్థానంగౌహతి, అస్సాం, భారతదేశం
26°11′12″N 91°44′51″E / 26.1868°N 91.7476°E / 26.1868; 91.7476
కాంపస్అర్బన్
రంగులుఆరంజ్, నీలం, ఆకుపచ్చ   
అనుబంధాలుUGC
కాటన్ విశ్వవిద్యాలయానికి అంకితం చేసిన 2002 స్టాంప్

చరిత్ర

మార్చు

1899లో మణిక్ చంద్ర బ్రిటిష్ ప్రభుత్వానికి గువాహాటిలో ఒక కళాశాలను ప్రారంభించాలని కోరుతూ లేఖ వ్రాశాడు. అస్సాంలో కళాశాల లేని ఏకైక ప్రావిన్స్ గౌహతి. దీనికి ప్రతిస్పందనగా, అప్పటి అస్సాం చీఫ్ కమిషనర్ సర్ హెన్రీ స్టెడ్మన్ కాటన్, 1899 నవంబర్ 3న గౌహతిలో ఒక కళాశాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. ప్రజలచే పేరు పెట్టబడిన కాటన్ కళాశాలను 1901 మే 27న కాటన్ స్వయంగా ప్రారంభించాడు. 1948కి ముందు, ఇది కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఈ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ అయిన ఫ్రెడెరిక్ విలియం సుడ్మేర్సన్, 39 మంది విద్యార్థులతో సహా ఐదుగురు ప్రొఫెసర్లతో ప్రారంభమైంది.ఈ కళాశాల స్వాతంత్ర్య ఉద్యమానికి, అలాగే రాష్ట్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలకు కేంద్రంగా ఉండేది. ఇది భారతదేశంలో ప్రత్యేకమైన, సమగ్రమైన భాగంగా అస్సాం గుర్తింపును నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 1948లో గౌహతి విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పుడు, కాటన్ కళాశాల దానికి అనుబంధ కళాశాలగా మారింది. 2015లో, ఈ కళాశాలను ప్రత్యేక వారసత్వ కళాశాలగా ప్రకటించారు. 1992 అక్టోబరు 16న, ఈ కళాశాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పేరు పెట్టారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలలో అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ పాల్గొన్నాడు. అప్పటి నుండి ఇది అధికారికంగా పోస్ట్-గ్రాడ్యుయేట్ కళాశాలగా మారింది.

 
విశ్వవిద్యాలయపు ప్రధాన కార్యాలయం

కాటన్ కాలేజ్ స్టేట్ యూనివర్శిటీ అస్సాం ప్రభుత్వ చట్టం (2011 చట్టం XIX) ద్వారా సృష్టించబడింది. ఈ చట్టం 2011 సెప్టెంబరు 3న అస్సాం గవర్నర్ ఆమోదం పొంది, 2011 సెప్టెంబరు 5న అస్సాం గెజిట్ ప్రచురించబడింది. కాటన్ కళాశాల దాని రాజ్యాంగ కళాశాలగా మారింది.

కాలక్రమేణా, విశ్వవిద్యాలయం, కళాశాలల మధ్య ప్రధానంగా ఆస్తుల అదుపుపై విభేదాలు తలెత్తాయి. విశ్వవిద్యాలయం, కళాశాలను ప్రత్యేక సంస్థలుగా నిర్వహించాలని అస్సాం శాసనసభ 2015లో ఒక సవరణను ఆమోదించింది. కాటన్ యూనివర్సిటీ చట్టం 2017 అని పిలువబడే ఈ బిల్లును ఈ సమస్యలను పరిష్కరించడానికి అస్సాం శాసనసభ 2 మార్చి 2017న ఆమోదించింది. ఈ చట్టం ద్వారా, విశ్వవిద్యాలయం, కళాశాలలు పూర్తిగా విలీనం చేయబడతాయి. అమలు చేసిన తరువాత, విశ్వవిద్యాలయానికి కాటన్ విశ్వవిద్యాలయం అని పేరు మార్చారు. ఆర్డినెన్స్ ద్వారా, అస్సాం గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ ఛాన్సలర్ అయ్యాడు. తరువాత జూలై 2017లో భాబేష్ చంద్ర గోస్వామిని మొదటి వైస్ ఛాన్సలర్‌గా నియమించారు.

 
కాటన్ కాలేజీ మొదటి బ్లాకు

కాటన్ విశ్వవిద్యాలయం, అప్పుడు కాటన్ కళాశాల, అధిక సంస్థాగత నాణ్యతను ప్రతిబింబిస్తూ, 2016 నవంబర్ 5 న జాతీయ మదింపు, గుర్తింపు సంస్థ (NAAC) యొక్క 18 వ ఎస్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా నాలుగు పాయింట్ల స్కేల్పై "ఎ + +" గ్రేడ్ తో గుర్తింపు పొందింది. 6 సెప్టెంబర్ 2024 నాటికి, విశ్వవిద్యాలయపు అక్రిడిటేషన్ "ఎ" గ్రేడుకు సవరించబడింది.

క్యాంపస్, ఇతర సౌకర్యాలు

మార్చు

కాటన్ విశ్వవిద్యాలయం ప్రాంగణం గువాహటిలోని సందడిగా ఉండే పాన్ బజార్‌లో 39.82 ఎకరాలమేరకు విస్తరించి ఉంది.

గ్రంథాలయం

మార్చు

ఈశాన్య భారతదేశంలోని పురాతన గ్రంథాలయాలలో ఒకటైన కాటన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ సూర్య కుమార్ భుయాన్ లైబ్రరీకి సంస్థ ప్రారంభమైనప్పటి నుండి గొప్ప చరిత్ర ఉంది. దాని సేకరణ పెరగడంతో, లైబ్రరీ గతంలో భౌతికశాస్త్ర విభాగం ఆక్రమించిన ప్రత్యేక భవనానికి మారింది. 1986లో డాక్టర్ సూర్య కుమార్ భుయాన్ గౌరవార్థం దీని పేరు మార్చారు. 1992లో రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ కొత్త మూడు అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేయడంతో లైబ్రరీ అభివృద్ధి కొనసాగింది. నేడు, లైబ్రరీ 130,968 పాఠ్యపుస్తకాలు, 4,935 రిఫరెన్స్ పుస్తకాలు, 56 థీసిస్, 6,365 విరాళంగా లభించిన పుస్తకాలు, 648 బ్రెయిలీ పుస్తకాలు, 3,263 బౌండ్ వాల్యూమ్‌ల విస్తృతమైన సేకరణను కలిగి ఉంది.

వసతి గృహాలు

మార్చు

కాటన్ విశ్వవిద్యాలయంలో నాలుగు బాలుర వసతి గృహాలు ఉన్నాయి. మహిళా విద్యార్థుల కోసం, విశ్వవిద్యాలయం మూడు వసతి గృహాలను అందిస్తుంది. మొత్తంగా ఈ ఏడు వసతి గృహాలు 655 మంది విద్యార్థులకు వసతి కలిగివుంది.

విద్యా కార్యక్రమాలు

మార్చు

ఈ విశ్వవిద్యాలయం హెచ్.ఎస్.ఎల్.సి., బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ అఫ్ సైన్స్, బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలరు ఆఫ్ లిబరల్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (హానర్స్ బయోటెక్నాలజీ) వంటి గ్రాడ్యుయేట్ డిగ్రీలను, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మాస్టర్ అఫ్ లా, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ , మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ డిగ్రీలకు దారితీసే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములను, అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాలలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph. D.) డిగ్రీని అందిస్తున్నది.

భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, పర్యావరణ జీవశాస్త్రం, వన్యప్రాణుల శాస్త్రాలు, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, భూగోళ శాస్త్రం, ఆంత్రోపాలజీ, ప్రాచీన భారతీయ సంస్కృతి, చరిత్ర, పురావస్తు శాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, తత్వశాస్త్రం, రాజకీయశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, సామాజికశాస్త్రం, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, మీడియా స్టడీస్, న్యాయశాస్త్రం, భాషాశాస్త్రాలు వంటి విస్తృతమైన అంశాలలో పై కోర్సులను అందిస్తున్నది. ప్రతియేటా 2600 మంది విద్యార్థులకు పై కోర్సులను అందజేస్తున్నది.

ప్రముఖ పూర్వ విద్యార్థులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Vice Chancellor". Cotton University. Archived from the original on 1 August 2017. Retrieved 1 August 2017.