కాటసాని రాంభూపాల్ రెడ్డి

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాణ్యం నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 15 సెప్టెంబర్ 2021న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యునిగా నియమితుడయ్యాడు.[1][2]

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి
కాటసాని రాంభూపాల్ రెడ్డి

పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
నియోజకవర్గం పాణ్యం

వ్యక్తిగత వివరాలు

జననం 27 డిసెంబర్ 1959
గుండ్ల శింగవరం, అవుకు మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ
తల్లిదండ్రులు కె. నరసింహ రెడ్డి
జీవిత భాగస్వామి ఉమా మహేశ్వరి
సంతానం శివనరసింహ రెడ్డి, ఉషారాణి, దేదీప్యా రాణి, మాధవీలత
నివాసం బనగానపల్లి
వృత్తి రాజకీయ నాయకుడు

ఎమ్మెల్యేగా పోటీ

మార్చు

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1981లో గుండ్ల శింగవరం గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అనంతరం ఆయన 1985, 1989,1994లో వరుసగా మూడుసార్లు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు. [3]

అయన 1999లో ఓటమి పాలై, 2004, 2009లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచాడు. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయాడు, అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన బీజేపీకి రాజీనామా చేసి 29 ఏప్రిల్, 2018న కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కనుమూరులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[4]

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పార్టీలో చేరిన తరువాత వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడై, 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[5]

సంవత్సరం విజేత పేరు పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
2019 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి వైఎస్సార్సీపీ 122476 గౌరు చరితా రెడ్డి టీడీపీ 78619 43857 గెలుపు
2014 గౌరు చరితా రెడ్డి వైఎస్సార్సీపీ 72245 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి 60598 11647 ఓటమి
2009 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ 63323 బైరెడ్డి రాజశేఖరరెడ్డి తె.దే.పా 54409 8914 గెలుపు
2004 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ 63077 బిజ్జం పార్థసారథి రెడ్డి తె.దే.పా 59469 3582 గెలుపు
1999 బిజ్జం పార్థసారథి రెడ్డి తె.దే.పా 63333 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ 42087 21246 ఓటమి
1994 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ 72629 కె. చంద్రశేఖర రెడ్డి తె.దే.పా 35240 37389 గెలుపు
1989 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ 55692 బిజ్జం సత్యనారాయణ రెడ్డి తె.దే.పా 40675 15017 గెలుపు
1985 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ 38712 బిజ్జం సత్యనారాయణ రెడ్డి తె.దే.పా 34653 4,059 గెలుపు

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (15 September 2021). "25 మందితో టీటీడీ పాలక మండలి.. తుది జాబితా ఖరారు చేసిన ఏపీ సర్కార్". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 10TV (16 September 2021). "తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే | List of members of the new governing body of Tirumala" (in telugu). Archived from the original on 16 September 2021. Retrieved 4 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.
  4. Sakshi (30 April 2018). "వైఎస్సార్‌సీపీలోకి కాటసాని రాంభూపాల్‌రెడ్డి". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.
  5. One india (2019). "Panyam Election Result 2019 LIVE: Panyam MLA Election Result & Vote Share - Oneindia" (in ఇంగ్లీష్). Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.