గౌరు చరితా రెడ్డి

భారతీయ రాజకీయ నాయకురాలు

గౌరు చరితా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే. ఆమె పాణ్యం నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా గెలిచింది.[1]

గౌరు చరితా రెడ్డి మాజీ ఎమ్మెల్యే
గౌరు చరితా రెడ్డి


ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 – 2009
తరువాత లబ్బి వెంకటస్వామి
నియోజకవర్గం నందికొట్కూరు నియోజకవర్గం
పదవీ కాలం
2014 – 2019
నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1971-08-04)1971 ఆగస్టు 4
కొణిదెల , కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్,భారతదేశం
రాజకీయ పార్టీ టీడీపీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఎస్. మల్లారెడ్డి , బాలనాగమ్మ
జీవిత భాగస్వామి గౌరు వెంకటరెడ్డి
సంతానం జనార్దన్ రెడ్డి & చిద్విల రెడ్డి

రాజకీయ జీవితం

మార్చు

గౌరు చరితా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో నందికొట్కూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బైరెడ్డి రాజశేఖరరెడ్డి పై 13488 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యింది. నందికొట్కూరు నియోజకవర్గం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్ కావడంతో పోటీకి దూరంగా ఉంది.

గౌరు చరితా రెడ్డి వైఎస్‌ మరణానంతరం జగన్‌కు మద్దతుగా నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆమె 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పై 11647 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది. ఆమె మార్చి 1, 2019న పార్టీకి వైఎస్సార్సీపీ కి రాజీనామా చేసింది.[2]

గౌరు చరితారెడ్డి తన భర్త గౌరు వెంకట రెడ్డితో కలిస్ మార్చి 9, 2019న తెలుగుదేశం పార్టీలో చేరింది.[3] ఆమె 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పాణ్యం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పై 43857 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

మూలాలు

మార్చు
  1. Sakshi (2 February 2018). "ముఖ్యమంత్రి మాట తప్పారు: గౌరు". Archived from the original on 1 September 2021. Retrieved 1 September 2021.
  2. The Hindu (2 March 2019). "Gowru couple quit YSRCP" (in Indian English). Archived from the original on 1 September 2021. Retrieved 1 September 2021.
  3. 10TV (9 March 2019). "టీడీపీ గూటికి గౌరు కుటుంబం" (in telugu). Archived from the original on 1 September 2021. Retrieved 1 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)