కాడ్మియం అయోడైడ్

కాడ్మియం అయోడైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం. సంయోగ పదార్థమనగా ఒకటికన్నా ఎక్కువ మూలకాల పరమాణువుల సంయోగం వలన ఏర్పడిన రసాయన సమ్మేళన పదార్థం.ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం.కాడ్మియం, అయోడిన్ పరమాణువుల సంయోగం వలన కాడ్మియం అయోడైడ్ సంయోగ పదార్థం ఏర్పడినది. కాడ్మియం అయోడైడ్ యొక్క రసాయన సంకేత పదం CdI2.ఈ రసాయన సంయోగ పదార్థం యొక్క విభిన్న స్పటికనిర్మాణం ప్రాముఖ్యత కల్గినది. బలమైన ధ్రువియ లక్షణాన్నికల్గిన, ఈ రకపు స్పటికనిర్మాణం MX2 రకపు సంయోగ పదార్థాలలో అరుదు.

కాడ్మియం అయోడైడ్
Cadmium iodide
Cadmium iodide
పేర్లు
IUPAC నామము
కాడ్మియం(II) అయోడైడ్
ఇతర పేర్లు
కాడ్మియం డైఅయోడైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7790-80-9]
పబ్ కెమ్ 277692
యూరోపియన్ కమిషన్ సంఖ్య 232-223-6
SMILES [Cd+2].[I-].[I-]
ధర్మములు
CdI2
మోలార్ ద్రవ్యరాశి 366.22 g/mol
స్వరూపం white to pale yellow crystals
సాంద్రత 5.640 g/cm3, solid
ద్రవీభవన స్థానం 387 °C (729 °F; 660 K)
బాష్పీభవన స్థానం 742 °C (1,368 °F; 1,015 K)
787 g/L (0 °C)
847 g/L (20 °C)
1250 g/L (100 °C)
ద్రావణీయత soluble in ethanol, acetone, ether and ammonia
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Trigonal, hP3, space group P3

m1, No. 164

కోఆర్డినేషన్ జ్యామితి
octahedral
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R23/25, మూస:R33, మూస:R68, R50/53
S-పదబంధాలు (S2)

, మూస:S22, S45

, S60

, S61

US health exposure limits (NIOSH):
PEL (Permissible)
[1910.1027] TWA 0.005 mg/m3 (as Cd)
REL (Recommended)
Ca[1]
IDLH (Immediate danger)
Ca [9 mg/m3 (as Cd)]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
zinc iodide
mercury(II) iodide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☑Y verify (what is ☑Y

☒N ?)

Infobox references

భౌతిక లక్షణాలుసవరించు

భౌతిక స్థితిసవరించు

కాడ్మియం అయోడైడ్ ఘనరూప పదార్థం.స్పటిక అణునిర్మాణం కల్గిఉన్నది. ఇది సామాన్యంగా తెల్లగా ఉండును.లేదా లేత/పాలిపోయిన పసుపురంగులో ఉండును.

అణుభారం/మాలిక్యులర్ మాస్సవరించు

కాడ్మియం అయోడైడ్ యొక్క అణుభారం 366.22 గ్రాములు/మోల్[2].

సాంద్రతసవరించు

కాడ్మియం అయోడైడ్ రసాయన సంయోగ పదార్థం యొక్క సాంద్రత(25 °C వద్ద) 5.670 గ్రాములు/సెం.మీ3[3].

ద్రవీభవన ఉష్ణోగ్రతసవరించు

కాడ్మియం అయోడైడ్ రసాయన సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 388 °C (729 °F; 660K) [3]

బాష్పీభవన ఉష్ణోగ్రతసవరించు

కాడ్మియం అయోడైడ్ రసాయన సంయోగ పదార్థం యొక్క బాష్పీభవన స్థానం 787 °C (1,368 °F; 1,015K) [4]

ద్రావణీయతసవరించు

కాడ్మియం అయోడైడ్ నీటిలో కరుగును అలాగే ఇథనాల్, ఎసిటోన్, ఇథర్, అమ్మోనియా లలో కరుగుతుంది.కాడ్మియం అయోడైడ్ ఒక లీటరు నీటిలో,0 °C వద్ద787 గ్రాములు, 20 °C వద్ద 847 గ్రాములు, 100 °C దగ్గర 1250 గ్రాములు కరుగును.

ఉత్పత్తిసవరించు

 • కాడ్మియం లోహాన్ని హైడ్రో అయోడిక్ఆమ్లంతో చర్య జరపడం వలన కాడ్మియం అయోడైడ్ ను ఉత్పత్తి చేయుదురు.
 • అలాగే కాడ్మియం ఆక్సైడ్తో హైడ్రో అయోడిక్ఆమ్లంతో చర్య జరపడం వలన కూడా కాడ్మియం అయోడైడ్ ను ఉత్పత్తి చేయుదురు.
 • కాడ్మియం హైడ్రాక్సైడ్ను హైడ్రో అయోడిక్ఆమ్లంతో చర్య జరిపించడం వలన కూడా కాడ్మియం అయోడైడ్ ను ఉత్పత్తి చేయుదురు.
 • ఇంకను కాడ్మియం కార్బోనేట్ తో కూడా హైడ్రో అయోడిక్ఆమ్లంలో కరగించి, తో చర్య జరిపించడం వలన కూడా కాడ్మియం అయోడైడ్ ను ఉత్పత్తి చేయుదురు[5]
 • అంతియే కాకుండా కాడ్మియం లోహాన్ని అయోడిన్ తో కలిపి వేడి చెయ్యడం వలన కూడా కాడ్మియం అయోడైడ్ ను ఉత్పత్తి చేయుదురు.

స్పటిక నిర్మాణసౌష్టవంసవరించు

కాడ్మియం అయోడైడ్అణువులో అయోడిన్ అయాన్ లు దగ్గరిగా ఆవృతమైన షట్కోణ అమరికతోఉండగా, కాడ్మియం కేటాయానులు ఆవృతమైన షట్కోణ స్థానం/తావులో వికల్పమైన (ఒకటివిడిచి ఒకటిగానున్న:alternate) పొరలలో నిండి యుండును.ఫలితంగా అణువు అల్లిక పొరల సౌష్టవాన్ని ప్రదర్శించును[6].ఈ మూల/ప్రథమ నిర్మాణాన్ని చాలాలవణాలలో, ఖనిజాలలో గుర్తించవచ్చును. కాడ్మియం అణునిర్మాణం ఎక్కువగా అయోనికల్ బంధం కల్గి, పాక్షిక సమన్వియ బంధ లక్షణా లను (covalent character ) కల్గి ఉంది.

ఉపయోగాలుసవరించు

కాడ్మియం అయోడైడ్‌ను లితోగ్రఫీ, పోటోగ్రఫీ,, విద్యుత్తు కళాయి ప్రక్రియ/ఎలక్ట్రోప్లేటింగు లలో ఉపయోగిస్తారు.అలాగే ప్రకాశకత్వంగల (phosphors) రసాయనాల నిర్మాణం/ తయారీలో /ఉత్పత్తిలో ఉపయోగిస్తారు.

మూలాలు/ఆధారాలుసవరించు

 1. NIOSH Pocket Guide to Chemical Hazards 0087
 2. "Cadmium iodide". chemspider.com. Retrieved 07-04-2016. Check date values in: |accessdate= (help)
 3. 3.0 3.1 "Cadmium iodide". sigmaaldrich.com. Retrieved 07-04-2016. Check date values in: |accessdate= (help)
 4. "Cadmium iodide". chemicalbook.com. Retrieved 07-04-2016. Check date values in: |accessdate= (help)
 5. "Cadmium Iodide, CdI2". cadmium.atomistry.com. Retrieved 07-04-2016. Check date values in: |accessdate= (help)
 6. "Cadmium Iodide structure". chemistrytextbookcrawl.blogspot.in. Retrieved 07-03-4-2016. Check date values in: |accessdate= (help)