కాదల్ సంధ్య
సంధ్య (జననం 1988 సెప్టెంబరు 27), ఆమె ఒక భారతీయ మాజీ నటి. ఆమె ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో, కొన్ని మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది. ఆమె, తన మొదటి సినిమా పేరుతో కాదల్ సంధ్యగా ప్రసిద్ధి చెందింది.
కాదల్ సంధ్య | |
---|---|
జననం | రేవతి 1988 సెప్టెంబరు 27[1] త్రివేండ్రం, కేరళ, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2004–2016 |
జీవిత భాగస్వామి | అర్జున్ (m. 2015) |
పిల్లలు | 1 |
ప్రారంభ జీవితం
మార్చుఆమె 1988 సెప్టెంబరు 27న కేరళలోని త్రివేండ్రంలో జన్మించింది. ఆమె తండ్రి అజిత్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగి, కాగా తల్లి మాయ బ్యూటీషియన్. ఆమెకు రాహుల్ అనే అన్నయ్య ఉన్నాడు.[2] ఆమె 9వ తరగతి పూర్తిచేసే వరకు చెన్నైలోని విద్యోదయ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివింది.
కెరీర్
మార్చుతమిళ ప్రేమకథా చిత్రం కాదల్ (2004)లో నటించినప్పుడు ఆమె ఇంకా చదువుకుంటోంది.[3][4][5] ఆ సినిమా విజయం తర్వాత, 2004లో, ఆమె నటుడు జయరామ్ సోదరిగా ఆలిస్ ఇన్ వండర్‌ల్యాండ్ అనే మలయాళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత జీవాతో సంగీత రొమాన్స్ డిష్యుమ్ (2006) వచ్చింది. ఆమె మూడవ తమిళ చిత్రం, వల్లవన్‌లో, ఆమె ఒక చిన్న పాత్ర మాత్రమే చేసింది, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది.
ఆమె భరత్‌తో కలిసి కూడల్ నగర్‌లో కూడా నటించింది. సైకిల్ (2008) విజయం తర్వాత ఆమె మలయాళ సినిమాపై దృష్టి సారించింది. ఆమె మంజల్ వేయిల్ చిత్రానికి నేపథ్య గాయకురాలిగా రంగప్రవేశం చేసింది.[6] 2010లో, పి. వాసు దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ఆప్తరక్షకలో విష్ణువర్ధన్ సరసన ఆమె ఒక పాత్రలో కనిపించింది.
ఆమె తరుణ్ గోపి సూధాతం చిత్రంతో చాలా కాలవ విరామం తరవాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.[7][8] ఆమె ఆసియానెట్‌లోని కామెడీ స్టార్స్, లిటిల్ స్టార్స్‌తో సహా అనేక రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.
వ్యక్తిగత జీవితం
మార్చుసంధ్య 2015 డిసెంబరు 6న చెన్నైకి చెందిన ఐటీ ఉద్యోగి అర్జున్‌ని వివాహం చేసుకుంది. ఈ వేడుక గురువాయూర్ ఆలయంలో జరిగింది. ఈ దంపతులకు 2016 సెప్టెంబరు 27న ఒక కుమార్తె జన్మించింది.[9]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ |
---|---|---|---|---|
2004 | కాదల్ | ఐశ్వర్య రాజేంద్రన్ | తమిళం | ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – తమిళం
తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు ప్రత్యేక బహుమతి |
2005 | ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్ | ఆలిస్ | మలయాళం | |
2006 | డిష్యుమ్ | సింథ్యా జయచంద్రన్ | తమిళం | తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు ప్రత్యేక బహుమతి
ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – తమిళం - నామినేట్ చేయబడింది |
2006 | ప్రజాపతి | మాలు | మలయాళం | |
2006 | వల్లవన్ | సుచిత్ర | తమిళం | |
2006 | అన్నవరం | వరలక్ష్మి (వరం) | తెలుగు | ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – తెలుగు |
2007 | కూడల్ నగర్ | తమిళ్ సెల్వి | తమిళం | |
2007 | కన్నమూచి యేనాడ | దేవసేన ఆరుముగం | ||
2008 | సైకిల్ | మీన్కాశీ కౌష్టుభన్ | మలయాళం | |
2008 | తూండిల్ | అంజలి శ్రీరామ్ | తమిళం | |
2008 | వెల్లి తిరై | ఆమెనే | అతిధి పాత్ర | |
2008 | మహేష్, శరణ్య మాత్రం పలర్ | శరణ్య | ||
2009 | నంద | కావ్య | కన్నడ | |
2009 | మంజల్ వేయిల్ | గాయత్రి | తమిళం | |
2009 | ఒడిపోలామా | అంజలి | ||
2010 | ఆప్తరక్షకుడు | గౌరీ | కన్నడ | |
2010 | ఇరుంబుక్కోట్టై మురట్టు సింగం | తుంబి | తమిళం | |
2010 | హాసిని | హాసిని | తెలుగు | |
2010 | కాలేజ్ డేస్ | అను | మలయాళం | |
2010 | సహస్రం | సుప్రియ, శ్రీదేవి | ||
2011 | ట్రాఫిక్ | అదితి | ||
2011 | త్రీ కింగ్స్ | మంజు | ||
2011 | D - 17 | సంధ్య | ||
2012 | మాస్టర్స్ | నియా పొన్నూస్ | ||
2012 | వీండం కన్నూర్ | రాధిక | ||
2012 | పద్మశ్రీ భరత్ డాక్టర్ సరోజ్ కుమార్ | నటి | ప్రత్యేక ప్రదర్శన | |
2012 | హిట్‌లిస్ట్ | గౌరీ విక్రమ్ | ||
2013 | బెంకి బిరుగాలి | సంధ్య | కన్నడ | |
2013 | పైసా పైసా | కుముదం | మలయాళం | |
2013 | యా యా | కనక | తమిళం | |
2013 | ఫర్ సేల్ | డయానా | మలయాళం | |
2013 | సూదత్తం | తమిళం | ||
2013 | సెకండ్ ఇన్నింగ్స్ | మలయాళం | ||
2014 | మై డియర్ మమ్మీ | |||
2014 | లాంగ్ సైట్ | |||
2014 | పారిస్ పయ్యన్స్ | |||
2014 | పూజయుం కన్నడియుమ్ | |||
2015 | తునై ముధల్వార్ | రుక్మణి | తమిళం | |
2015 | కత్తుక్కుట్టి | ఐటం డాన్సర్ | ప్రత్యేక ప్రదర్శన | |
2015 | వెరి: తిమిరు 2 | |||
2016 | వెట్టా | షెరిన్ మెల్విన్ | మలయాళం | |
2016 | అవరుడే వీడు | వీణ | ||
2016 | రుత్రావతి | తమిళం |
మూలాలు
మార్చు- ↑ Arjun (25 December 2009). "Merry days are here". The Hindu. Chennai. Retrieved 21 December 2011.
- ↑ "'കുട്ടികാജോള്' പേശ്റേന് , Interview - Mathrubhumi Movies". Mathrubhumi (in మలయాళం). Archived from the original on 19 December 2013. Retrieved 2013-12-19.
- ↑ "DIRECTOR BALAJI SAKTHIVEL INTERVIEW - Behindwoods.com - Interview Director Balaji Sakthivel Balaji Sakthivel Directed Movies Samurai Kaadhal Kalloori Rajinikanth starrer Sivaji The Boss Directing 2004 film Kaadhal Balaji Sakthivel an assistant director S.Shankar Samurai for Vikram Kaadhal S Pictures banner Production house of Shankar Native is Dindugal Images". Behindwoods.com. Retrieved 2022-08-09.
- ↑ "Varalaxmi Sarathkumar opens up about her movies before Podaa Podi". 4 May 2020.
- ↑ Rangarajan, Malathi (31 March 2012). "Awaiting the monsoon". The Hindu.
- ↑ "Hot News". Cine South. 14 March 2007. Archived from the original on 17 March 2007.
- ↑ Raghavan, Nikhil (7 October 2013). "Shotcuts: Gaining experience". The Hindu. Chennai, India.
- ↑ George, Vijay (11 April 2013). "Turning a new leaf". The Hindu. Chennai, India.
- ↑ "Kadhal Sandhya gives birth to baby girl on birthday". The Times of India. 29 September 2016. Retrieved 2023-01-11.