కార్తికి గోన్సాల్వేస్

కార్తికి గోన్సాల్వేస్ (ఆంగ్లం: Kartiki Gonsalves; 1986 నవంబరు 2) భారతీయ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత. ఆమె ప్రకృతి, వన్యప్రాణి ఫోటోగ్రఫీలో నైపుణ్యం కలిగిన ఫోటోగ్రాఫర్ కూడా. ఆమెను ఇమేజరీ ఇండియా ఆర్టిజన్‌గా సోనీ గుర్తించింది.

కార్తికి గోన్సాల్వేస్
2022లో కార్తికి గోన్సాల్వేస్
జననం (1986-11-02) 1986 నవంబరు 2 (వయసు 38)
ఊటీ, నీలగిరి జిల్లా, తమిళనాడు, భారతదేశం
విద్యాసంస్థడాక్టరు జి ఆర్ దామోదరన్ కాలేజ్ ఆఫ్ సైన్స్, ఫోటోగ్రఫి ఎట్ లైట్ & లైఫ్ అకాడమీ, ఊటీ, ఇండియా
వృత్తిసినిమా దర్శకురాలు, నిర్మాత, ఫోటోగ్రాఫర్
ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్స్ (అసోసియేట్ ఫెలో)
గుర్తించదగిన సేవలు
ది ఎలిఫెంట్ విష్పరర్స్ (2022, దర్శకత్వం)
తల్లిదండ్రులుతిమోతి ఎ. గోన్సాల్వ్స్, ప్రిస్సిల్లా ట్యాప్లీ గోన్సాల్వేస్

ఆమె మొదటిసారిగా దర్శకత్వం వహించిన ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ చిత్రం 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అకాడమీ పురస్కారం గెలుచుకోవడం విశేషం.[1]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

కార్తికి గోన్సాల్వేస్ న్యూయార్క్‌లోని బింగ్‌హామ్టన్‌కు చెందిన తిమోతీ ఎ. గోన్సాల్వేస్, ప్రిస్సిల్లా ట్యాప్లీ గోన్సాల్వేస్‌ల చిన్న కుమార్తె. ఆమెకు డానికా గోన్సాల్వేస్ అనే ఒక అక్క ఉంది.[2] ఆమె తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లోని ఊటీలో పెరిగింది.[3][4]

ఆమె 2007లో కోయంబత్తూర్‌లోని డాక్టర్ జి ఆర్ దామోదరన్ కాలేజ్ ఆఫ్ సైన్స్‌ కళాశాల నుంచి డిగ్రీలో పట్టభద్రురాలైంది. ఊటీలోని లైట్ & లైఫ్ అకాడమీలో ఫోటోగ్రఫీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసింది.[3]

కెరీర్

మార్చు

కార్తికి గోన్సాల్వేస్ డాక్యుమెంటరీ చిత్రనిర్మాత, ఫోటోగ్రాఫర్. ఆమె యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానెల్‌ లకు కెమెరా ఆపరేటర్‌గా పనిచేసింది.[5] ఆమె గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించిన ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ చిత్రానికి దర్శకత్వం వహించింది.[6] ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.[7] 41 నిమిషాల ఈ డాక్యుమెంటరీని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్‌ (Theppakadu Elephant Camp)లో నిర్మించారు. ఇది ఆమె నివసించే ప్రదేశం నుండి 30 నిమిషాల దూరంలో ఉంది.

ఈ చిత్రం 2023 మార్చి 13న 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అకాడమీ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం.[8]

ఆమె 2020 నుండి ఇమేజరీ ఇండియా సోనీ ఆర్టిజన్ ప్రకృతి, సామాజిక డాక్యుమెంటరీలలో ప్రత్యేకత కలిగి ఉంది. ఆమె ప్రకృతి, వన్యప్రాణుల ఫోటోగ్రఫీపై బెంగళూరు, మైసూర్ నగరాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది.[9][10] వీటికోసం కోసం విస్తృతంగా ప్రయాణించే ఆమె ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేట్ ఫెలో.[11]

పురస్కారాలు

మార్చు
Award Year work Category Result Ref.
DOC NYC 2022 ది ఎలిఫెంట్ విష్పరర్స్ షార్ట్స్: చేంజ్ మేకర్స్ షార్ట్‌లిస్ట్ చేయబడింది [12]
95వ అకాడమీ అవార్డ్స్‌ 2023 ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (డాక్యుమెంటరీ) విజేత [8]

మూలాలు

మార్చు
  1. "ఆస్కార్‌ అవార్డు అంటే ఏంటో తెలియదు.. 'ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌' నటి బెల్లీ | elephants are like our children says belli of the elephant whisperers". web.archive.org. 2023-03-17. Archived from the original on 2023-03-17. Retrieved 2023-03-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Priscilla and Timothy Gonsalves". Retrieved 22 November 2022.
  3. 3.0 3.1 Kamala Thiagarajan (5 March 2023) 'The Elephant Whisperers' — An Oscar-nominated love story about people and pachyderms, Archived 2023-03-10 at the Wayback Machine NPR
  4. Chatterjee, Saibal (23 February 2023). "How Kartiki Gonsalves Made Oscar-Nominated Documentary The Elephant Whisperers: "Fell In Love With Raghu"". NDTV. Archived from the original on 2023-03-02. Retrieved 2023-03-10.
  5. Bharat, Divya (2023-03-02). "Most of my life has been spent in Ooty and jungles: Kartiki Gonsalves if it took 15 to 20 years to make The Elephant Whispers". Divya Bharat (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-03-10. Retrieved 2023-03-10.
  6. Hill, Libby (2023-02-27). "Oscar-Nominated Doc Shorts Directors Tell Big Stories (Video)". The Wrap (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-03-01. Retrieved 2023-03-01.
  7. Katie Reul, Documenting Change. Variety, [s. l.], v. 359, n. 5, p. 23, 2023. Disponível em: https://search.ebscohost.com/login.aspx?direct=true&db=f6h&AN=161981277&site=eds-live&scope=site. Acesso em: 10 mar. 2023.
  8. 8.0 8.1 "India wins its first Oscar of 2023 as Kartiki Gonsalves and Guneet Monga's 'The Elephant Whisperer' bags an award for Best Documentary Short Film at the 95th Academy Awards". The Times of India. 13 March 2023. ISSN 0971-8257. Archived from the original on 2023-03-13. Retrieved 2023-03-13.
  9. Nair, Gayatri; Gonsalves, Kartiki (9 April 2022). "Up Your Photography Game with iPhone 13". Aptronix. Retrieved 22 November 2022.
  10. Balram, Smita (11 April 2018). "Meet the wildlife photographer from Bengaluru who doubles as city tour guide". The Economic Times. Retrieved 22 November 2022.
  11. "Meet the new Associate Fellows of iLCP". International League of Conservation Photographers (in ఇంగ్లీష్). Archived from the original on 2023-03-10. Retrieved 2023-03-10.
  12. "Shortlist Shorts: Change Makers". Doc NYC. Archived from the original on 18 January 2023. Retrieved 18 January 2023.


0