ది ఎలిఫెంట్ విష్పరర్స్

ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ (ఆంగ్లం: The Elephant Whisperers) అనేది అనాథ ఏనుగులను సంరక్షించే ఓ దంపతుల వాస్తవ జీవన ఆధారంగా 2022లో రూపొందించిన భారతీయ లఘుచిత్రం. తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రానికి తన మొదటి ప్రయత్నంగా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించింది. సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం 2022 నవంబరు 9న అమెరికాలోని డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన డాక్ ఎన్‌వైసి(Doc NYC) లో ప్రదర్శించబడింది.[1][2] కాగా ఈ చిత్రాన్ని 2022 డిసెంబరు 8న నెట్‌ఫ్లిక్స్(Netflix) ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేసింది.

ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌
95వ అకాడమీ అవార్డ్స్ లో ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ టీమ్
దర్శకత్వంకార్తికి గోన్సాల్వేస్
కథప్రిసిల్లా గోన్సాల్వేస్
నిర్మాతడగ్లస్ బ్లష్
కార్తికి గోన్సాల్వేస్
గునీత్ మోంగా
అచిన్ జైన్
ఛాయాగ్రహణంకరణ్ తప్లియాల్
క్రిష్ మఖిజా
ఆనంద్ బన్సాల్
కార్తికి గోన్సాల్వేస్
కూర్పుసంచారి దాస్ మోలిక్
డగ్లస్ బ్లష్
సంగీతంస్వెన్ ఫాల్కనర్
నిర్మాణ
సంస్థ
సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ
2022 డిసెంబరు 8 (2022-12-08)
సినిమా నిడివి
39 నిమిషాలు
దేశాలుభారతదేశం
యునైటెడ్ స్టేట్స్
భాషతమిళం

ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రం 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ కేటగిరిలో అవార్డును గెలుచుకుంది, ఆ విభాగంలో అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకోవడం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఎంతో గర్వకారణం.[3]

ఈ లఘుచిత్ర కథకు మూలకారకులైన బొమ్మన్‌, బెల్లి దంపతులను తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా మావటీలకు వారి స్వస్థలాల్లోనే పక్కా ఇళ్ళను నిర్మించనున్నట్లు ప్రకటించడంతో పాటు కోయంబత్తూరు జిల్లా సాడివయల్‌ ప్రాంతంలో రూ.8 కోట్ల వ్యయంతో ఏనుగుల సంరక్షణా కేంద్రం ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆనమలై పులుల అభయారణ్యం వద్దనున్న ఏనుగుల సంరక్షణ కేంద్రంలో కూడా మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు.[4]

నేపథ్యం మార్చు

నీలగిరి జిల్లా ముదుమలై రిజర్వుడ్‌ ఫారె్‌స్టలోని రఘు, అమ్ము అనే రెండు ఏనుగు పిల్లలను బొమ్మన్‌, బెల్లీ దంపతులు పెంచిన తీరు ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ లఘుచిత్రానికి కథాంశం. గాయపడిన శిశువు ఆరోగ్యవంతమైన బాల్యదశకు ఎదగడానికి వారు చాలా కష్టపడతారు. వీరికి, ఏనుగు మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని ముదుమలై నేషనల్ పార్క్‌లో చిత్రీకరించిన ఈ డాక్యుమెంటరీ సహజ సౌందర్యాన్ని కూడా హైలైట్ చేస్తుంది. ఇది ప్రకృతికి అనుగుణంగా గిరిజన ప్రజల జీవితాన్ని అన్వేషిస్తుంది.[5]

ఈ చిత్రంలో జంతువులు, మానవుల మధ్య బంధం హృదయాన్ని హత్తుకునే కథ మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను కూడా ఆవిష్కరించారు.[6]

పురస్కారాలు మార్చు

అవార్డు వేడుక తేదీ వర్గం స్వీకర్త(లు) ఫలితం మూలం
అకాడమీ అవార్డులు 2023 మార్చి 12 ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కార్తికి గోన్సాల్వేస్, గునీత్ మోంగా విజేత [7]
DOC NYC 2022 నవంబరు 09 లఘు చిత్రాలు: మేకర్‌లను మార్చండి ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ షార్ట్‌లిస్ట్ చేయబడింది [8]
హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ 2022 నవంబరు 16 స్కోర్ - షార్ట్ ఫిల్మ్ (డాక్యుమెంటరీ) స్వెన్ ఫాల్కోనర్ నామినేట్ చేయబడింది [9]
IDA డాక్యుమెంటరీ అవార్డులు 2022 డిసెంబరు 10 ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ నామినేట్ చేయబడింది [10]

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. Carey, Matthew (18 October 2022). "DOC NYC Shortlist Announcement Brings Focus To Wide-Open Documentary Awards Race". Deadline. Penske Media Corporation. Archived from the original on 23 November 2022. Retrieved 22 November 2022.
  2. "The Elephant Whisperers". Doc NYC. 9–27 Nov 2022. Archived from the original on 23 November 2022. Retrieved 22 November 2022.{{cite web}}: CS1 maint: date format (link)
  3. "ఆస్కార్‌ అవార్డు అంటే ఏంటో తెలియదు.. 'ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌' నటి బెల్లీ | elephants are like our children says belli of the elephant whisperers". web.archive.org. 2023-03-17. Archived from the original on 2023-03-17. Retrieved 2023-03-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "'ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌' బృందానికి స్టాలిన్‌ సత్కారం | Stalin's tribute to 'The Elephant Whisperers'". web.archive.org. 2023-03-16. Archived from the original on 2023-03-16. Retrieved 2023-03-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Documentary The Elephant Whisperers set to release on December 8". The Tribune. 25 November 2022. Archived from the original on 23 November 2022. Retrieved 22 November 2022.
  6. Sur, Prateek (7 February 2023). "'The Elephant Whisperers' Showcases How Much India Has To Offer To The World Of Cinema". Outlook (in ఇంగ్లీష్). Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
  7. "95th Oscars: See the Full List of Winners Here". Academy of Motion Picture Arts and Sciences (in ఇంగ్లీష్). 12 March 2023. Archived from the original on 13 March 2023. Retrieved 13 March 2023.
  8. "Shortlist Shorts: Change Makers". Doc NYC. Archived from the original on 18 January 2023. Retrieved 18 January 2023.
  9. "2022 HMMA Nominations". Hollywood Music in Media Awards. Archived from the original on 11 January 2023. Retrieved 18 January 2023.
  10. "38th IDA Documentary Awards Shortlists for Best Features and Shorts". International Documentary Association. Archived from the original on 31 January 2023. Retrieved 18 January 2023.