కార్పల్ టన్నెల్ సిండ్రోమ్
కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (ఆంగ్లం: Carpal Tunnel Syndrome) ఒక రకమైన న్యూరోపతి. న్యూరోపతిలో ఎన్నో రకాలుంటాయి. మధుమేహంతో వచ్చే న్యూరోపతిలో నరాల మీద పొరదెబ్బతినడంతో తిమ్మిర్లు, మంటలు లాంటివి కాళ్ళలో చేతుల్లో వస్తుంటాయి ఈ న్యూరోపతి నరాల రక్తనాళాలు దెబ్బతినడంతోనూ, నరాల మీద ఒత్తిడి తేవడంతోను కూడా రావచ్చు.
Transverse section at the wrist. The median nerve is colored yellow. The carpal tunnel consists of the bones and flexor retinaculum. | |
m:en:ICD-10 | {{{m:en:ICD10}}} |
m:en:ICD-9 | {{{m:en:ICD9}}} |
m:en:OMIM | {{{m:en:OMIM}}} |
DiseasesDB | 2156 |
m:en:MedlinePlus | 000433 |
m:en:eMedicine | {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} |
MeSH | {{{m:en:MeshID}}} |
నరాల మీద ఒత్తిడి అంటే బయటి నుంచి కలగవచ్చు లేదా లోపల నుంచి కలగవచ్చు. ఎముకలు, కండరాల లాంటివి పైనుంచి ఒత్తిడి పెట్టడం వల్ల నరాల నొప్పి రావచ్చు. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ మణికట్టు దగ్గర నుంచి అరచేతిలోకి వెళ్ళే నరం మీద ఒత్తిడి వల్ల బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలుతో బాటు ఉంగరం వేలులో సగభాగం తిమ్మిర్లెక్కిపోతుంటుంది. కారణం ఈ మూడున్నర వేళ్ళకి వెళ్లే నరం మీద మణికట్టు ప్రాంతంలో లోపలివైపు లోపలికి వెళ్ళే నరం మీద ఒత్తిడి పడుతుంది.
మధుమేహం, థైరాయిడ్ లాంటి సమస్యలున్న వాళ్ళకి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మామూలు వాళ్ళ కన్నా వీరిలో మణికట్టు ద్వారా అరచేతిలోకి వెళ్ళే ఈ నరాల దారి సన్నగా ఉంటుంది. మణికట్టు దగ్గర కదలికలు ఎక్కువగా ఉండే ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా కండరాలు పెరిగి నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. కార్పల్ టన్నెల్‌లో నరాల మీద ఒత్తిడి తగ్గించడంతో ఈ ఇబ్బందిని తగ్గించవచ్చు.
నెర్వ్ కండక్షన్ స్టడీతో ఈ ఇబ్బందిని పసిగట్ట వచ్చు. అరచేతిలోని మూడున్న ర వేళ్ళలో తిమ్మిర్లు వచ్చినప్పుడు మనకు అనుమానం రావాలి. అనుమానం రాగానే అలశ్యం చెయ్యకుండా ఆర్థో సర్జన్‌కి చూపించడం మంచిది. ఆడవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపింస్తుంది. ఎత్తున్న వాళ్ళలో ఇది వచ్చే అవకాశాలు తక్కువ. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక కారణం ధూమపానం చేసేవాళ్ళలో కూడా ఇదొచ్చే రిస్క్ ఎక్కువ. వంశ పారంపర్యంగానూ రావచ్చు, అధిక బరువున్న వాళ్ళలో కూడా ఎక్కువగా రావచ్చు. గర్భనిరోధ మాత్రల్ని నోటి ద్వారా తీసుకునే వాళ్ళలోనూ, గర్భం ధరించినప్పుడు కలిగే హార్మోన్ మార్పుల వల్లా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఎక్కువ.
వ్యాధి లక్షణాలు
మార్చుచేతులు మొద్దుబారడం టెంగింగ్ సెన్సేషన్‌తో రాత్రిళ్ళు నిద్ర నుంచి మెళుకువ వస్తుంది. రాత్రిళ్ళు చేతులు మొద్దుబారడంతో బాటు చేతుల్లో నొప్పి ఉంటుం ది. చేతుల్లోనే కాదు నొప్పి మణికట్టు దగ్గర కూడా రావచ్చు. చేయి కండరాలు దెబ్బతినడం వల్ల చేతిల్లోను మణికట్టు దగ్గర నీరసంగా ఉండవచ్చు. నిద్రపోతున్నప్పుడు చేతులు పడిపోయినట్టుంటాయి. చేతుల్లో పట్టుతగ్గుతుంది. బొటన వ్రేలు, చూపుడు వేలు, మధ్యవేలుతో బాటు ఉంగరం వేలులో సగంవరకు స్పర్శ జ్ఞానం తగ్గుతుంది. గ్లాసులు, పెన్ను, ఫోర్క్ లాంటివి చేతుల్లోంచి జారిపోతుంటాయి.
పరీక్షలు
మార్చునెర్వ్ కండక్షన్ స్టడి (Nerve Conduction Study) పరీక్ష చేయించాలి. నరాన్ని ఎలక్ట్రిసిటి ద్వారా ఉత్తేజపరిచినప్పుడు నెమ్మదిగా వెళ్తుంది. రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, రక్తంలో గ్లూకోజ్ స్తాయిని చేప్పే పరీక్షలు ప్రోటీన్ ఎనాలసీస్ చేయించాలి. మణికట్టు చేతులకు ఎక్స్‌రేలు తీయించాల్సి రావచ్చు.
చికిత్స
మార్చుమొదటిదశలో గుర్తిస్తే మందులు ఫిజియోథెరపీతో సరిచేయవచ్చు. అప్పటికీ తగ్గకపోతే మణికట్టు దగ్గర చిన్న శస్త్ర చికిత్సతో కార్పల్ టన్నెల్ ద్వారా అరిచేతి లోకి వేళ్ళలోకి వెళ్ళే నరం మీద ఒత్తిడి తగ్గించి, ఈ ఇబ్బందిని సరిచేయవచ్చు,
బయటి లింకులు
మార్చు- Carpal Tunnel Syndrome[permanent dead link] Video
- Carpal Tunnel Release - Information for patients[permanent dead link]
- Carpal Tunnel Syndrome Fact Sheet (National Institute of Neurological Disorders and Stroke) Archived 2016-03-03 at the Wayback Machine
- (Find out more about Carpal Tunnel Syndrome and ways to help!)