కార్బొనైల్ సల్ఫైడ్

కార్బొనైల్ సల్ఫైడ్ ఒక రసాయనిక సమ్మేళన వాయు పదార్థం.కార్బొనైల్ సల్ఫైడ్ ఒక కర్బన సంయోగపదార్థం.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయనిక సంకేత పదం OCS.కార్బన్, సల్ఫర్,, ఆక్సిజన్ మూలకాల సంయోగం వలన ఈ సమ్మేళనపదార్థం ఏర్పడినది.

కార్బొనైల్ సల్ఫైడ్
Carbonyl sulfide
Space-filling 3D model of carbonyl sulfide
పేర్లు
IUPAC నామము
Carbon oxide sulfide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [463-58-1]
పబ్ కెమ్ 10039
యూరోపియన్ కమిషన్ సంఖ్య 207-340-0
కెగ్ C07331
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:16573
SMILES O=C=S
ధర్మములు
COS
మోలార్ ద్రవ్యరాశి 60.075 g/mol
స్వరూపం colorless gas
వాసన sulfide-like
సాంద్రత 2.51 g/L
ద్రవీభవన స్థానం −138.8 °C (−217.8 °F; 134.3 K)
బాష్పీభవన స్థానం −50.2 °C (−58.4 °F; 223.0 K)
0.376 g/100 mL (0 °C)
0.125 g/100 mL (25 °C)
ద్రావణీయత very soluble in KOH, CS2
soluble in alcohol, toluene
ద్విధృవ చలనం
0.65 D
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-141.8 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
231.5 J/mol K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 41.5 J/mol K
ప్రమాదాలు
విస్ఫోటక పరిమితులు 12-29%
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

కార్బొనైల్‌ సల్ఫైడ్ రంగు లేని, అయిష్టమైన వాసన కలిగిన, మండే స్వాభావమున్న వాయువు. కార్బొనైల్‌ సల్ఫైడ్ నిడుపైన అణుఅమరిక కలిగి, అణువులోని కార్బొనైల్ సమూహం, సల్ఫర్‌తో ద్విబంధాన్ని ఏర్పరచుకొని ఉండును. కార్బొనైల్‌ సల్ఫైడ్ సంయోగాపదార్థం అటు కార్బన్ డయాక్సైడ్, ఇటు కార్బన్ డైసల్ఫైడ్‌కు మధ్యస్థాయిలో ఉన్న సంయోగపదార్థంగా పేర్కొన వచ్చును.ఎందుకనగా ఆరెండు సమ్మేళనాలు కార్బొనైల్‌ సల్ఫైడ్‌తో తుల్య విద్యుత్కణ సంయోగం కలిగిఉన్నాయి.కార్బొనైల్ సల్ఫైడ్ తేమ/చెమ్మ ఉన్నప్పుడు, క్షారముతో చర్యవలన కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ గా వియోగం చెందును. అమినో ఆమ్లాల నుండి పెప్టైడ్‌లను ఏర్పరచుటకు కార్బొనైల్ సల్ఫైడ్ ఉత్ప్రేరకంగా పనిచేయును.

ఉనికి

మార్చు

వాతావరణంలో స్వాభావికంగా విస్తారంగా లభించు సమ్మేళన పదార్థాలలో విస్తారంగా ఉన్న సంయోగపదార్థం కార్బొనైల్ సల్ఫైడ్.ఇది వాతావరణంలో 0.5±0.05 ppb (పార్ట్స్ పర్ బిలియన్). ఇది ఇంత విస్తారంగా లభించుటకు కారణం, ఇది మహాసముద్ర జలాల నుండినుండిఅగ్ని పర్వతాల జ్వాలాముఖం నుండి, లోతైన సముద్రజలాల నుండి విడుదల అవుతుంది. భూవాతావరణ సల్ఫర్ చక్రీయం (sulfur cycle) లో కార్బొనైల్ సల్ఫైడ్ సంయోగపదార్థం ముఖ్యమైనది.

వాతావరణంలోని స్త్రాటోస్పెరిక్ సల్ఫేట్‌లేయర్ (ట్రోపోస్పేర్‌కు ఎగువన, మేసోస్పేర్‌కు దిగువన ఉన్న వాతావరణం) కు రవాణా చెయ్యబడిన కార్బొనైల్ సల్ఫైడ్ ఆక్సీకరణ వలన సల్ఫ్యూరిక్ ఆమ్లంగా పరివర్తన చెందును. ఇలా ఏర్పడిన ఆమ్లం కాంతిపరిక్షేపం చెందటం వలన శక్తి సమతుల్యత మీద ప్రభావం చూపించును. స్ట్రాటోస్పెరిక్ సల్ఫేట్‌లో అధిక భాగం కార్బొనైల్ సల్ఫైడ్ భాగస్వామ్యం కలిగిఉన్నది.అయితే స్ట్రాటోస్పెరిక్ సల్ఫేట్‌లో అగ్ని పర్వతాల నుండి వెలువడిన సల్ఫర్ డయాక్సైడ్ వాటా కుడా తక్కువేమీ కాదు. కార్బొనైల్ సల్ఫైడ్ యొక్క అధిక జీవన కాలంకారణంగా స్ట్రాటోస్పెరిక్ సల్ఫేట్లో అధికమొత్తంలో ఈ సమ్మేళన పదార్థం ఉంది.

వాతావరణంలో కార్బొనైల్ సల్ఫైడ్, భూసంబంధమైన ఉద్భిజాలు, వృక్ష సమూహాలు కిరణజన్యసంయోగక్రియ సమయంలోవ్కార్బన్ డయాక్సైడ్‌ను ఉపయోగించుకోవటం వలనను, మహాసముద్రాలలో ఉదజవిశ్లేషణము వలనను విడుదల అగును.

వాతావరణంలో ఉన్న కార్బొనైల్ సల్ఫైడ్‌లో స్వాభావిక ఉత్పత్తికన్న మానవులచే ఉత్పన్నం చెయ్యబడుచున్న వాయుశాతం అధిక మనవచ్చును.పరిశ్రమలలో కార్బన్ డైసల్ఫైడ్ ఉత్పత్తిలో కార్బొనైల్ సల్ఫైడ్‌నుమధ్యంతర స్థితి రసాయనకంగా ఉపయయోగించుట వలన కొంత కార్బొనైల్ సల్ఫైడ్ వాతావరణంలో చేరుతున్నది.అలాగే ఆటో మైబైల్ యంత్రాలనుండి, వాటి టైర్ల అరుగుదల వలన కూడా ఈ వాయువు వాతావరణంలోకి విడుదల అగుచున్నది. అలాగే విద్యుత్తు ఉత్పత్తి పరిశ్రమల్లోబొగ్గును, జీవద్రవ్యాన్ని దహించడం వలన కూడా కార్బొనైల్ సల్ఫైడ్ ఉత్పన్నమై వాతావరణంలో చేరుతున్నది. చేప లను ప్రాసెస్ చెయ్యడం వలన, వ్యర్థాలను, ప్లాస్టిక్‌ను కాల్చడం వలన, ముడినూనె నుండి మిక్కుటంగా పెట్రోలియం ఉత్పత్తులను తయారు చెయ్యడం వలనకుడా కార్బొనైల్ సల్ఫైడ్ వాయువు ఏర్పడుచున్నది. కృత్తిమ దారాలు (ఫైబర్), స్టార్చ్, రబ్బరులను తయారు చెయ్యడం వలన కూడా కార్బొనైల్ సల్ఫైడ్ గాఢత వాతావరణంలో పెరుగుతున్నది.

ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి వాతావరణంలోకి విడుదల చెయ్య బడుచున్న కార్బొనైల్ సల్ఫైడ్ పరిమాణం సుమారుగా 3 మిలియను టన్నులు. ఇందులో 1/3 వంతు మానవులరసాయన వినియోగం వలననే ఉత్పత్తి అగుచున్నది. మీగడ, క్యాబేజీ కుటుంబానికి చెందిన కురగాయలలో, వాటిని ఉపయోగించి తయారు చేసిన ఆహారంలో కార్బొనైల్ సల్ఫైడ్ ఉంటుంది. ధాన్యాలు, విత్తానాలలో సహాజంగా 0.05–0.1 మిగ్రా/కేజి −1.ఉంటుంది.

వినియోగం

మార్చు

థయోకార్బొమేట్ గుల్మనాశిని (herbicides) తయారుచెయ్యుటలో కార్బొనైల్ సల్ఫైడ్‌ను మధ్యంతరస్థాయి రసాయనపదార్థంగా ఉపయోగిస్తారు. ధూమకారి (fumigant) గా ఉపయోగించు మిథైల్ బ్రోమైడ్, ఫాస్ఫిన్ (phosphine) లకు శక్తివంతమైన ప్రత్నామ్యాయం కార్బొనైల్ సల్ఫైడ్. అయితే ధాన్యంపై ధూమకారిగా ఉపయోగించినపుడు, శేషంగా మిగిలే దీని ఘాటైన వాసన కారణంగా కొందరు ధాన్యం వాడకందారులు, దీనిని ధూమకారిగా (ధాన్యం, విత్తనాలు తదితరాలకు పురుగు పట్టకుండ నిలవుంచుటకై వాడు రసాయన పదార్థం) వాడటాన్ని వ్యతిరేకి స్తున్నారు .

సంశ్లేషణ

మార్చు

కార్బొనైల్ సల్ఫైడ్ గురించి1841 సంవత్సరం నాటికే వివరించడజరిగింది.కానిఅప్పటి వారు కార్బొనైల్ సల్ఫైడ్ అనునది కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్‌ల మిశ్రమంగా అపోహపడ్డారు.

1867 లో మొదటగా కార్ల్ వోన్‌థాన్ (Carl von Than) కార్బొనైల్ సల్ఫైడ్ సంయోగ పదార్థాన్నిసరిగ్గా వివరించాడు.ద్రవీభవించిన సల్ఫర్‌తో కార్బన్ మొనాక్సైడ్ తో, సుమారు 930 °C వద్ద చర్య వలన ఏర్పడుతుంది. పరిశోధనశాలలలో సల్ఫ్యూరిక్ ఆమ్లంతో పొటాషియం థయోసైనేట్ చర్య వలన ఉత్పత్తి చెయ్యుదురు.ఈ చర్యలో ఏర్పడిన వాయువులో కొన్ని మలినాలు ఉండును.అందుచే ఈ ఉత్పన్న వాయును శుద్ధి చెయ్య వలయును.

KSCN + 2 H2SO4 + H2O → KHSO4 + NH4HSO4 + COS

విష ప్రభావం

మార్చు

1994 నాటికి మనుషుల పై, జంతువులపై కార్బొనైల్ సల్ఫైడ్ వాయువు యొక్క విషప్రభావం గురించి పరిమితమైన సమాచారం మాత్రమే లభ్యం. ఎక్కువ గాఢత (>1000ppm) కలిగిన వాయు ప్రభావానికి గురైనపుడు హటాత్తుగా కుప్పకూలడం, అపస్మారముచెందటం, శ్వాస సంబంధమైన పక్షవాతంవలన మరణించడం జరుగును.

ఎలుకల మీద ఈ వాయువును ప్రయోగించినపుడు,90 నిమిషాలపాటు,1400 ppm గాఢతతో, లేదా 9నిమిషాలు 3000 ppm కార్బొనైల్ సల్ఫైడ్ వాయువుప్రభావానికి గురైన వాటిలో50%ఎలుకలు మరణించాయి. పరిమితమైన అధ్యయనంలో తక్కువ గాఢత (~50 ppmతో 12 వారాలు) వద్ద కార్బొనైల్ సల్ఫైడ్ ప్రభావానికి గురి కావించినపుడు, ఊపిరితిత్తులు,, గుండె మీద ఎటువంటి చెడు ప్రభావం చూపలేదు.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు