కాళేశ్వరరావు మార్కెటు

(కాళేశ్వరరావు మార్కెట్ నుండి దారిమార్పు చెందింది)

కాళేశ్వరరావు మార్కెటు, విజయవాడలో ప్రసిద్ధి చెందిన ఒక మార్కెటు.ఇది విజయవాడ నగరపాలక సంస్థ అజమాయిషీలో నిర్వహించబడుతుంది.ఈ మార్కెటునకు అయ్యదేవర కాళేశ్వరరావు పేరు మీదుగా ఈ మార్కెటును రూపొందించారు.ఇది విజయవాడ 1 టౌను, తారాపేటలో ఉంది.మార్కెటు పరిధిలో 232 దుకాణాలు ఉన్నాయి.ప్లాటుఫారం మీద ఇతర వ్యాపారాలు చేసుకునేవారు 320 మంది జీవనం సాగిస్తున్నారు.వీరు గాక ఇక్కడ జరిగే వ్యాపారం మీద ముఠా కూలీలు, వాహనాల డ్రైవర్లు, రిక్షా కార్మికులు ఆధారపడియున్నారు.[1] ఈ మార్కెటుకు ఒక్క కృష్ణా జిల్లా నుండేగాక పొరుగు జిల్లాల నుండి ప్రతిరోజు ఎంతోమంది కస్టమర్లు వస్తుంటారు.మార్కెట్టు నిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు వినియోగదారులతో కిటకిటలాడుతుంటుంది.ఈ మార్కెటులో నిత్యజీవితంలో అవసరమైన అన్ని రకాల సామానులు ప్రజలకు లభిస్తాయి.ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలకు ఎగుమతి జరుగుతుంది.ఈ మార్కెటుకు ఇతరరాష్ట్రాలనుండి దిగుమతి జరుగుతుంది.,

విజయవాడ రైల్వేస్టేషను

చరిత్ర

మార్చు

1921 మార్చి 31న, ఏప్రిల్ 1న విజయవాడలో భారత జాతీయ కాంగ్రెసు మహాసభలు జరిగాయి.ఆసభలకు గాంధీజీతోపాటు దేశనాయకలు అందరూ వచ్చారు. ఆరోజుల్లో విద్యుత్ సౌకర్యం అంతంత మాత్రంగా ఉండేది.అయ్యదేవర కాళేశ్వరరావు పిలుపు మేరకు పట్టణంలోని ప్రజలు ప్రతివారు లాంతర్లు వెలిగించి వారి ఇండ్ల ముందు పెట్టారు.కాళేశ్వరరావు మహాత్మాగాంధీ పిలుపునందుకొని, న్యాయవాద వృత్తిని వదలుకొని, విజయవాడ కేంద్రంగా స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. కాళేశ్వరావు పిలుపునందుకుని ప్రజలు లాంతర్లు వెలిగించిన సంగతి గాంధీ దృష్టికి వెళ్లింది.ఆతరువాత విజయవాడ మూడుసార్లు మహాత్ముడు వచ్చాడు.కాళేశ్వరావును గాంధీ ప్రతిసారి వెంటపెట్టుకుని తిరిగాడు.జాతీయోద్యమంలో ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, రాజగోపాలాచారి, మరికొంత మంది ముఖ్యులు ఇతని సమకాలీకులు.విజయవాడ తరుపున నాటి  ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్ర శాసనసభలో బెజవాడ తరఫున అయ్యదేవర ప్రాతినిథ్యం వహించారు. అసెంబ్లీలో తెలుగువారి తరఫున చీఫ్‌ విప్‌గా గట్టిగా గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్‌ తొలి శాసనసభ స్పీకర్‌గా అయ్యదేవర సేవలు అందించారు. 1982 ఫిబ్రవరి 26 న విజయవాడ నుంచి పోటీ చేసి..ఫలితాలు వెలువడకముందే తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశాడు.[2] అతను సేవలకు గుర్తుగా ఈ మార్కెటుకు అతని పేరు పెట్టబడింది.[3]

దుకాణ సముదాయం

మార్చు

కాళేశ్వరావు మార్కెటుఆవరణలోమూడు ఇతర దుకాణాల ఉన్నాయి.[4]

  • బెజవాడ బులియన్ అండ్ జ్యువెలరీ మర్చంట్స్ అసోసియేషన్
  • గోపాలకృష్ణ ప్లాస్టిక్స్,
  • రేణుజా లేస్ హౌస్

సౌకర్యాలు, సమస్యలు

మార్చు

మార్కెట్టుకు దగ్గరలో ఇండియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు, [5] పలు బ్యాంకులకు చెందిన ఎటిఎమ్‌లు ఉన్నాయి.[6]

మూలాలు

మార్చు
  1. "నేడు కాళేశ్వరరావు మార్కెట్‌ తెరిచేందుకు సన్నాహాలు..!". www.eenadu.net. Archived from the original on 2020-05-23. Retrieved 2020-08-06.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-01-19. Retrieved 2020-08-06.
  3. "మలితరం గొప్ప నేత 'అయ్యదేవర' ( నేడు వర్ధంతి) - Telangana". Dailyhunt. Retrieved 2020-08-06.
  4. "3 Shopping Malls in Kaleswara Rao Market, Tarapet, Vijayawada - 2020". Housing. Retrieved 2020-08-06.
  5. "The Andhra Pradesh State Coop Bank Kaleswara Rao Market IFSC Code Vijayawada (APBL0000006) & Branch Contact Details". Goodreturn. Retrieved 2020-08-06.
  6. "Sbi Bank ATM of Vijayawada at Near Kaleswara Rao Market, One Town, Vijayawada, 520001". www.detailsofindia.com. Retrieved 2020-08-06.[permanent dead link]

వెలుపలి లంకెలు

మార్చు