కాసు మహేష్ రెడ్డి
కాసు మహేశ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుండి .....
కాసు మహేశ్ రెడ్డి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 - ప్రస్తుతం | |||
ముందు | యరపతినేని శ్రీనివాస రావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | గురజాల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 9 సెప్టెంబర్ 1975 నరసరావుపేట, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | కాసు వెంకట కృష్ణారెడ్డి, సంధ్యా | ||
జీవిత భాగస్వామి | షామిలీ | ||
బంధువులు | కాసు బ్రహ్మానందరెడ్డి (తాత) | ||
సంతానం | హాసిని | ||
నివాసం | నరసరావుపేట | ||
పూర్వ విద్యార్థి | నాగార్జున యూనివర్సిటీ |
ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
జననం, విద్యాభాస్యం
మార్చుకాసు మహేశ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, నరసరావుపేటలో 9 సెప్టెంబర్ 1975లో కాసు వెంకట కృష్ణారెడ్డి, సంధ్య దంపతులకు జన్మించాడు. ఆయన నాగార్జున యూనివర్సిటీ ఎ.సి.లా కాలేజ్ గుంటూరు నుండి 2001లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.[2]
రాజకీయ జీవితం
మార్చుకాసు మహేశ్ రెడ్డి రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. అతడి తాత కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి రాష్ట్ర మంత్రిగా పని చేశారు.[3] ఆయన వారి అడుగుజాడల్లో ప్రజా సేవను ఎంచుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస రావు పై 28613 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (19 March 2019). "గుంటూరు జిల్లా.. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా." Archived from the original on 2021-09-28. Retrieved 2 December 2021.
- ↑ Sakshi (31 May 2019). "వారసులొచ్చారు." Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.