కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో కియా ఉపవిభాగం. దీనిని 2017 మే 19 న ప్రారంభించారు.[2] ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనంతపురంలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీని విస్తీర్ణం సుమారు 536 ఎకరాలు. 2019 జనవరిలో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించిన ఈ సంస్థ 2019 జూలై 31 నాటికి మొదటగా కియా సెల్టోస్ మోడల్ ను ఆవిష్కరించింది. సుమారు 2 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ ప్లాంటు ఏడాదికి సుమారు 3 లక్షల వాహనాలు ఉత్పత్తి చేయగలదు.[3]

కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
రకంఅనుబంధ సంస్థ
పరిశ్రమమోటారు వాహనాలు
స్థాపన19 మే 2017; 7 సంవత్సరాల క్రితం (2017-05-19)
ప్రధాన కార్యాలయంఅనంతపురం, ఆంధ్రప్రదేశ్
కీలక వ్యక్తులు
Tae Jin Park (CEO)
ఉత్పత్తులుమోటారు వాహనాలు
Production output
177,982 (2020)[1]
మాతృ సంస్థకియా
వెబ్‌సైట్http://www.kia.com/in/

చరిత్ర

మార్చు

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు హయాంలో ఈ సంస్థకు ప్రాథమిక సౌకర్యాలు, ప్రోత్సాహకాలు ఇచ్చాడు. ఈ సంస్థ తర్వాత వాహన విడిభాగాల సంస్థలను కూడా రాష్ట్రానికి ఆహ్వానించడానికి చంద్రబాబు ప్రణాళిక. 2019 లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సిపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు 75% ఉద్యోగాలు ప్రాంతీయులకు కేటాయించాలని పాలసీ తీసుకువచ్చింది. ఈ నిర్ణయంతో కియా కొంత ఇబ్బంది పడింది. తమ పరిశ్రమకు కావలసిన నిపుణులను అంత పెద్ద స్థాయిలో నియమించుకోవడం కష్టమని భావించింది. ఒక దశలో ఈ కార్మాగారం తమిళనాడుకు తరలిపోతుందనే వార్తలు వచ్చాయి.[4] కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఈ వార్తలు నిజం కాదని చెప్పాడు. తమ ప్రభుత్వం కియా సంస్థతో కలిసి పనిచేస్తుందని ప్రకటించాడు.[5]

ఉత్పత్తులు

మార్చు

భారతదేశంలో మార్కెట్ కోసమే వివిధ రకాల మోడళ్ళను కియా ప్రవేశ పెట్టింది. కియా మోటార్స్ ప్రారంభించిన రెండు సంవత్సరాలలో లాభాలతో నడుస్తున్నది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి 1111 కోట్ల పన్నులతదుపరి లాభంతో కంపెనీ ప్రపంచ మొత్తం ఆదాయంలో 5% భారత విభాగం ద్వారా పొందుతుంది. 2022 లో 300000 వాహానాలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యం, మొత్తం కంపెనీ ప్రపంచ ఉత్పత్తిలో 10 శాతానికి చేరువవుతుంది.[6]

ప్రస్తుత మోడళ్ళు

మార్చు
మోడల్ భారతదేశంలో ప్రారంభం ప్రస్తుత మోడల్
పరిచయం (మోడల్ కోడ్) అప్‌డేట్ (ఫేస్‌లిఫ్ట్)
SUV/crossover
  కియా సోనెట్ 2020 2020 (QY)
  కియా సెల్టోస్ 2019 2019 (SP2i)
MPV
  కియా కారెన్స్ 2022 2022 (KY)
  కియా కార్నివాల్ 2020 2020 (YP)


మూలాలు

మార్చు
  1. "Sales Results". pr.kia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-02.[permanent dead link]
  2. "KIA India Pvt Ltd (bloomberg profile)". www.bloomberg.com. Retrieved 2020-10-02.
  3. "Kia Motors | India Plant". www.kia.com (in Indian English). Retrieved 2020-10-02.
  4. Sheth, Hemai. "Kia Motors ponders shifting $1.1-billion plant from Andhra Pradesh to Tamil Nadu, reports say". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-18.
  5. P, Ashish. "Why Kia is important for Andhra Pradesh". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-03-18.
  6. "Kia Motors' Indian Plant To Manufacture 10 Per Cent Of Its Total Global Production In 2022". Swarajya. 2022-02-22. Retrieved 2022-03-17.