కిస్మత్‌ 2024లో తెలుగులో విడుదలైన కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా.[1] కామ్రేడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వం వహించాడు. నరేష్‌ ఆగస్త్య, అభినవ్‌ గోమఠం, విశ్వదేవ్‌ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 జనవరి 27న విడుదల చేసి, సినిమా 2024 ఫిబ్రవరి 2న సినిమా విడుదలైంది.[2]

కిస్మత్
దర్శకత్వంశ్రీనాథ్‌ బాదినేని
రచనశ్రీనాథ్‌ బాదినేని
నిర్మాతరాజు
తారాగణం
  • నరేష్‌ ఆగస్త్య
  • అభినవ్‌ గోమఠం
  • విశ్వదేవ్‌
ఛాయాగ్రహణంవేదరామన్‌ శంకరన్‌
కూర్పువిప్లవ్ నైషధం
సంగీతంమార్క్‌ కె రాబిన్‌
నిర్మాణ
సంస్థలు
కామ్రేడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్‌
విడుదల తేదీs
2024 ఫిబ్రవరి 2 (2024-02-02)(థియేటర్)
2024 ఏప్రిల్ 2 (2024-04-02)( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా 02 ఏప్రిల్ నుండి ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]

కథ మార్చు

కార్తీక్ (నరేష్ అగస్త్య), అభి (అభినవ్ గోమఠం), కిరణ్ (విశ్వదేవ్ రాచకొండ) ముగ్గురు ఫ్రెండ్స్ బిటెక్ పూర్తి చేసి ఉద్యోగ రాక ఊళ్ళో ఖాళీగా ఉంటారు. మంచిర్యాలలో ఓ గొడవలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఇంట్లోవారు తిట్టడంతో మళ్ళీ హైదరాబాద్ కి వెళ్లి ఒక రూమ్ తీసుకొని ఉద్యోగ వేటలో ఉండగా కార్తీక్ ఓ ఇంటర్వ్యూకి వెళ్లగా అక్కడ తాన్యా(రియా సుమన్)తో పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు రాజకీయ నాయకుడు జనార్దన్అ జయ్ ఘోష్) దగ్గర పనిచేసే సూరి (టెంపర్ వంశీ) పరిచయం అవ్వడంతో అతనితో పాటు ర్యాలీకి వెళ్తే డబ్బులు వస్తాయని తెలిసి కొన్నాళ్ళు ర్యాలీల్లో పాల్గొంటారు.

ఓ వ్యక్తి వచ్చి బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం వచ్చేలా చేస్తా అని, దానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది అనడంతో డబ్బు కోసం ఆ ముగ్గురు వ్యక్తులు కలిసి డబ్బు కాజేసే ప్రయత్నంలో వాళ్లకి 20 కోట్లు దొరుకుతాయి. అదే సమయంలో అజయ్ ఘోష్ 20 కోట్లు పోవడం జరుగుతుంది. జనార్దన్ ఇరవై కోట్లు ఎలా పోయాయి? సూరి, పోలీసాఫీసర్ వివేక్ (అవసరాల శ్రీనివాస్) ఆ డబ్బుల కోసం వెతకడం ? ఆ డబ్బులు చివరికి ఎవరి దగ్గరకు వెళ్లాయి? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: కామ్రేడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్‌
  • నిర్మాత:రాజు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనాథ్‌ బాదినేని
  • సంగీతం:మార్క్‌ కె రాబిన్‌
  • సినిమాటోగ్రఫీ:వేదరామన్‌ శంకరన్‌
  • ఎడిటర్: విప్లవ్ నైషధం

మూలాలు మార్చు

  1. Namaste Telangana (29 December 2023). "ముగ్గురు మిత్రుల 'కిస్మత్‌'". Archived from the original on 2 February 2024. Retrieved 2 February 2024.
  2. Eenadu (31 January 2024). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  3. V6 Velugu (2 April 2024). "సైలెంట్గా OTTకి వచ్చిన కిస్మత్.. ఈ కామెడీ థిల్లర్ ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 2 April 2024. Retrieved 2 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Chitrajyothy (4 April 2024). "రెండు ఓటీటీల్లో.. ఇండియా వైడ్‌గా దూసుకుపోతున్న తెలుగు కామెడీ థ్రిల్లర్! | Kismat Movie Getting Tremendous Response From Ott ktr". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
  5. ABP Telugu, Satya (2 February 2024). "కిస్మత్ రివ్యూ: అదృష్టం అన్నిసార్లూ కలిసి రాదయ్యా - క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కిస్మత్&oldid=4178642" నుండి వెలికితీశారు