కీచక 2015లో తెలుగులో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ సినిమా. శ్రీ గౌతమి టాకీస్ పతాకంపై కిషోర్ పర్వత రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆడియో 2015, సెప్టెంబరు 24న విడుదల కాగా, [1] సినిమా 2015, అక్టోబరు 30న విడుదలైంది.[2] నాగపూర్లో జరిగిన రేపిస్ట్ అక్కు యాదవ్ నిజ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.[3]

కథసవరించు

గాంధీ నగర్ బస్తీ వాసులు కోటి (జ్వాలా కోటి) అనే మానవ మృగం చేతుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. కోటి ఓ కామ పిశాచి, చిన్నా పెద్దా తేడా ఉండదు కనపడిన ప్రతి మహిళని అతి దారుణంగా రేప్ చేస్తుంటాడు. ఎవడన్నా ఎదురు తిరిగితే వారిని అతి కిరాతకంగా చంపేస్తుంటాడు. కోటికి రాజకీయంగా సపోర్ట్ ఉండడంతో 20 ఏళ్ళ నుంచి ఎవరూ ఏమీ చేయలేక కోటి చేతుల్లో బలైపోతుంటారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సుజాత (యామిని భాస్కర్) తన వేషం మార్చుకొని కోటిని చంపడానికి అదే ఏరియాకి వస్తుంది.

అసలు ఎక్కడో హైటెక్ సిటీలో జాబ్ చేసుకునే సుజాతకి గాంధీ నగర్ బస్తీ కోటికి ఉన్న సంబంధం ఏమిటి.? అసలెందుకు సుజాత కోటిని చంపాలనుకుంది.? 20 ఏళ్ళుగా సాగుతున్న కోటి అరాచాకాల్ని ఆపడానికి సుజాత ఏం చేసింది.? ఈ పోరాటంలో సుజాత ఏం కోల్పోయింది.? ఫైనల్ గా కోటిపై సుజాత గెలిచిందా లేదా.? అన్నదే మిగతా సినిమా కథ. [4][5]

 
యామిని భాస్కర్

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • కెమెరా: కమలాకర్
  • మాటలు: రాంప్రసాద్ యాదవ్
  • నిర్మాత: కిషోర్ పర్వతరెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.వి.బి.చౌదరి
  • సంగీతం: జోశ్యభట్ల

మూలాలుసవరించు

  1. IndiaGlitz (24 September 2015). "Keechaka audio released - Malayalam News". IndiaGlitz.com. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. Girl, Gossip (30 October 2015). "Keechaka movie review, rating". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 18 May 2021.
  3. Deccan Chronicle (26 September 2015). "Film on rapist Akku Yadav". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  4. Sakshi (25 October 2015). "వాస్తవానికి దగ్గరగా..." Sakshi. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  5. Sakshi (30 October 2015). "కీచక సంహారం కోసం..." Sakshi. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=కీచక&oldid=3290000" నుండి వెలికితీశారు