రోజాభారతి తెలుగు సినిమా, టెలివిజన్ నటి.[1] మొగలిరేకులు, పక్కింటి అమ్మాయి వంటి సీరియళ్ళలో నటించిన రోజాభారతి, బటర్‌ ఫ్లైస్‌ సినిమాలో కథానాయికగా నటించింది.[2]

రోజాభారతి
జననం
కొమరవోలు రోజా

(1989-10-06) 1989 అక్టోబరు 6 (వయస్సు 32)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
బంధువులుఖిజర్ యాఫయ్ (భర్త)
నిఖిల్ & ఆహిల్ (కుమారులు)

జననంసవరించు

రోజాభారతి 1989, అక్టోబర్ 6న రాజమండ్రిలో జన్మించింది. హైదరాబాదులో స్థిరపడింది.

టెలివిజన్సవరించు

చిన్నపట్టినుండి నటన అంటే ఆసక్తివున్న రోజా పాఠశాల, కళాశాల స్థాయిలో స్టేజి ప్రదర్శనలు ఇచ్చింది.[3] టెలివిజన్ రంగంలో నటిగా గుర్తింపు పొందిన రోజాభారతి సీరియళ్ళలో నటిస్తూనే జెమిని టీవిలో వివాహబంధం, బుల్లితెర మహారాణి, జీ తెలుగులో బిందాస్, ఈటీవిలో సఖి వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేసింది.[4]

నటించిన సీరియళ్ళుసవరించు

 1. మొగలిరేకులు (జెమినీ టీవీ)
 2. తీరం (జెమినీ టీవీ)
 3. గోరింటాకు (జెమినీ టీవీ)
 4. మావిచిగురు (జెమినీ టీవీ)
 5. కొత్త బంగారం (జెమినీ టీవీ)
 6. కలియుగ రామాయణం (జెమినీ టీవీ)
 7. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (జీ తెలుగు)
 8. పక్కింటి అమ్మాయి (జీతెలుగు)
 9. మిస్సమ్మ (మాటీవి)
 10. సుందరాకాండ (మాటీవి)
 11. అంతఃపురం (ఈటీవి)
 12. అల్లరే అల్లరి (ఈటీవి)

సినిమారంగంసవరించు

2009లో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో నటించింది.

అవార్డులు - పురస్కారాలుసవరించు

 1. ఉత్తమ విలన్ - బుల్లితెర అవార్డు 2017 (03.12.2017)

మూలాలుసవరించు

 1. ఆంధ్రభూమి, హైదరాబాదు (26 December 2017). "'బటర్‌ ఫ్లయిస్‌' ఫస్ట్‌లుక్‌". Retrieved 6 October 2018.
 2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (25 December 2017). "'బటర్ ఫ్లైస్' అంతా ఆడవాళ్లే." andhrajyothy.com. Archived from the original on 13 August 2020. Retrieved 13 August 2020.
 3. Nettv4u, Telugu TV Actress. "Telugu Tv Actress Roja Komaravolu". www.nettv4u. Archived from the original on 5 October 2018. Retrieved 13 August 2020.
 4. నమస్తే తెలంగాణ, జిందగీ (16 April 2021). "జీవితం చాలా ఇచ్చింది!". Archived from the original on 17 April 2021. Retrieved 17 April 2021.