కీర్తిపూర్, నేపాల్‌ లోని ఒక పురాతన నగరం. నెవార్లు కీర్తిపూర్ స్థానికులు. కీర్తిపూర్ నగరం కిరాత్ రాజు యలంబర్ నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఇది ఖాట్మండు లోయలో ఉంది, ఖాట్మండు నగరానికి నైరుతిలో 5 కి.మీ.దూరంలో ఉంది.[1] లోయ లోని ఐదు పురపాలక సంఘాలలో ఇది ఒకటి. మిగిలినవి ఖాట్మండు, లలిత్‌పూర్, భక్తపూర్, మధ్యపూర్ తిమి. సందర్శించడానికి అత్యంత ప్రసిద్ధి చెందిన హిందూ ఆలయాల ప్రదేశాలలో కీర్తిపూర్ ఒకటి. దేవాలయాలను సందర్శించేందుకోసమే కాకుండా సహజ వాతావరణం ఆస్వాదించటనికి చాలామంది ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.[2] ఈ నగరం, 2008లో యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. [3] త్రిభువన్ విశ్వవిద్యాలయం ఉన్నందున, కీర్తిపూర్ పట్టణం వెలుపల ఉన్న విద్యార్థులు, అధ్యాపకులకు ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి ఒక ప్రసిద్ధ ప్రాంతంగా అభివృద్ధి చెందింది.

కీర్తిపూర్
कीर्तिपुर
హిమాలయాల నేపథ్యంలో కీర్తిపూర్
హిమాలయాల నేపథ్యంలో కీర్తిపూర్
Motto: 
झीगु किपू समृद्ध किपू
కీర్తిపూర్ is located in Bagmati Province
కీర్తిపూర్
కీర్తిపూర్
పటంలో నేపాల్ స్థానం
కీర్తిపూర్ is located in Nepal
కీర్తిపూర్
కీర్తిపూర్
కీర్తిపూర్ (Nepal)
Coordinates: 27°40′41″N 85°16′37″E / 27.67806°N 85.27694°E / 27.67806; 85.27694
దేశం Nepal
ప్రాంతంభాగమతి
జిల్లాఖాట్మండు
Government
 • మేయర్రమేష్ మహర్జన్, (ఎన్.సి.పి.)
 • డిప్యూటీ మేయర్సరస్వతీ ఖడ్కా, (ఎన్.సి.పి.)
జనాభా
 (2011)
 • Total67,171
Time zoneUTC+5:45 (ఎన్.ఎస్.టి)
పిన్‌కోడ్
44618
ప్రాంతపు కోడ్01
Websitewww.kirtipurmun.gov.np

వ్యుత్పత్తి శాస్త్రం

మార్చు

కీర్తిపూర్ అనే పేరు సంస్కృత పదాల కీర్తి (కీర్తి), పూర్ (నగరం) అలాగే యలంబర్ రాజవంశానికి చెందిన కిరాత్ కింగ్‌డమ్ నుండి వచ్చింది.కీర్తిపూర్ నగరానికి కుదింపులో "కిపూ" అని వ్యవహరిస్తారు.

చరిత్ర

మార్చు

గ్రామ చరిత్ర 12వ శతాబ్దానికి తిరిగి వెళుతుంది, ఇది పటాన్ అవుట్‌పోస్ట్‌గా ఉంది, కానీ తరువాత ప్రత్యేక రాజ్యంగా మారింది, ఇది 2006 సామూహిక తిరుగుబాటులో రాజు అధికారాలను పడగొట్టిన ప్రజల స్ఫూర్తిదాయకమైన శాంతియుత ప్రదర్శన ప్రదేశం. ఆధునిక స్థాపకుడు నగరాన్ని అవమానకరంగా స్వాధీనం చేసుకున్న షా రాజవంశానికి వ్యతిరేకంగా ఉన్న చేదు చరిత్ర కారణంగా ఇది రాచరికానికి వ్యతిరేక నగరంగా పరిగణించబడుతుంది, తరువాతి పాలకులు పరిపాలన, అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

కీర్తిపూర్ చరిత్ర సా.శ. 1099 నాటిది,18వ శతాబ్దంలో గోర్ఖాలీ రాజు పృథ్వీ నారాయణ్ షా ఖాట్మండు లోయపై దాడి చేసిన సమయంలో ఇది లలిత్‌పూర్ భూభాగంలో ఒక భాగంగా ఉంది. [4] సా.శ. 1767లో కీర్తిపూర్ యుద్ధం తర్వాత పృథ్వీ నారాయణ్ షా ద్వారా కీర్తిపూర్‌ని గూర్ఖాలీ రాజ్యంలో విలీనం చేశాడు.అతను తన మూడవ ప్రయత్నంలో ఉపాయంతో పట్టణంలోకి ప్రవేశించిన తరువాత దానిని జయించాడు.అతను ఇలా చేసిన తర్వాత, కీర్తిపూర్ నగరాన్ని ద్వేషించడానికి, అతను నగరంలో దీని తరువాత అతను నగరంలో 13 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల ముక్కులను కత్తిరించాడు. [5] [6][7]

జనాభా

మార్చు

నిజానికి నెవార్ ప్రజలు స్థాపించిన కీర్తిపూర్ ఇప్పటికీ నెవార్ సంస్కృతికి కేంద్రంగా ఉంది.దీనిని 67,171 జనాభాతో కీర్తిపూర్ పురపాలక సంఘంగా ఏర్పాటు చేయడానికి చుట్టుపక్కల గ్రామాలతో విలీనం చేయబడింది.

ఆసక్తికరమైన ప్రదేశాలు

మార్చు

కీర్తిపూర్ లో అనేక దేవాలయాలు,గుంబాలు (బౌద్ధ మఠాలు), చర్చిలు ఉన్నాయి. కీర్తిపూర్ దక్షిణ భాగం చుట్టూ చంపాదేవి కొండ ఉంది.నేపాలీ నూతన సంవత్సరం (బిషక్ 1న) నాడు ఖాట్మండు లోయ చుట్టుపక్కల ప్రజలు కొండపైకి వెళ్తారు. [8]

గ్రామ సందర్శనతో పాటు బాగ్ భైరవ్, క్లాంచు విహార్ మొదలైన కొన్ని ఆసక్తికరమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. కీర్తిపూర్‌లో దక్షిణకాళి దేవి ఆలయం ఉంది, ఇది నేపాల్ ప్రజలకు ముఖ్యమైన తీర్థయాత్ర. కీర్తిపూర్ సందర్శనను చోవర్ పంగా సందర్శనతో కలపవచ్చు.

బాగ్ భైరబ్ ఆలయం

మార్చు
 
బాగ్ భైరబ్ దేవాలయం
 
ఉమా మహేశ్వర దేవాలయం

కీర్తిపూర్‌ లో ఉత్తరాన మొఘల్ శైలిలో నిర్మించిన తెల్లటి బాగ్ భైరబ్ ఆలయం ఉంది.[9] సమీపంలో ఆకుపచ్చని చెరువు ఉంది. ఈ చెరువుకు "దే పుఖు" అని పేరు పెట్టారు.ఈ పేరు సాహిత్యపరమైన అర్థంలో దేశపు చెరువుగా అనువదిస్తుంది.కీర్తిపూర్‌ లో విస్తారంగా నెవార్ ప్రజలు నివశించిన స్థిరనివాసాల మధ్యలో కీర్తిపూర్ చిహ్నంగా ఉన్న బాగ్ భైరవ్ ఆలయానికి దక్షిణంగా ఉన్న ఈ చెరువు లోని నిశ్చలమైన నీరు, చుట్టూ ఉన్న చూపరులకు, సందర్శకులకు ప్రశాంతతను అందిస్తుంది.బాగ్ భైరబ్ ఆలయం కోపంతో ఉన్న పులి రూపంలో ఉన్న భైరబ్ దేవుడికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ దేవుడిని కీర్తిపూర్ సంరక్షకుడిగా భావిస్తారు. [10]

చిలాంచో స్థూపం

మార్చు
చిలాంచో స్థూపం పనోరమా చిత్రం
 
శ్రీ కీర్తి విహార్ నగర్ మండప్, కీర్తిపూర్

దక్షిణ కొండపై బౌద్ధ క్షేత్రం ఉంది. చిలాంచో విహార్ (మఠం) నేపాల్‌లోని కీర్తిపూర్‌కు తూర్పు వైపున ఉంది.ఇది మధ్యయుగ కాలంలో స్థాపించబడింది. ఈ చైత్యంలో నేపాల్ సంవత్ 635 (లిచ్చవి కాలం) శాసనం కనుగొనబడింది. అందువల్ల, ఇది ఈప్రాంతంలోని అత్యంత ముఖ్యమైన చారిత్రక స్థూపాలలో ఒకటి.స్థూపం చతుర్భుజాకారంలో 9.0-10.5 ఎత్తులో ఉంటుంది.నాలుగు వైపులా చిన్న చైత్యాలున్నాయి.గోపురం గచ్చుతో తెల్లగా చేయబడింది. [11] ఉమా మహేశ్వర్ ఆలయం (స్థానికంగా, క్వాచో డేగా) కీర్తిపూర్ ముఖ్యమైన వారసత్వ ప్రదేశాలలో ఒకటి. ఈ పగోడా తరహా మూడు అంతస్థుల ఆలయం కీర్తిపూర్‌లోని ఎత్తైన ప్రదేశంలో (1414 మీ) ఉంది. ఈ ఆలయం కొండ పైభాగంలో ఉన్నందున, ఖాట్మండు లోయ, లాంగ్టాంగ్, డోర్గే లక్పా, చోభు భామురే, గౌరీశంకర్ వంటి పర్వతాల సుందరమైన దృశ్యాలను కనపడతాయి. [12]ఈ ఆలయాన్ని సా.శ. 1655లో రాజు సిద్ధి నర్సింగ మల్ల కుమారుడు రౌత్ర విశ్వనాథ్ బాబు నిర్మించాడు. ఇది సా.శ. 1832లో సంభవించిన భూకంపంలో ధ్వంసమైంది, సుమారు ఒక శతాబ్దం పాటు శిథిలావస్థలో ఉండిపోయిన తర్వాత, అది మళ్లీ భూకంపం వల్ల ధ్వంసమైన తర్వాత సా.శ. 1933లో పునరుద్ధరించబడింది. స్థానిక ప్రజలు, ప్రభుత్వం దీనిని ప్రస్తుత స్థితిలోకి పునరుద్ధరించడానికి తీవ్ర ప్రయత్నం చేసింది. పునరుద్ధరణ ప్రక్రియ 1982లో పూర్తయింది,2008లో ఆలయ కళలను సంరక్షించడానికి కొంత పని జరిగింది. [13]

నగర మండపం శ్రీ కీర్తి విహార్

మార్చు

సాంప్రదాయ థాయ్ నిర్మాణ శైలిలో నిర్మించిన థెరవాడ బౌద్ధ విహారం, నగరం ప్రవేశ ద్వారం దగ్గర ఉంది.

మూలాలు

మార్చు
  1. "Kirtipur: The City with History and Culture". Nepal Sanctuary Treks (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-09-29. Retrieved 2022-06-12.
  2. "Kirtipur fair to promote local products, culture". kathmandupost.com. Retrieved 2020-12-25.
  3. Centre, UNESCO World Heritage. "Medieval Settlement of Kirtipur". UNESCO World Heritage Centre. Retrieved 2020-12-25.
  4. Kirkpatrick, Colonel (1811). An Account of the Kingdom of Nepaul. London: William Miller. Retrieved 12 October 2012. Page 164.
  5. Giuseppe, Father (1799). "Account of the Kingdom of Nepal". Asiatick Researches. London: Vernor and Hood. Retrieved 5 October 2012. Page 319.
  6. Kirkpatrick, Colonel (1811). An Account of the Kingdom of Nepaul. London: William Miller. Retrieved 5 October 2012. Page 383.
  7. "Kirtipur, Kirtipur City -Nepal, Kirtipur History, about Kirtipur Kathmandu, Kirtipur Attraction, Trip to Kirtipur". www.trip2himalaya.com. Retrieved 2022-06-12.
  8. Kirtipur, ChampaDevi Hill. "ChampaDevi Hill". www.tripnholidays.com. TripnHolidays. Archived from the original on 22 March 2018. Retrieved 24 April 2017.
  9. "Kirtipur, Information about Kirtipur, Kirtipur in Nepal". www.indovacations.net. Retrieved 2022-06-12.
  10. "Bagh Bhairab Temple". www.ourkirtipur.com.np. Archived from the original on 8 July 2015. Retrieved 25 June 2014.
  11. Chilancho Vihar (Monastery)
  12. "Uma Maheshwor". www.ourkirtipur.com. Ourkirtipur. Archived from the original on 3 June 2014. Retrieved 25 June 2014.
  13. Shrestha S.S. (2000). Kirtipur ko Sansritik ra Puratatwit Itihas. Center for Nepal and Asian Studies. Kirtipur, Kathmandu: Tribhuwan University

వెలుపలి లంకెలు

మార్చు