కుంకుమ పువ్వు

(కుంకుమపువ్వు నుండి దారిమార్పు చెందింది)

కుంకుమ పువ్వు (Saffron) ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతలీ ప్రదేశాల్లో పండిస్తారు. కుంకుమపువ్వులో ఉపయోగపడే భాగం - ఎర్ర కేసరాలు మాత్రమే. ఒక కిలో కేసరాలు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. అందుకే కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము. కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటాయి. కుంకుమ పువ్వు గర్భిణులు ఆహారంలో తీసుకుంటే పుట్టే బిడ్డ నల్లగానో, చామనఛాయతోనో కాక తెల్లగానో, ఎర్రగానో పుడతుందని ప్రాచుర్యంలోని విశ్వాసం. అయితే అది సరికాదని, తల్లిదండ్రుల జన్యువులు (దాన్ని వారు జీవించే ప్రదేశం ప్రభావితం చేస్తుంది) తప్ప కుంకుమపువ్వు వంటి ఆహార విషయాలు బిడ్డ రంగును నిర్ణయించడంలో ఏ ప్రభావం చూపలేవని వైద్యులు, పరిశోధకులు చెప్తున్నారు.

కుంకుమ పువ్వు
A saffron crocus flower with red stigma.
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
క్రో. సెటైవస్
Binomial name
క్రోకస్ సెటైవస్
Saffron bulbs for vegetative reproduction

చరిత్ర

మార్చు

కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఈ భూభాగంలో అత్యంత ఆకర్ణీయమైనది, ఖరీదైనది, అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమపువ్వు . ఆ సేతుహిమాచలమే కాదు సీమాంతర భూములు లోను, అరబిక్ ఆచరణలోను, వేదకాలపు సంసృతిలోనూ ప్రాముఖ్యమైన సౌందర్యపోషణ ద్రవ్యమిది . నాటి రాచరికకాలపు దర్పణానికి చిహ్నం ఈ కుంకుమపువ్వు . క్రీ.పూ. 500 సం. ముందే దీని ప్రస్తావం ఉన్నది . కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్‌ ఫ్రాన్‌ అంటారు. ఇది జాఫరాన్‌ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్‌ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండులక్షల పూలు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది.కుంకుమపువ్వు... ఈ పేరు వినగానే కాశ్మీర్‌ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో ఇది కేవలం అక్కడ మాత్రమే పండుతుంది. కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా. అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్‌, ఇరాక్‌, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే అన్నింటిలోకీ కాశ్మీరీ కేసర్‌ నాణ్యమైనది. మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాలంతటా 'కేసర్‌' అంటారు.

కుంకుమ పువ్వు సాగు

మార్చు

కుంకుమ పువ్వును ఇరాన్ దేశం అత్యధికంగా పండిస్తుంది. భారతదేశంలో కుంకుమ పువ్వుని కాశ్మీర్లో పండిస్తారు. వర్షాకాలం చివరలో కుంకుమ దుంపలను దున్నిన భూమిలో నాటుతారు. ఎండాకాలం ఆరంభానికి కోత కోస్తారు. కుంకుమ పువ్వు పండాలి అంటే వాతావరణంలో అధిక తేమ ఉండరాదు, మట్టి గుల్లగా ఉండాలి, అత్యధికంగా ప్రకృతిసిద్ధమైన ఎరువులు వాడాలి, వర్షపాతం తక్కువగా ఉండాలి. దుంప నాటిన రెండు నెలలకే పుష్పాలు పూస్తాయి. శీతాకాలం చివరలో కుంకుమ పువ్వు పంట కోతకు వస్తుంది. కుంకుమ పువ్వును ఇంటివద్ద కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కుండీ మట్టిలో కొబ్బరి పొట్టు, వానపాముల ఎరువు సమానభాగాలుగా ఉండాలి. కుంకుమపువ్వు మొక్కలను పూర్తి ఎండలోగాని, పాక్షిక ఎండలోగాని పెంచుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో అయితే చలి ఎక్కువ ఉండే మెట్టప్రాంతాల్లో పండిచవచ్చు. అయితే దక్షిణ భారతదేశంలో కుంకుమ పువ్వు దుంపలను అక్టోబరు నెలలో నాటితే మంచిది. ఒక్క గ్రాము కాశ్మీర్ కుంకుమ పువ్వు కేసరాలు 230నుండి 240 రూపాయల వరకూ ధర పలుకుతుంది.

పువ్వంటే పువ్వూ కాదు

మార్చు

కుంకుమపువ్వు మొక్క చూడ్డానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుంచి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు వస్తాయి. కాశ్మీర్‌లో పండించే కుంకుమపువ్వు మొక్కకి పైకి ఆకులు కూడా కనిపించవు. కేవలం వంగపండురంగు పువ్వు మాత్రం కనిపిస్తుంది. కాశ్మీర్‌లోని పాంపోర్‌ ప్రాంతంలోని నేలంతా అక్టోబరు - నవంబరులో విరబూసిన కుంకుమపువ్వుతో నిండిపోతుంది. ముందు మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది. అదే కుంకుమపువ్వు అనుకుంటే పొరపాటే. అందులో ముచ్చటగా మూడే అండకోశాలు, రెండు కేసరాలు ఉంటాయి. కిందభాగంలో పసుపు, పైన ఎరుపురంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమపువ్వుగా పిలుస్తారు. ఈ ఎరుపురంగు భాగమే ఘాటైన వాసననీ రుచినీ రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశభాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చుకున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగునీ రుచినీ కోల్పోతాయి. అందుకే, పూసిన పూలన్నింటినీ ఉదయం పదిగంటలలోపే కోసేస్తారు. కిలో కుంకుమపువ్వు కావాలంటే సుమారు లక్షన్నర పూలను సేకరించాలి. అన్నింటి నుంచీ అండకోశాలను చేత్తోనే వేరుచేయాలి. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. శాఫ్రాన్‌ అంత ధర పలకడానికి ఇదీ ఓ కారణమే. మన దగ్గర గ్రాము కుంకుమపువ్వు ధర సుమారు రూ.60 నుంచి 600 వరకూ ఉంటుంది. నాణ్యతనుబట్టి ధర మారుతుంది. మనిషి వాడిన మొదటి సుగంధద్రవ్యం ఇదేనట. సుగంధద్రవ్యాల్లోకెల్లా

ఉపయోగాలు

మార్చు
  • కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు.
  • కుంకుమ పువ్వు నేత్ర వ్యాధులలోను, ముక్కు సంబంధమైన వ్యాధులలోను మందుగా పనిచేస్తుంది. యాభైకి పైబడుతున్నవారు ఆహారంలో కుంకుమపువ్వు తీసుకుంటే కంటికి మేలని వైద్యుల సూచన.
  • ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను తెల్లవారుఝామున సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది.
  • కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.
  • కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి.
  • గర్భిణులు పాలలో కుంకుమపువ్వు కలిపి తాగితే పుట్టే బిడ్డ నల్లగా కాక ఎర్రగా, తెల్లగా పుడతుందని నమ్మకం. అయితే శాస్త్రీయంగా ఇది సరైనది కాదని వైద్యులు చెప్తున్నారు. తల్లిదండ్రుల ఒంటిరంగును బట్టి, వారి జీన్స్ లో నిక్షిప్తమయిన సమాచారం సహాయంతో శరీరంలో వున్న "మెలనో సైట్స్ "నుండీ ఉత్పత్తి అయ్యే "మెలనిన్ "పరిమాణాన్ని బట్టి ఒంటి రంగు నిర్ణయమవుతుందే తప్ప కుంకుమపువ్వుకు ఈ విషయంలో ఏ ప్రభావం ఉండదని చెప్తున్నారు.[1]

కుంకుమ పువ్వు వైద్య పరంగా ఉపయోగాలు...

మార్చు

కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది.రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది.కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కు వగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు.ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు, జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగి స్తారు.ఆలిని క్రమబద్ధీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్‌ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుంద శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్‌మిటర్లను, డోపమైన్‌ ఫైన్లను వృద్ధి చేస్తుంది. దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్‌ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్‌ దీనిలో వుంది కాబ ట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన. గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది . గర్భిణులు మొదటి నెలనుండి కుంకుమపువ్వు వాడవచ్చును ... కానీ మొదటి మూడు నెలలు వేవుళ్ళు (వాంతులు) ఉంటాయి కాబట్టి ... అనుకూలత బట్టి వాడాలి . తేనె, పాలు, పటికి పంచదార లతో కుంకుమ పువ్వు కలిపి తినవచ్చును . కుంకుమ పువ్వుతో గాఢనిద్ర : రాత్రివేళ ఆహారములోనో, ఏదో ఒక పానీయములోనో కొద్దిపాటి రేకులు వేసుకుంటే గాఢమైన నిద్ర పడుతుంది . నిజానికి కుంకుమ పువ్వులో ఈ గుణాలు రోమన్ల కాలము నాడే గుర్తించారు . ధనవంతులైన రోమన్లు గా్ఢముగా నిద్రించేందుకు గాను తమ దిండ్లు పై కుంకుమ పువ్వు ఫిలమెంట్లను కుట్టించుకునేవారట .

నకిలీ కుంకుమ పువ్వు

మార్చు

నాణ్యమైన కుంకుమపువ్వు ధర కిలో సుమారు ఆరు లక్షల రూపాయలు. అందుకే దీనికి నకిలీ ఉత్పత్తులు కూడా ఎక్కువే. కొందరు నాణ్యత, ధర తక్కువగా ఉన్న పర్షియన్‌ కుంకుమపువ్వునే కాశ్మీరీ శాఫ్రాన్‌ పేరుతో అమ్ముతారు. దానిమ్మ పూరేకుల్నీ బీట్‌రూట్‌ తురుముల్నీ కూడా శాఫ్రాన్‌గా అమ్మేవాళ్లూ ఉన్నారు. కొనేది మంచిదా కాదా అన్నది చూడాలంటే ఓ రేకుని కాసిని గోరువెచ్చని నీళ్లు లేదా పాలల్లో వేయాలి. అవి వెంటనే రంగు మారితే అది కచ్చితంగా నకిలీదే. స్వచ్ఛమైన కుంకుమపవ్వు కనీసం 15 నిమిషాలు నానిన తరువాతగానీ అందులోనుంచి రంగు దిగదు. అప్పుడే వాసన కూడా మొదలవుతుంది. పొడిరూపంలో కేసర్‌ని అస్సలు కొనకూడదు. ఇందులో మోసం మరింత ఎక్కువ.

నకిలి కుంకుమ పువ్వు

మార్చు

కుంకుమపువ్వులానే ఆహార పదార్థాలకు రంగునిచ్చే పూమొక్కలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ అన్నింటిలోకీ కుసుంబా లేదా కుసుమపూల రేకులు చాలావరకూ శాఫ్రాన్‌ మాదిరిగానే రంగునిస్తాయి. కుంకుమపువ్వుని కొనలేనివాళ్లు దీన్ని ప్రత్యామ్నాయంగా వాడతారు. దీన్ని 'పోర్చుగీసు శాఫ్రాన్‌' అని కూడా అంటుంటారు. మార్కెట్‌లో ఇదే అసలు కుంకుమపువ్వు అని అమ్మేవాళ్లూ ఉంటారు. అయితే ఇవేమీ కూడా అసలైన కుంకుమపువ్వుకి సాటి రావు. దానిలా వీటికి ఘాటైన పరిమళం ఉండదు. కంటిని మోసం చేయొచ్చేమోగానీ రుచిని బట్టి కనిపెట్టేయవచ్చు.

మూఢ నమ్మకం

మార్చు

గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కొద్దిగా కుంకుమ పువ్వును, పటిక పంచదార కలిపిన ఆవుపాలతో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచి తేజస్సుతో పుడతారని చాలా మంది భావన. అయితే పూర్వకాలం నుండి ఉంటున్న ఈ మూఢనమ్మకంలో వాస్తవం లేదు, శాస్త్రీయంగా కూడా ఎటువంటి ఆధారాలు లేవు.

రసాయనాలు, పోషక విలువలు

మార్చు
Saffron crocus morphology
 
Crocus sativus (saffron crocus) botanical illustration from Kohler's Medicinal Plants
 →  Stamens (male organs).
 →  Corolla (whorl of petals).
 →  Corm (propagation organ).

కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు అనే రసాయనాలు ఉన్నాయి.

పోషక విలువలు : USDA ప్రకారము :

  • శక్తి ----------------15.5%,
  • కార్బోహైడ్రేట్స్ -------50%,
  • ప్రోటీన్స్ -----------21%,
  • ఫ్యాట్స్ -----------21%,
  • విటమిన్స్ --------77%,
  • మినరల్స్ --------37%,
  • విటమిన్‌ ' ఎ ', ఫోలిక్ యాసిడ్, విటమిన్‌ ' సి ' ఎక్కువగా ఉన్నాయి .

మూలాలు

మార్చు
  1. గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా? - డాక్టర్ రొంపిచెర్ల భార్గవి, బీబీసీ తెలుగు