కుడుపూడి సూర్యనారాయణ

కుడుపూడి సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు స్థానిక సంస్థల కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1] కుడుపూడి సూర్యనారాయణ మార్చి 17న  ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[2]

కుడుపూడి సూర్యనారాయణ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
మార్చి 2023
నియోజకవర్గం గవర్నర్ కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 15 మే 1973
గోడి గ్రామం, అల్లవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
తల్లిదండ్రులు గోపాలకృష్ణ గోఖలే (ఐపీఎస్), మహాలక్ష్మి
జీవిత భాగస్వామి డా. విజయ
బంధువులు కుడుపూడి ప్రభాకర రావు (చిన్నాన్న), (అమలాపురం మాజీ ఎమ్మెల్యే)
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

సూర్యనారాయణరావు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకుడుగా పని చేశారు. ఆయన ఎంఎ, బిఎల్‌ పూర్తి చేసి అమలాపురం కోర్టులో న్యాయవాదిగా, బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షునిగా పని చేశాడు. ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌గా పని చేశాడు. సూర్యనారాయణరావు టిడిపి హయాంలో 2000లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేసి అనంతరం బిఎస్‌పి, ప్రజారాజ్యం పార్టీల తరుపున అమలాపురం నుండి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి, కొంతకాలం బిజెపిలో పని చేసి అనంతరం వైసిపిలో చేరాడు.[3]

సూర్యనారాయణరావు ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు స్థానిక సంస్థల నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించగా, మార్చి 17న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికై, మే 15న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  2. Sakshi (17 March 2023). "'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  3. Eenadu (21 February 2023). "పెద్దల సభకు ముగ్గురు". Archived from the original on 6 June 2023. Retrieved 6 June 2023.
  4. 10TV Telugu (15 May 2023). "ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)