కున్నక్కూడి వైద్యనాథన్

భారతీయ వయొలిన్ విద్వాంసుడు

కున్నక్కూడి వైద్యనాథన్ (1935 – 2008) ఒక కర్ణాటక శాస్త్రీయ సంగీత వాయులీన విద్వాంసుడు, సంగీత దర్శకుడు.

కున్నక్కూడి వైద్యనాథన్
కున్నక్కూడి వైద్యనాథన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంవైద్యనాథన్ రామస్వామి శాస్త్రి
జననం(1935-03-02)1935 మార్చి 2
కున్నక్కూడి, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా
మరణం2008 సెప్టెంబరు 8(2008-09-08) (వయసు 73)
మద్రాసు, తమిళనాడు, భారతదేశం
వాయిద్యాలువయోలిన్

ఆరంభ జీవితం

మార్చు

ఇతడు 1935 మార్చి 2వ తేదీన తమిళనాడు రాష్ట్రం, శివగంగ జిల్లా కుండ్రకూడి గ్రామంలో జన్మించాడు. ఇతడు తన తండ్రి రామస్వామి శాస్త్రి వద్ద వాయులీనం నేర్చుకున్నాడు.[1]

వృత్తి

మార్చు

ఇతడు తన 12వ యేటి నుండి వాయులీన ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ఇతడు అరియకుడి రామానుజ అయ్యంగార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మహారాజపురం సంతానం వంటి అగ్రశ్రేణి గాయకులకు, టి.ఎన్.రాజరత్నం పిళ్ళై, తిరువేంగడు సుబ్రహ్మణ్య పిళ్ళై వంటి నాదస్వర విద్వాంసులకు వాద్య సహకారం అందించాడు.[1] 1976లో ఇతడు ఇతర కళాకారులకు ప్రక్కవాద్యం అందించడం నిలిపివేసి ఎక్కువగా సోలో కచేరీలపై దృష్టిని కేంద్రీకరించాడు. ఇతడు డోలు కళాకారుడు వలయపట్టి ఎ.ఆర్.సుబ్రమణ్యంతో కలిసి 3000కు పైగా ప్రదర్శనలిచ్చాడు. ఇతనికి మ్యూజిక్ థెరపీ పట్ల అపారమైన నమ్మకముంది.

సినిమా సంగీతం

మార్చు

తమిళ దర్శకుడు ఎ.పి.నటరాజన్ ఇతడిని తన వా రాజా వా అనే తమిళ సినిమాలో సంగీత దర్శకుడిగా పరిచయం చేశాడు. ఇతడు అగత్యార్, రాజ రాజ చోళన్ వంటి విజయవంతమైన తమిళ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.[1]

ఇతడు 2005లో ఎస్. శంకర్ విడుదలైన అన్నియన్ అనే తమిళ సినిమాలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాల సన్నివేశంలో "అయ్యంగారు వీటు" అనే పాటలో నటించాడు. మరి కొన్ని తమిళ సినిమాలలో అతిథిపాత్రలలో కనిపించాడు.

ఇతడు టి.ఎన్.శేషగోపాలన్ ముఖ్యపాత్రలో "తోడి రాగం" అనే సినిమాను నిర్మించాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు.

అవార్డులు

మార్చు

ఇతనికి పద్మశ్రీ పురస్కారం, కళైమామణి, సంగీత నాటక అకాడమీ అవార్డు, "కర్ణాటక ఇసైజ్ఞాని", "సంగీత కళాశిఖామణి" మొదలైన అవార్డులు, బిరుదులు లభించాయి. "తిరుమలై తేన్‌కుమారి" సినిమాకు ఇతడికి తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును ప్రకటించింది. 2000లో "రాజా శాండో" అవార్డు లభించింది.

ఇతర విశేషాలు

మార్చు

ఇతడికి ఆకాశవాణితో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది. "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌కు కార్యదర్శిగా సేవలను అందించాడు. తిరువయ్యారులోని త్యాగబ్రహ్మ సభకు కార్యదర్శిగా అనేక సంవత్సరాలు త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహించాడు. ఇతడు "రాగ రీసెర్చ్ సెంటర్"కు అధ్యక్షుడిగా పనిచేశాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Kunnakudi Vaidyanathan Dead". The Hindu. 9 September 2008. Retrieved 2017-09-09.

బయటి లింకులు

మార్చు