కుబేర్‌నాథ్ రాయ్

ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్ (1933 మార్చి 26 - 1996 జూన్ 5) భారతీయ హిందీ సాహితీవేత్త, సంస్కృత పండితుడు, రచయిత.[1]

కుబేర్‌నాథ్ రాయ్
2019లో భారతప్రభుత్వం విడుదల చేసిన తపాలా బిళ్ళపై కుబేర్‌నాథ్ రాయ్
పుట్టిన తేదీ, స్థలం(1933-03-26)1933 మార్చి 26
మత్స గ్రామం, దిల్దార్‌నగర్ కంసర్, ఘాజీపూర్, ఉత్తర ప్రదేశ్, బ్రిటిష్ ఇండియా
మరణం1996 జూన్ 5(1996-06-05) (వయసు 63)
మత్స గ్రామం, వారణాసి డివిజన్‌, ఘాజీపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
వృత్తిరచయిత, వ్యాసకర్త, పండితుడు, కవి
జాతీయతభారతీయుడు
గుర్తింపునిచ్చిన రచనలుప్రియా నీలకంఠి, గంధమదన్, కామధేను, రామాయణ మహాతీర్థం, నిషాద్ వేణువు, రాస్ ఆఖేతక్, విశాద్ యోగ్
పురస్కారాలుభారతీయ జ్ఞానపీఠ్
జీవిత భాగస్వామిమహారాణి దేవి
తండ్రివకుంత్ నారాయణ్ రాయ్
తల్లిలక్ష్మీ రాయ్

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా మత్స గ్రామంలో భూమిహార్ బ్రాహ్మణ కుటుంబంలో 1933 మార్చి 26న జన్మించాడు. అతని తండ్రి వకుంత్ నారాయణ్ రాయ్, తల్లి లక్ష్మీ రాయ్. కుబేర్‌నాథ్ రాయ్ తన ప్రాథమిక విద్య మత్స గ్రామంలోనే సాగింది. అయితే వారణాసిలోని క్వీన్స్ కాలేజీలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసాడు. ఉన్నత చదువుల కోసం బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) లో చేరాడు. అతను కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేసాడు.

కెరీర్ మార్చు

టీచింగ్ కెరీర్ మార్చు

ఆయన కోల్‌కతాలోని విక్రమ్ విశ్వవిద్యాలయంలో తన ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించాడు, కానీ కొద్ది రోజుల్లోనే ఆంగ్ల సాహిత్యంలో లెక్చరర్‌గా అస్సాంలోని నల్బరీకి మారాడు. ఇక్కడ ఆయన 1958 నుండి 1986 వరకు విధులు నిర్వర్తించాడు. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో ఉన్న స్వామి సహజానంద సరస్వతి పిజి కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతిపై వెళ్లిన ఆయన 1995లో పదవీ విరమణ పొందాడు.

సాహిత్యం మార్చు

కుబేర్ నాథ్ రాయ్ పూర్తిగా వ్యాస రూపంలో తన రచనలను కొనసాగించాడు.[2]

ఆయన గంధ మదన్, ప్రియా నీల్-కాంతి, రాస్ ఆఖేతక్, విశాద్ యోగ్, నిషాద్ బన్సూరి, పర్ణ ముకుత్ వ్యాసాల సంకలనాలు వ్యాస రూపాన్ని అపారంగా సుసంపన్నం చేశాయి.[2] ఆయన భారతీయ సంస్కృతి, పాశ్చాత్య సాహిత్యంలో పండితుడు అయినా భారతీయ వారసత్వం గురించి గర్వపడ్డాడు. సహజ సౌందర్యం ఉట్టిపడే భారతీయ జానపద సాహిత్యాలపై ఆయనకున్న ప్రేమ, యంత్రాల యుగంలోనూ వ్యవసాయ సమాజానికి ప్రాధాన్యత, అతని శృంగార దృక్పథం, సౌందర్య సున్నితత్వం, సమకాలీన వాస్తవికత, శాస్త్రీయ శైలిపై ఆయన శ్రద్ధ హిందీ సాహిత్యంలోని సమకాలీన వ్యాసకర్తలలో అతన్ని చాలా ఉన్నత స్థానంలో నిలిపింది.[2]

వ్యాసాల సేకరణ మార్చు

  • కుబేరనాథ్ రాయ్ ప్రతినిధి వ్యాసాలు, సాహిత్య భవన్ (అలహాబాద్), 1991
  • కుబేర్ నాథ్ రాయ్ కలెక్షన్, సాహిత్య అకాడమీ

పురస్కారాలు మార్చు

మరణం మార్చు

63 ఏళ్ల ఆయన తన స్వగ్రామమైన మత్సాలో 1996 జూన్ 5న తుదిశ్వాస విడిచాడు.[4]

మూలాలు మార్చు

  1. "Azadi Ka Amrit Mahotsav: Kubernath Roy is a Hindi Writer - Sakshi". web.archive.org. 2023-06-05. Archived from the original on 2023-06-05. Retrieved 2023-06-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 2.3 Tiwari, Vishwanath Prasad (2007). Bharatiya Sahitya ke Nirmata. Sahitya Akademi.
  3. 3.0 3.1 Maheshwari, Suresh (1999). Lalita nibandhakāra Kuberanātha Rāya : vyaktitva-kr̥titva kī lalita ālocanā. Bhavana Prakashan. p. 192. ISBN 978-81-7667-000-5.
  4. विश्वनाथ प्रसाद तिवारी, कुबेरनाथ राय, साहित्य अकादमी पृ॰7