కుమార సంగక్కర

శ్రీలంక క్రికెట్ ఆటగాడు

1977, అక్టోబర్ 27న జన్మించిన కుమార సంగక్కర (Kumar Chokshanada Sangakkara) శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతడు ఎడమ చేతి బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్. ప్రారంభంలో బ్యాట్స్‌మెన్‌గా క్రీడాజీవితం ప్రారంభించిననూ క్రమక్రమంగా వికెట్ కీపర్‌గా కూడా విధులను నిర్వహిస్తున్నాడు. 2007, డిసెంబర్ 6న LG ICC టెస్ట్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్‌గా ప్రకటించబడ్డాడు. శ్రీలంక తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ ఇతడే. టెస్ట్ క్రికెట్‌లో వరుసగా నాలుగు సార్లు 150 పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్ కూడా సంగక్కరే.[1]

కుమార సంగక్కర
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి ఎడమచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ ఆఫ్‌స్పిన్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 71 213
పరుగులు 6032 6277
బ్యాటింగ్ సగటు 56.37 36.28
100లు/50లు 16/24 7/42
అత్యుత్తమ స్కోరు 287 138*
ఓవర్లు 1 -
వికెట్లు 0 -
బౌలింగ్ సగటు - -
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 -
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ - -
క్యాచ్ లు/స్టంపింగులు 149/20 195/54

As of జనవరి 24, 2008
Source: [1]

క్రీడాజీవితంలో ముఖ్యఘట్టాలుసవరించు

2006 జూలైలో సంగక్కర మహేలా జయవర్థనేతో కలిసి 624 పరుగులు భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాపై సాధించిన ఈ స్కోరు ఫస్ట్ క్లాన్, టెస్ట్ క్రికెట్‌లో ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్య రికార్డు. అదే ఇన్నింగ్సులో సంగక్కర వ్యక్తిగతంగా 287 పరుగులు సాధించి తన అత్యధిక స్కోరును మెరుగుపర్చుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 4 సార్లు డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. అతడు చేసిన 16 సెంచరీలలో చాలా వరకు అత్యధిక పరుగుల వద్దకు లాక్కొచ్చాడు. సెంచరీ చేయగానే వికెట్ పారేసుకొనే తవ్తం కాకుండా బాధ్యతాయుత బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించాడు. డిసెంబర్, 2007లో వరుసగా 4 సార్లు 150పై చిలుకు పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గాను రికార్డు సృష్టించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలుసవరించు

సంగక్కర 71 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 56.37 సగటుతో 6032 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు, 24 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 287 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలుసవరించు

కుమార సంగక్కర 213 వన్డేలు ఆడి 36.28 సగటుతో 6277 పరుగులు సాధించాడు. అందులో 7 సెంచరీలు, 42 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 138 (నాటౌట్).

ప్రపంచ కప్ క్రికెట్సవరించు

సంగక్కర 2 పర్యాయాలు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2003లో మొదటి సారి, 2007లో రెండో సారి ప్రపంచ కప్ పోటీలలో పాల్గొన్నాడు.

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. LG ICC Cricket Rankings