కుల్దీప్ సేన్
కుల్దీప్ రాంపాల్ సేన్, మధ్యప్రదేశ్ కు చెందిన భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. దేశీయ క్రికెట్‌లో మధ్యప్రదేశ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. కుడిచేతి ఫాస్ట్ బౌలర్ బౌలర్ గా రాణించిన కుల్దీప్ 145kmph కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తాడు.[1][2] 2022 డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన భారత పర్యటనలో మొదటి వన్డేలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | కుల్దీప్ రాంపాల్ సేన్ |
పుట్టిన తేదీ | హరిహర్‌పూర్, రీవా, మధ్యప్రదేశ్, | 1996 అక్టోబరు 22
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ |
పాత్ర | బౌలింగ్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
ఏకైక వన్‌డే (క్యాప్ 250) | 2022 డిసెంబరు 4 - బంగ్లాదేశ్ తో |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2018–ప్రస్తుతం | మధ్యప్రదేశ్ |
2022–ప్రస్తుతం | రాజస్థాన్ రాయల్స్ |
మూలం: Cricinfo, 4 డిసెంబరు 2022 |
జననం
మార్చుకుల్దీప్ 1996, అక్టోబరు 22న మధ్యప్రదేశ్ రాష్ట్రం, రేవా జిల్లాలోని హరిహర్‌పూర్ గ్రామంలో జన్మించాడు.[4][5] తండ్రి నేరు రామ్ పాల్ సేన్ మంగలి. ఐదుగురు పిల్లలలో మూడవవాడైన కుల్దీప్, తన 8 సంవత్సరాల వయస్సు నుండి క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.[6] కోచ్ అరిల్ ఆంథోనీ దగ్గర నేర్చకున్నాడు.[7]
క్రికెట్ రంగం
మార్చు2018-19 రంజీ ట్రోఫీలో 2018 నవంబరు 1న మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[8] 2018 నవంబరు 21న, పంజాబ్‌పై ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తొలి ఐదు వికెట్లు సాధించాడు.[9] 2019 ఫిబ్రవరి 24న 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[10] 2019-20 విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున 2019 సెప్టెంబరు 25న లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[11]
2022 సెప్టెంబరులో న్యూజిలాండ్ ఎ క్రికెట్ జట్టుతో 3 మ్యాచ్ ల వన్డే-సిరీస్ కోసం భారతదేశం ఎ జట్టుకు ఎంపికయ్యాడు.[12]
2022 నవంబరులో న్యూజిలాండ్ 3-వన్డే సిరీస్ కోసం భారత జట్టులోకి వచ్చాడు.
2022 డిసెంబరులో భారతదేశం తరపున వన్డేల్లోకి అరంగేట్రం చేసాడు. మూడు మ్యాచ్‌లలో మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడాడు. అరంగేట్రంలో తక్కువ స్కోరింగ్‌లో రెండు వికెట్లు తీశాడు.[13]
మూలాలు
మార్చు- ↑ "IND vs NZ 2022: Meet India's New Pace Sensation Kuldeep Sen". News18 (in ఇంగ్లీష్). Retrieved 2023-08-07.
- ↑ "Kuldeep Sen". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "Bangladesh v India at Mirpur, Dec 4 2022". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ Manoj (11 April 2022). "Who is Kuldeep Sen? – All you need to know about RR's pace sensation". CricTracker.
- ↑ Desk, India com Sports. "Kuldeep Sen: From A Small Salon In Rewa to IPL Glory - He Got Game | Rags to Riches Story of Kuldeep Sen IPL 2022 | Kuldeep Sen Profile RR vs LSG". www.india.com.
- ↑ Acharya, Shayan. "Who is Kuldeep Sen, Rajasthan bowler who defended 15 against Stoinis in last over vs Lucknow". Sportstar.
- ↑ Raj, Pratyush (12 April 2022). "Rajasthan Royals's Kuldeep Sen, son of a barber, is IPL's latest pace sensation". Indian Express. Retrieved 2023-08-07.
- ↑ "Elite, Group B, Ranji Trophy at Dindigul, Nov 1-4 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "Ranji Highlights: Siddharth's ton, Dubey's seven-fer setup Karnataka-Mumbai contest". CricBuzz. Retrieved 2023-08-07.
- ↑ "Group C, Syed Mushtaq Ali Trophy at Indore, Feb 24 2019". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Sep 25 2019". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "India A squad for New Zealand A series: Sanju Samson named captain, U19 World Cup star Raj Bawa included". Indian Express. Retrieved 2023-08-07.
- ↑ "Get Ball by Ball Commentary of India vs Bangladesh, India in Bangladesh, 1st ODI | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2023-08-07.