రీవా జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రీవా జిల్లా ఒకటి. రీవా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. రీవా తెల్లపులులకు కేంద్రంగా ఉంది. రీవా తెల్లపులకు కూడా గుర్తించబడుతుంది.

Rewa జిల్లా
रीवा जिला
మధ్య ప్రదేశ్ పటంలో Rewa జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Rewa జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుRewa
ముఖ్య పట్టణంRewa, India
Government
 • లోకసభ నియోజకవర్గాలుRewa
విస్తీర్ణం
 • మొత్తం6,240 కి.మీ2 (2,410 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం23,63,744
 • జనసాంద్రత380/కి.మీ2 (980/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.42%
 • లింగ నిష్పత్తి930
ప్రధాన రహదార్లుNH 7, NH 27, NH 75
Websiteఅధికారిక జాలస్థలి
టన్నుల నదిపై పుర్వ జలపాతం
The Keoti Fall in Rewa Madhya Pradesh

భౌగోళికం

మార్చు

Rewa lies between 24-0- 18’ నుండి 25- 0 - 12’ డిగ్రీల ఉత్తర అక్షాంశం 81 - 0 - 2’, 82 - 0 - 18’. తూర్పు రేఖాంశంలోనూ ఉంది.[1] .

సరిహద్దులు

మార్చు

జిల్లా ఉత్తర సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు, ఆగ్నేయ సరిహద్దులో సిద్ధీ జిల్లా, దక్షిణ సరిహద్దులో షాడోల్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో సత్నా జిల్లా ఉన్నాయి.[2] హుజూర్, సిర్మౌర్, ముగంజ్ తాలూకాలు కైమూర్ భూభాగంలో దక్షిణంలో ఉన్నాయి. వింద్యపర్వతాలు ఉత్తరం, అక్కడి నుండి రీవా (అప్రిహా) ఉంది. ఉత్తరంలో ఉన్న తియోంతర్ తాలూకా భౌగోళికంగా పీఠభూమిలోని మిగిలిన తాలూకాలకంటే విభిన్నంగా ఉంటుంది. రీవా పీఠభూమి దక్షిణం ఉత్తరానికి ఏటావాలుగా ఉండి ఉత్తరంలో దిగుడు భూమి ఉంటుంది. ఉత్తరంలో ఎత్తు సముద్రమట్టానికి 450మీ ఎత్తున ఉంటుంది. తియోంతర్ మైదానంలోని సారవంతమైన భూమి సముద్రమట్టానికి 100 మీ. ఎత్తు మాత్రమే ఉంటుంది. జిల్లాలోని భూభాగాలు సారవంతమైన మైదానాలు, పర్వత ప్రాంతం, లోయలు, నిటారు పర్వతాలు, నదులు, జలపాతాలు కలగలుపుగా ఉండి భౌగోళిక విభిన్నత కలిగి ఉన్నాయి. జిల్లాలో జన్మించిన తామసా, సన్ నదులు గంగానదిలో సంగమిస్తున్నాయి.[1]

నదులూ జలపాతాలు

మార్చు

రీవా నగరం నుండి బిచియా నది ప్రవహిస్తుంది. తామసా నది, దాని ఉపనదీ జలపాతాల రీవా పీఠమూమి నుండి ప్రవహిస్తుంటాయి. చాచై జలపాతం (127) మీ. జలాలు తామసా ఉపనది బింద్ నదికి చేరుకుంటాయి. కెయోతీ జపాతం (98మీ) జలాలు మహానా నదికి చేరుకుంటాయి. బహుతీ జలపాతం (145మీ) జలం బెలాహ్ నది ఉపనది ఒడ్డా నదికి చేరుకుంటాయి. బెలాహ్ నది తామసానదికి ఉపనది. పూర్వా జలపాతం ( 70 మీ) జలాలు తామసా నదికి చేరుకుంటాయి.[3]

విభాగాలు

మార్చు

రీవా జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి :- మంగవ, నైగర్హి, శ్రీమౌర్, జావా, తెఒంథర్, హనుమన, హుజుర్, రాయ్పూర్ కర్చులీన్, మౌగంజ్, సెమరియ.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,363,744,[4]
ఇది దాదాపు. లటివ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం..[6]
640 భారతదేశ జిల్లాలలో. 191వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 374 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.79%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 73.42%.[4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 930:1000 [4]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

మార్చు

రీవా జిల్లాలో హిందీ ప్రధాన, అధికార భాషగా ఉంది.ఆస్ట్రోయాసియాటిక్ భాషాకుటుంబానికి చెందిన అగరియా భాషకు 72,000 వాడుకరులు ఉన్నారు.[7] రీవా జిల్లాలో బఘేలి భాష వాడుకలో ఉంది. ఇది హిందీ భాషను పోలి ఉంటుంది. ఈ భాష 72.91% ప్రజలకు వాడుక భాషగా ఉంది.[8] (జర్మన్, ఇంగ్లీష్ 60% పోల్చితే) [9] ఈ భాషకు 78,00,000 మంది వాడుకరులు ఉన్నారు.[8]

పర్యాటకం

మార్చు

దియోర్కొర్తర్ (దెయూర్) లో ప్రసిద్ధ బుద్ధస్థూపం ఉంది. క్రీ.పూ 3 వ శతాబ్దంలో మౌర్యచక్రవర్తి అశోకుడు ఈ స్థూపాన్ని నిర్మించారని భావిస్తున్నారు. పురాతన కాలంలో ఈ ప్రాంతం దక్షుణాపథంలో భాగంగా ఉండేది. దక్షిణాపథం అంటే తూర్పు పడమరలుగా ఉన్న వ్యాపార మార్గం. పాటలీపుత్ర (పాట్నా) నుండి మహారాష్ట్రం లోని ప్రతిష్ఠానపురం వరకు ఉండేది.

తెల్లపులి

మార్చు

రీవాలో మహారాజా మార్తాండ సింఘ్ దాదాపు 2 సంవత్సరాల పులిపిల్లను ఈ ప్రాంతంలో పట్టుకున్నాడు. పులి మహారాజ వేసవి శిబిరంలో 5 జీవించిన తరువాత మరణించింది. తరువాత దీనిని స్టఫ్ చేసి రాజా జార్జ్‌కు విశ్వాశచిహ్నంగా పంపాడు. ఇప్పటి వరకు తెల్లపులి మహారాజా వేసవి నిడిది (గోవిందగర్) లో బధ్రపరచబడి ఉంది.

మోహన్

మార్చు

1951లో మహారాజా మార్తాండ సింగ్ పట్టుకున్న తెల్ల పులిపిల్ల పేరు మోహన్. మహారాజా మార్తాండ సింగ్ బంధవ్‌గర్ వద్ద వేటాడుతున్న సమయంలో మే 25న ఈ పులిపిల్ల పట్టుబడిన 4 పులి పిల్లాలలో ఇది తెల్లపులి పిల్ల ఒకటని రికార్డులో ఉంది. పులి కాల్చబడింది. తరువాత తెల్లపులి పిల్ల తప్పించుకున్నది. తరువాత తెల్ల పులిపిల్లను పట్టుకుని 150 గదులున్న మహారాజా వేసవి నిడిదిలో ఒక పెద్ద ఆవరణలో సంరక్షించబడింది. (ఆరోజులలో రాజులు పులులను వాటి పిల్లలతో వేటాడడానికి అనుమతి ఉంది). పట్టుబడిన 3 రోజులలో తెల్లపులిపిల్ల తప్పించుకున్నది. తరువాత తీవ్రంగా శోధించిన తరువాత తిరిగి పట్టుబడింది. తరువాత పులిపిల్లను బంధించిన ఆవరణను సరిచేసి పులిపిల్లను అక్కడ బంధించారు. తరువాత అది మోహన్ అన్నపేరుతో తనజీవితకాలం అక్కడే గడిపుంది.

ఆర్ధికం

మార్చు

రీవా జిల్లా గుండా లైమ్‌స్టోన్ బెల్ట్ ఉంది. జిల్లాలో సమీపంలోని షాడోల్, సిధి, ఉమరియా, సింగ్రౌలి జిల్లాలో బొగ్గునిక్షేపాలు లభించాయి. సమీపంలోని నౌబస్తా, సత్నా (బెలా), సిధి (భగ్వర్) జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. జయపీ గ్రూప్ జయపీ నగర్ పేరుతో రీవాలో టౌన్ షిప్ నిర్మించింది. ఆసియాలోని అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ " ప్రిసం సెమెంట్ " (గతంలో రాశి సెమెంట్), రీవా సమీపంలో ఉంది. జిల్లాలో వింద్యా టెలే లింక్స్, బిర్లా ఎరిక్షన్ లిమిటెడ్ కూడా ఉన్నాయి.

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రీవా జిల్లా ఒకటి అని గుర్తించింది.[10] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[10]

పర్యాటకం

మార్చు

రైలుమార్గం

మార్చు

రీవా జిల్లా రైలుమార్గాలతో అనుసంధానించబడి ఉంది. ఇక్కడి నుండి సత్నాకు 50 కి.మీ రైలుప్రయాణంతో చేరుకోవచ్చు. సత్నా రైల్వే స్టేషను ముబై - హౌరా మార్గంలో ఉంది.

రోడ్డు

మార్చు
  • జాతీయరహదారి -7, వారణాసి- కన్యాకుమారి మార్గం రీవా మీదుగా పయనిస్తుంది. ఈ మార్గం రీవాను మిర్జాపూర్, కట్నీ, జబల్‌పూర్, నాగ్పూర్, హైదరాబాదు, బెంగుళూరులతో కలుపుతుంది.
  • జాతీయరహదారి -27 రీవా- అలహాబాద్
  • జాతీయరహదారి - 75 రీవా- రాంచి.

వాయుమార్గం

మార్చు
  • సమీపంలో ఉన్న విమానాశ్రయం :- ఖజూరహో.
  • రీవాలోని చుర్హత్ ఎయిర్ స్ట్రిప్ ఉంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Rewa district". Rewa district administration. Retrieved 2010-08-18.
  2. "Rewa". mponline. Archived from the original on 2010-07-14. Retrieved 2010-08-18.
  3. K. Bharatdwaj. Physical Geography: Hydrosphere. Google books. Retrieved 2010-07-11. {{cite book}}: |work= ignored (help)
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  7. M. Paul Lewis, ed. (2009). "Agariya: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  8. 8.0 8.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  9. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  10. 10.0 10.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.

వెలుపలి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు