కుల్లూ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం
(కుల్లు నుండి దారిమార్పు చెందింది)

కుల్లూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. కుల్లూ జిల్లాకు ముఖ్య పట్టణం కూడా. ఇది కుల్లూ లోయలో బియాస్ నది ఒడ్డున ఉంది.

కుల్లూ
కుల్లూ
పట్టణం
కుల్లు
కుల్లు
దేశం India
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాకుల్లు
Elevation
1,279 మీ (4,196 అ.)
జనాభా
 (2011)
 • Total18,536
భాషలు
 • అధికారికHindi
Time zoneUTC+5:30 (IST)
PIN
175101
టెలిఫోన్ కోడ్01902
లింగ నిష్పత్తి1.17 (1000/852) /
Websitewww.hpkullu.gov.in

కుల్లూ లోయ మనాలి, లార్గి ల మధ్య బియాస్ నది వలన ఏర్పడిన వెడల్పైన బహిరంగ లోయ. దేవాలయాలకు, పైన్ దేవదారు అడవులు కప్పేసిన కొండలకు, విస్తారమైన యాపిల్ తోటలకూ ఈ లోయ ప్రసిద్ధి చెందింది. కుల్లూ లోయ, పీర్ పంజాల్ శ్రేణి, దిగువ హిమాలయాలు, మహా హిమాలయ శ్రేణుల మధ్య ఉంది. కుల్లూ నుండి 10 కి.మీ. దూరం లోని భుంతర్ వద్ద విమానాశ్రయం ఉంది.

భౌగోళికం

మార్చు
 
బియాస్ నది ఒడ్డున కుల్లూ.

కుల్లూ పట్టణం సముద్ర మట్టానికి 1278 మీటర్ల ఎత్తున, బియాస్ నది ఒడ్డున ఉంది. పట్టణానికి తూర్పున బిజ్లీ మహాదేవ్, మౌంటీ నాగ్, ప్యూద్ వంటి ఆలయాలున్న విశాలమైన పర్వత శిఖరాలున్నాయి. శిఖరాలకు ఆవల పార్వతి నది వెంబడి మణికరన్ లోయ ఉంది. ఈ నది భుంతర్ వద్ద గల సంగం వద్ద బియాస్‌తో కలుస్తుంది. కుల్లూకు దక్షిణాన భుంతర్, అవుట్, మండి పట్టణాలున్నాయి. సిమ్లా నుండి సిరాజ్ లోయ మీదుగా గాని, పడమటి వైపున ఉన్న జోగిందర్ నగర్ వరకు, అక్కడి నుండి కాంగ్రా వరకు వెళ్ళే దారిలోని కనుమల గుండా గానీ కుల్లూ వెళ్ళవచ్చు. ఉత్తరాన ఉన్న మనాలి పట్టణం నుండి రోహ్తాంగ్ పాస్ ద్వారా లాహౌల్, స్పితి లోయలోకి వెళ్ళవచ్చు.

ఈ లోయలో విభిన్నమైన జీవవైవిధ్యం ఉంది. ఇక్కడ హిమాలయన్ తహర్, వెస్ట్రన్ ట్రాగోపాన్, మోనాల్, హిమాలయన్ బ్రౌన్ ఎలుగుబంటి వంటి అరుదైన జంతువులున్నాయి . గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ (జిహెచ్ఎన్పి) కూడా ఇక్కడ ఉంది. ఈ ఉద్యానవనాన్ని 1984 లో స్థాపించారు. ఇది 1500 నుండి 6000 మీటర్ల ఎత్తున, 1171 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది ఈ హిమాలయ ప్రాంతం లోని వృక్ష, జంతుజాలాలను రక్షించడానికి, ఖోఖాన్ అభయారణ్యం, కైస్ అభయారణ్యం, తీర్థన్ అభయారణ్యం, కనవార్ అభయారణ్యం, రూపి బాబా అభయారణ్యం, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, వన్ విహార్ మనాలి వంటి అనేక వన్యప్రాణుల అభయారణ్యాలను స్థాపించారు.

వేసవి కాలంలో కుల్లూ లోయలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. శీతాకాలంలో డిసెంబరు, జనవరి నెలల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు −4 నుండి 20 °C (25 నుండి 68 °F) ఉంటాయి. కొంత హిమపాతం కూడా జరుగుతుంది. శీతాకాలంలో సాయంత్రం, ఉదయం చాలా చల్లగా ఉంటాయి. వేసవిలో మే, ఆగస్టుల మధ్య అత్యధిక ఉష్ణోగ్రత 24 నుండి 34 °C (75 నుండి 93 °F) ఉంటుంది. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురుస్తాయి. వీటిలో 150 mమీ. (5.9 అం.) నెలవారీ వర్షపాతం ఉంటుంది. అక్టోబరు, నవంబరులలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కుల్లూ జనాభా 4,37,903. మగవారు 2,25,452, ఆడవారు 2,12,451. లింగ నిష్పత్తి: 1000 మంది పురుషులకు 942 స్త్రీలు. కుల్లూ అక్షరాస్యత 79.40%, పురుషుల అక్షరాస్యత 87.39%, స్త్రీల అక్షరాస్యత 70.91%.

పట్టణ ప్రశస్తి

మార్చు

హిందువులు, బౌద్ధులు, సిక్కులకు చెందిన అనేక పుణ్యక్షేత్రాలు ఉన్న కారణంగా కులు లోయను "దేవతల లోయ" లేదా "దేవ భూమి" అని అంటారు.[1] కులు లోయ పచ్చికభూములకు, హిమాలయ పర్వత శ్రేణి లోని సుందరమైన దృశ్యాలకూ ప్రసిద్ది చెందింది. కుల్లూ ప్రాంతం శాలువలకు కూడా ప్రసిద్ది చెందింది. పాష్మినా, గొర్రె-ఉన్ని, అంగోరాతో సహా అనేక సహజమైన నూలుతో వీటిని తయారు చేస్తారు. రాముడు, రావణుడిపై విజయం సాధించిన సందర్భంగా చేసుకునే కులు దసరా వేడుక ఏడు రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ హిందూ పంచాంగం ప్రకారం అక్టోబరు / నవంబరు నెలల్లో జరుగుతుంది.

మూలాలు

మార్చు
  1. "Valley of the Gods". IGNCA. Archived from the original on 3 March 2016. Retrieved 2007-03-26.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కుల్లూ&oldid=3960782" నుండి వెలికితీశారు